- Home
- Entertainment
- Guppedantha Manasu: వసు,రిషి లకు సలహాలు ఇచ్చిన జయచంద్ర.. దేవయాని నోరు మూయించిన రిషి?
Guppedantha Manasu: వసు,రిషి లకు సలహాలు ఇచ్చిన జయచంద్ర.. దేవయాని నోరు మూయించిన రిషి?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 3 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి, జయచంద్రతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు వసుధార రిషికి సైగలు చేస్తూ ఉంటుంది. అది గమనించిన జయచంద్ర పక్కనే ఉన్న చున్నీని చూసి రిషి ఈ గదిలో ఎవరైనా ఆడవారు ఉండేవారా అని అడుగుతారు. అప్పుడు రిషి వసుధార వైపు చూడక వసుధార చున్నీవైపు చూడమంటూ సైగలు చేస్తుంది. అప్పుడు రిషి వసుధార దాన్ని తీసేయ్ అనగా వసుధార దాన్ని తీసేస్తుంది. ఇది గెస్ట్ రూమ్ సార్. భోజనం ఇక్కడికి తీసుకురావాలా లేకుంటే మాతో కలిసి భోజనం చేస్తారా అనగా మీ ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తాను అని అంటారు జయచంద్ర.
ఆ తర్వాత అందరూ కలిసి ఆనందంగా భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఫణీంద్ర మీకు గది కంఫర్ట్ గా ఉంది కదా అనగా నాకు ఎటువంటి వాతావరణం అయినా ఇట్టే అలవాటు పడిపోతాను కొన్ని కొన్ని సార్లు నేను పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు అక్కడ పూరి గుడిసెల్లో కూడా పడుకోవాల్సి వస్తుంది అందుకే అలవాటు చేసుకుంటాను అని అంటారు. అప్పుడు ధరణిని కూర్చోమని చెప్పగా ధరని వసుధర కూర్చో వెళ్లి నేను వడ్డిస్తాను అని అంటుంది. అప్పుడు జయచంద్ర వెళ్లి నీ భర్త పక్కన కూర్చోమ్మ అని అనడంతో జగతి, మహేంద్ర సంతోషపడతారు. అప్పుడు జయచంద్ర రిషి వసుధారలను గమనిస్తూ ఉంటాడు. అప్పుడు జయచంద్ర ధరణి భర్త గురించి అడుగుతాడు.
అప్పుడు జయచంద్ర వసుధార వైపు అలాగే చూస్తుండగా సర్ ఈ కర్రీ వేసుకోండి అని అంటుంది. అప్పుడు వసుధారకి పొలమారడంతో జాగ్రత్తగా తిను వసుధార అనగా సరే సార్ అని అంటుంది. అప్పుడు జయచంద్ర అదేంటమ్మా ఎవరైనా భర్తను ఏవండీ అని పిలుస్తారు లేదంటే పేరు పెట్టి పిలుస్తారు నువ్వేంటి సార్ అనే పిలుస్తున్నావు అని అంటాడు. అప్పుడు వసుధార ఆయన్ని పెళ్లికి ముందు నుంచే సార్ అని పిలవడం అలవాటు అని అనడంతో సరైతే తినండి అని అంటారు. అప్పుడు జయచంద్ర మీరిద్దరూ చాలా రిజర్వ్ డుగా కనిపిస్తున్నారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా అని అడుగుతాడు. అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతుండగా మీరు భోజనం చేయండి తర్వాత చెప్తాను అంటుంది.
ఆ తర్వాత వసుధా జయచంద్రకు నీళ్లు ఇవ్వడానికి వెళ్లగా మీ పెళ్లి జరిగి ఎన్నేళ్లు అవుతోందమ్మా, మీది ప్రేమ వివాహమా అని అడగగా వసుధార చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు జయచంద్ర వసుధార ని దగ్గర నుండి చూసినట్టు ఆమె నడవడికలు ఆమె ఆలోచన విధానం అన్ని చెబుతూ ఉంటాడు. అప్పుడు జయచంద్ర మాటలకు వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీకు రిషికి మధ్య దూరం ఉన్నట్టుగా ఉంది అనడంతో వసుధార ఆశ్చర్య పోతుంది. భార్య భర్తల మధ్య ఎప్పటికీ దూరం ఉండకూడదు నీ కళ్ళల్లో ప్రేమే కాదు బాధ కూడా కనిపిస్తోంది అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వసు ఆశీర్వాదం తీసుకుంటుంది.
ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. మీకు అన్ని కంఫర్ట్ గా ఉన్నాయా సార్ అని అడిగి అక్కడి నుంచి వెళుతుండగా ఏదో అడగాలని వచ్చావు అడిగేసేయ్ అని అంటాడు జయచంద్ర. ఏం లేదు సార్ అని అక్కడ నుంచి వెళ్తుండగా కూర్చో పర్లేదు మాట్లాడు అని అంటాడు జయచంద్ర. అప్పుడు వసుధర గురించి మాట్లాడుతూ నీ మీద తనకు ఎనలేని ప్రేమ ఉంది. నీకోసమే బ్రతుకుతోంది కానీ తనకు ప్రేమ పరీక్ష పెట్టకు అని అంటాడు జయచంద్ర. సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత రిషి,వసు దగ్గరికి వెళ్ళి పొగరు అని పిలుస్తాడు. ఎందుకు వచ్చారు సార్ అనగా థాంక్స్ అని చెబుతాడు రిషి. ఎందుకు సార్ అనడంతో నన్ను ప్రేమిస్తున్నందుకు నామీద నీకు ఎనలేని ప్రేమ ఉన్నందుకు అని అంటాడు.
అప్పుడు వసుధారతో ప్రేమగా మాట్లాడి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత తన గదికి వెళ్లిన రిషి వసుధార జయచంద్ర అన్న మాటలు తలచుకొని మా మీద జయచంద్ర గారికి అనుమానం వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే ఆయనకు మా మీద అనుమానం వచ్చిందేమో ఒకవేళ మా గురించి నోరు తెరిచి అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అలా తెలియకూడదు ఆయన వెళ్లేంతవరకు జాగ్రత్త పడాలి అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు తన గదికి తాళం వేసి వెళుతుండగా ఎక్కడికి అని మహేంద్ర అనడంతో గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జగతి మహేంద్ర రిషి వసుధర గదిలోకి వెళ్లడం చూసి ఎందుకు వెళ్ళాడా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత రిషి లోపలికి వెళ్లగా ఎందుకు వచ్చారు సార్ అని అంటుంది వసుధార.