MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor: పెద్ది లో హీరోయిన్‌కు ఘోర అవమానం? విమర్శలకు జాన్వీ కపూర్ సమాధానం ఏంటి?

Janhvi Kapoor: పెద్ది లో హీరోయిన్‌కు ఘోర అవమానం? విమర్శలకు జాన్వీ కపూర్ సమాధానం ఏంటి?

రామ్ చరణ్ అభిమానులకు 'పెద్ది' సినిమా పండగలా ఉన్నా, జాన్వీ కపూర్ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చింది. బాలీవుడ్‌లో గ్లామర్ డాల్‌గా పేరున్న జాన్వీ, సౌత్‌లో ఒక మంచి పాత్రతో వస్తుందని ఆశించిన వారికి షాక్ తగిలింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 05 2026, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ది'లో 'అచ్చమ్మ'కు అన్యాయం జరిగిందా?
Image Credit : Asianet News

పెద్ది'లో 'అచ్చమ్మ'కు అన్యాయం జరిగిందా?

టాలీవుడ్ 'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబో అనగానే అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, 'పెద్ది' సినిమా పోస్టర్లు, గ్లింప్స్‌లు బయటకు రాగానే ఇప్పుడు ఇండస్ట్రీలో సంబరం కన్నా ఎక్కువగా అన్యాయమే వినిపిస్తోంది. అవును, ఈ సినిమాలో జాన్వీ కపూర్ పోషిస్తున్న 'అచ్చమ్మ' పాత్రను చూపించిన తీరు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైరల్ అవుతున్న పోస్ట్
Image Credit : Asianet News

వైరల్ అవుతున్న పోస్ట్

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దాని హెడ్డింగ్ ఏంటంటే.. "పెద్ది: భారత సినిమాలో ఒక హీరోయిన్‌కు జరిగిన  అవమానం". ఆశ్చర్యం ఏంటంటే, ఈ పోస్ట్‌ను స్వయంగా జాన్వీ కపూరే 'లైక్' చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. ఒక నటి తను నటించిన సినిమా గురించే ఇంత నెగటివ్‌గా ఉన్న పోస్ట్‌ను లైక్ చేసిందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

35
కెమెరా యాంగిల్స్‌పై నెటిజన్ల ఆగ్రహం
Image Credit : X

కెమెరా యాంగిల్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

ఈ వివాదానికి అసలు కారణం డైరెక్టర్ బుచ్చిబాబు సానా మేకింగ్ స్టైల్ అని అంటున్నారు. సినిమాలో జాన్వీ కపూర్ ఎంట్రీ సీన్‌లో గానీ, ఇతర సీన్లలో గానీ.. హీరోయిన్ ముఖం చూపించకముందే కెమెరా ఆమె నడుముపై ఫోకస్ అవుతోందట. "ఊర్లో ఒక పెద్ద రాజకీయ నాయకుడి కూతురు, ఇలా ఒళ్ళు చూపిస్తూ తిరగడం సాధ్యమేనా?" అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. జాన్వీని కేవలం గ్లామర్ కోసం వాడుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

45
హీరోయిన్ పర్మిషన్ లేకుండా ముద్దు 'హీరోయిజమా'?
Image Credit : others

హీరోయిన్ పర్మిషన్ లేకుండా ముద్దు 'హీరోయిజమా'?

సినిమాలో హీరో 'పెద్ది', హీరోయిన్ అచ్చమ్మ పర్మిషన్ లేకుండానే ఆమెకు ముద్దు పెడతాడు. దీన్ని సినిమాలో ఒక హీరోయిజం సీన్‌లా చూపించారు. ఈ రోజుల్లో ఇలాంటి సీన్లు మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తాయని నెటిజన్లు గట్టిగా వాదిస్తున్నారు. 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాత్రను ఇలాగే నిస్సహాయంగా చూపించారు, ఇప్పుడు జాన్వీ వంతు వచ్చిందని ఫైర్ అవుతున్నారు.

55
జాన్వీ కపూర్ కూడా అసంతృప్తిగా ఉందా?
Image Credit : others

జాన్వీ కపూర్ కూడా అసంతృప్తిగా ఉందా?

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లోనే జాన్వీ కపూర్ స్వయంగా కొన్ని షాట్స్ పట్ల అభ్యంతరం చెప్పిందట. మహిళలను ఇలా కేవలం వస్తువుగా చూపించే సీన్లు తనకు నచ్చలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, కమర్షియల్ కారణాల వల్ల డైరెక్టర్ ఆ మార్పులు చేయలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి, 'పెద్ది' సినిమా రామ్ చరణ్ అభిమానులకు పండగలా ఉన్నా, జాన్వీ అభిమానులకు మాత్రం మింగుడుపడని విషయంగా మారింది. బాలీవుడ్‌లో గ్లామర్ బొమ్మగా ఉన్న జాన్వీ, సౌత్‌లో ఒక మంచి పాత్ర చేస్తుందని ఆశించిన వాళ్లకు నిరాశే ఎదురైంది. ఈ ట్రోల్స్, విమర్శలకు డైరెక్టర్ బుచ్చిబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
Sukumar: ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది.. పెద్ది చూశాక సుకుమార్ ఏమన్నాడంటే..?
Recommended image2
Trisha ‌- CM Vijay: త్రిషకు హ్యాండిచ్చిన విజయ్ దళపతి, సీన్ లోకి వచ్చిన మరో స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved