MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: నడిరోడ్లో కుటుంబం పరువు తీసిన మల్లిక.. మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి?

Janaki Kalaganaledu: నడిరోడ్లో కుటుంబం పరువు తీసిన మల్లిక.. మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 25వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Jan 25 2023, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో జానకి,రామచంద్ర పూజకి అన్ని సిద్ధం చేస్తూ ఉండగా ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి పండగ అనగానే చాలు కొత్త బట్టలు వేసుకుని కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకులురా రెడీ అయ్యి అక్కడ కూర్చుంటారు అనుకుంటూ అక్కడికి వెళుతుంది. అప్పుడు మల్లిక అక్కడికి వచ్చి తింగరి తింగరిగా మాట్లాడడంతో జానకి గట్టిగా మాట్లాడి నోరు మూయిస్తుంది. ఇంతలోనే గోవిందరాజులు జ్ఞానాంబ అక్కడికి వచ్చి పూజకు అని సిద్ధమయ్యాయి అని అడగగా అయ్యాయి అనడంతో తర్వాత జ్ఞానాంబ పూజ మొదలు పెడుతుంది. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ దేవుడిని మర్చిపోకూడదు. ఇకమీదట అంతా మంచే జరగాలని కోరుకోండి అని అంటుంది జ్ఞానాంబ.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 ఆ తర్వాత జ్ఞానాంబ పూజ చేస్తూ ఉండగా అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు రామచంద్ర దేవుడికి మొక్కుకుంటూ నా వల్ల జరిగిన నష్టాన్ని తీర్చి మళ్లీ అమ్మ ఎప్పటిలాగా సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి అని కోరుకుంటూ ఉంటాడు. అప్పుడు మల్లిక నేను నీ మీద అలిగాను అమ్మ అందరి లాగా నేను ఏమన్నా ఆస్తులు పాస్తులు అడిగానా ఈ కొంపలో నుంచి బయటికి వెళ్లేలా చేయమ్మ చాలు అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత గోవిందరాజులు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మీ అత్తయ్య మీ అందరికీ ముగ్గుల పోటీ నిర్వహిస్తోంది. అందరూ వెళ్లి ముగ్గులు వేద్దాం పదండి అని అనడంతో అందరూ కలిసి బయటకు ముగ్గులు వేయడానికి వెళ్తారు.

37

అప్పుడు జెస్సి అక్క నాకు ముగ్గులు వేయడం రాదు అనడంతో రాకపోతే మానిలే జెస్సి అలాగే చూస్తూ ఉండు అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు మల్లిక నన్ను చూసి ముగ్గురు నేర్చుకో జెస్సి అనడంతో వద్దులే జెస్సి అంటూ మల్లిక మీద చేసేట్లు వేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ముగ్గులు వేయడం ప్రారంభిస్తారు. అప్పుడు గోవిందరాజులు మీ అత్తగారు ఒకప్పుడు రంగుల పోటీలో ఫస్ట్ వచ్చేవారు అనడంతో అది ఒకప్పుడు కథ మామయ్య ఇప్పుడు కాదు కదా అంటూ జ్ఞానాంబను బరిలోకి దిగేలో రెచ్చగొడుతూ మాట్లాడుతుంది మల్లిక. తర్వాత జ్ఞానాంబ కూడా ముగ్గు వేయడం మొదలు పెడుతుంది.

47

 అందరూ కలిసి సంతోషంగా ముగ్గులు వేస్తూ ఉంటారు. తర్వాత మల్లిక నా ముగ్గు పూర్తయింది అని సంతోష పడుతూ ఉండగా అందరూ మల్లిక ముగ్గుని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ జానకి వాళ్ళు వేసిన ముగ్గులు మల్లిక వేసిన దానికంటే చాలా బాగా ఉంటాయి. అప్పుడు జ్ఞానాంబ అందరికంటే బాగా వేయడంతో జానకి పొగుడుతూ ఉండగా అంటే నా ముగ్గు బాగాలేదా అని మల్లిక అనగా అప్పుడు ముగ్గు యొక్క గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంది జ్ఞానాంబ. ఇంతలోనే ఒక అతను అక్కడికి వచ్చి ప్రతి ఏడాది అనాధ పిల్లలకు స్వీట్లు పంచేవారు మరి ఏడాది ఏమైనా ఇస్తారా అమ్మ అని అడగగా, అప్పుడు మల్లిక షాపు పోయిన బాధలో మేము ఉన్నాము.
 

57

మీరేంటి బాబాయ్ గారు అయినా ఆ గొప్ప ఇంట్లో ఉండే మేము ఇంట్లో ఉన్నాము అంటే మీకైనా అర్థం కావడం లేదా అని అంటుండగా ఇంతలోనే చుట్టూ ఉన్న జనాలు అక్కడికి వస్తారు. మేము ఇప్పుడు ఇచ్చే స్థితిలో లేము ఎవరైనా ఇస్తే తీసుకునే స్థితిలో ఉన్నాము అని అంటుంది మల్లిక. అప్పుడు గోవిందరాజులు మనం వీధిలో ఉన్నాం మల్లిక అనడంతో ఈ వీధికి ఆ ఇంటికి పెద్ద తేడా ఏమీ లేదులే మామయ్య గారు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడి అందరి సంతోషాన్ని నాశనం చేస్తుంది మల్లిక. అప్పుడు జ్ఞానాంబ ఏం మాట్లాడకుండా అక్కకి నుంచి మౌనంగా వెళ్లిపోతుంది. తర్వాత జ్ఞానాంబ ఏడుస్తూ ఉండగా గోవిందరాజులు మౌనంగా ఉండు జ్ఞానం మల్లిక గురించి మనందరికీ తెలిసిందే కదా అని అంటాడు. 

67

ప్రతి ఏడాది మనం చేసే ఆ కార్యక్రమం ఏడాది నిలబడిపోయినందుకు బాధగా ఉంది అని అంటుంది. మరోవైపు రామచంద్ర జానకి కూడా అదే విషయం గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. దీనికంతటికి కారణం నేనే కదా జానకి గారు అనడంతో అప్పుడు గోవిందరాజులు ఆ దేవుడు చేసిన దానికి మనం ఏం చేయలేం కదా జ్ఞానం అని అంటాడు. మనకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని జ్ఞానాంబ అనగా తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అంటుంది జానకి. ఇప్పుడు జానకి రామచంద్రుని ఓదారుస్తూ ఉండగా జ్ఞానాంబని గోవిందరాజులు ఓదారుస్తూ ఉంటాడు. ఆ తర్వాత విష్ణు కూడా జరిగిన విషయాలు తలచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మల్లిక వస్తుంది.
 

77

అప్పుడు మల్లిక విష్ణు ఆలోచనలను చెడగొడుతూ అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే బాగుండదు అని అంటుంది. ఇక్కడ బతికున్న వాళ్ళకి దిక్కులేదు చనిపోయిన వాళ్ళకెందుకు అవసరమా అని అంటుంది. అప్పుడు మల్లిక నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉండగా ఇంతలో అక్కడికి జానకి,జెస్సి వస్తారు. అప్పుడు జానకి, మల్లిక మీద సీరియస్ అవుతూ బతికున్న వాళ్లకు అంటే ఎలాగూ మర్యాద ఇవ్వు కనీసం చనిపోయిన వాళ్లకు అయినా మర్యాద ఇవ్వవా అని మండిపడుతుంది. అత్తయ్య గారికి తమ్ముడు అంటే మనకు బాబాయ్ మన తండ్రి గురించి ఎలా మాట్లాడుతామో ఏం విష్ణు మీ మేనమామ గురించి అలా మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడవా అని అంటుంది జానకి. ఇంకొకసారి ఇలా మాట్లాడే ముందు నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇస్తుంది జానకి. అప్పుడు జెస్సి అక్కకు ఆ మాటలు అర్థమయ్యేయో లేదో కానీ నాకు బాగా అర్థం అయ్యాయి అని అంటుంది. తనకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదులే జెస్సి అని అంటుంది జానకి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Recommended image2
Yuvina Parthavi: ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురిగా నటించింది ఎవరో తెలుసా.. ఒక్క టూర్ ఆమె జాతకాన్నే మార్చేసింది
Recommended image3
Trivikram: బద్దం భాస్కర్‌ అంటూ గురువుపైనే త్రివిక్రమ్‌ సెటైర్లు.. గట్టిగా ఇచ్చి పడేసిన స్టార్‌ డైరెక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved