- Home
- Entertainment
- Janaki Kalaganaledu: సునందకు వార్నింగ్ ఇచ్చిన జానకి.. బాధతో కుమిలిపోతున్న జ్ఞానాంబ.?
Janaki Kalaganaledu: సునందకు వార్నింగ్ ఇచ్చిన జానకి.. బాధతో కుమిలిపోతున్న జ్ఞానాంబ.?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 12వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్లో జ్ఞానాంబ కొడుకుని ఏ తల్లి హత్య చేయమని పంపించదు. మన అఖిల్ నిర్దోషి అని తేలింది కదా అది చాలు అని అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు జెస్సీ జానకి దగ్గరికి వెళ్లి అక్క చాలా థాంక్స్ అక్క. అఖిల్ ఏ తప్పు చేయడు అని నమ్మకం ఉన్న ఒక ఆడపిల్లకు చేశాడని అరెస్ట్ చేశారు కానీ ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు మా అమ్మ నాన్న కూడా చాలా బాధపడ్డారు అక్క ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడతారు అని అంటుంది జెస్సి. అప్పుడు అందరు సంతోషంగా మాట్లాడుతూ ఉండగా జానకిని మల్లిక పొగుడుతూ ఉంటుంది.
ఇంతలోనే అఖిల్ కి ఫోన్ రావడంతో అక్కడి నుంచి చాటుగా మాట్లాడడానికి వెళ్లిపోతాడు అఖిల్. అప్పుడు అఖిల్ ని జానకి ఫాలో అవుతూ బయటికి వెళుతుంది. అప్పుడు అఖిల్ అవన్నీ ఇప్పుడు ఫోన్లో వద్దు అని దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడుతాను ఇప్పుడు వదిలేయండి అని చెప్పి ఫోన్ కట్ చేయగా ఇంతలోనే జానకి అక్కడ ఉండడం చూసి అఖిల్ షాక్ అవుతాడు. అప్పుడు అఖిల్ ఏమీ తెలియనట్టుగా చాలా థాంక్స్ వదిన మాధురికి ప్రమాదం అవ్వడానికి కన్నబాబు దోషి అని నిరూపించిన నిర్దోషి అని తేల్చినందుకు అని చెప్పి అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుందా ఒక నిమిషం ఆగు అఖిల్ అని అంటుంది జానకి.
అప్పుడు జానకి మాట్లాడుతూ కన్నబాబు తప్పు చేశానని నువ్వు చేయలేదని కాదు అఖిల్ కన్నబాబు 70% తప్పు చేస్తే నువ్వు 30% నువ్వు తప్పు చేశావు. నీవల్లే మాధురి పరిస్థితి వచ్చింది అంటే నేను నమ్మను కానీ, మాధురి అంతో ఇంతో గాయపడడానికి నువ్వు కూడా కారణం అని అంటుంది జానకి. నువ్వు మాధురిని కర్రతో కొట్టడం ప్రత్యక్షంగా చూశాను నేనే ప్రత్యక్ష సాక్షిని అని అంటుంది జానకి. కానీ నువ్వు ఎందుకు మాధురిని కొట్టావు అన్న విషయం తెలియలేదు కానీ తప్పకుండా తొందరలోనే తెలుసుకుంటాను అనడంతో అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు.
అప్పుడు జానకి అఖిల్ ని ఏదో ఒక జాబ్ చూసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వమని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రామచంద్ర ఇంటికి కోపంగా వెళ్తాడు. జానకి గారు అని అనడంతో ఏమైంది రామా గారు అని అనగా మాధురికి ప్రమాదం చేసింది ఆ కన్నబాబేనా అని అనగా మరి ఆ కన్నబాబు మాత్రం తన బదులు వేరే వారిని అరెస్టు చేయించి తను బయట ఉన్నాడు అనడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రామచంద్ర జరిగింది మొత్తం జానకికి వివరిస్తాడు. అసలు విషయం తెలుసుకున్న జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
మరొకవైపు సునంద అవన్నీ చిన్న చిన్న విషయాలు మనల్ని ఎవడ్రా ఎదిరించేది అని అంటుండగా ఇంతలోనే జానకి సునంద ఇంటికి వస్తుంది. అది చూసిన సునంద, జానకి ఎందుకు మా ఇంటికి వస్తోంది అని ఆశ్చర్య పోతుంది. అప్పుడు ఏంటి జానకీ ఇలా వచ్చావు అని అడగగా మీరు చేస్తుంది తప్పు అని చెప్పడానికి వచ్చాను అంటుంది జానకి. తప్పు చేసి తప్పించుకుని తిరిగే వాళ్ళు మీ ఇంట్లో ఉంటారు అని అనగా వెంటనే జానకి చూడండి తప్పు చేసింది నీ కొడుకు అది నిరూపించడానికి వచ్చాను అనడంతో సవాల్ చేయడానికి వచ్చావా జానకి అని అంటుంది సునంద.
కొడుకు చేసిన తప్పుని సమర్థించవద్దు అని చెప్పడానికి వచ్చాను అనడంతో వెంటనే సునంద జానకి అని గట్టిగా సీరియస్ అవుతుంది. డబ్బుతో అన్ని కొనలేరు సునంద గారు అనడంతో నీకు ఎంత కావాలో చెప్పు జానకి అని అనగా నన్ను కొనడానికి మీ ఆస్తులన్నీ అమ్మిన సరిపోవు అని అంటుంది జానకి. అప్పుడు సునంద సీరియస్ అవుతూ నువ్వు ఒక కార్పొరేటర్ తో మాట్లాడుతున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోకు అనడంతో నేను కార్పొరేటర్ తో మాట్లాడటం లేదు తప్పు చేసిన ఒక కొడుకు తల్లితో మాట్లాడుతున్నాను అని అంటుంది జానకి.
చాలా ఎక్కువ చేస్తున్నావ్ జానకి నా ముందే మీ అత్తని నిలబడలేకపోయింది నువ్వు ఎంత అనడంతో అందరూ ఒకేలా ఉంటారు అనుకోకు సునంద అని వార్నింగ్ ఇస్తుంది జానకి. ఇంతలో కన్నబాబు అక్కడికి వస్తాడు. మీరు మీ అబ్బాయికి సాయం చేయాలనుకోవద్దండి సాయం చేశారు అంటే మీరు కూడా నా అకౌంట్ లోకి పడిపోతారు అని అంటుంది జానకి. ఏం చేస్తావు అని అనడంతో ఒంటిమీద యూనిఫామ్ లేకుండానే ఇన్ని చేసిన దాన్ని ఒక్కసారి యూనిఫామ్ వస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాను అనడంతో సునంద షాక్ అవుతుంది. అప్పుడు జానకి సునందకి కన్నబాబుకి ఇద్దరికీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోవడంతో కన్నబాబు ఈ జానకి చాలా ఎక్కువ చేస్తుందమ్మా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
మరొకవైపు జ్ఞానాంబ పిల్లల ఫోటోలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎవరో పాప అటుగా నడుచుకుంటూ వెళుతున్నట్టు అనిపించడంతో జ్ఞానాంబ లేచి ఆ పాప వెంట పరిగెత్తాలి అని చూడగా కింద పడిపోతుండడంతో గోవిందరాజులు జానకి వచ్చి పట్టుకుంటారు. అప్పుడు అదంతా తన భ్రమ అనుకున్న జ్ఞానాంబ కుమిలిపోతూ ఉంటుంది. దాంతో గోవిందరాజులు జానకి కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ పిల్లల విషయంలో తన పెట్టుకున్న ఆశల గురించి చెబుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు జానకి ఇద్దరు కలిసి జ్ఞానాంబను ఓదారుస్తూ ఉంటారు. అప్పుడు జానకి జెస్సి కి పిల్లలు పుడితే తప్ప అత్తయ్య గారికి ఈ బాధ తీరదేమో అనుకుంటూ ఉంటుంది.