- Home
- Entertainment
- Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్ బాస్ విన్నర్ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్ బాస్ విన్నర్ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ విన్నర్ ఎవరనే చర్చ ఊపందుకుంది. అంతా ఆ ఇద్దరి పేర్లే చెబుతున్నారు. కానీ ఈ సారి ఎవరు ఊహించని కంటెస్టెంట్ విన్నర్‌గా నిలవబోతున్నారట.

బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరు?
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి ఇంకా రెండు వారాలే ఉంది. ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. 14వ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హౌజ్‌లో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయెల్, భరణి, సంజనా, డీమాన్ పవన్, సుమన్ శెట్టి ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే టాప్ 5 ఎవరనే చర్చ సాగుతోంది. ఎవరికి వారు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. వారి లెక్కల ప్రకారం కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్, భరణి కన్ఫమ్ అని తెలుస్తోంది. మిగిలిన ఒక్కరు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
విన్నర్‌గా కళ్యాణ్ పడాల, తనూజ పేర్లు
ఈ క్రమంలో ఇప్పుడు విన్నర్ గురించిన ప్రస్తావన కూడా తెరపైకి వస్తోంది. ఈ సీజన్ విన్నర్ ఎవరనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. దీంతో దీనిపై చర్చ కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు ఆడియెన్స్ నుంచి, సినీ వర్గాల నుంచి వినిపిస్తోన్న సమాచారం మేరకు కళ్యాణ్ పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే తనూజ పేరు కూడా చక్కర్లు కొడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ సీజన్ విన్నర్ తనూజనే అంటున్నారు. బిగ్ బాస్ హిస్టరీలో మొదటిసారి లేడీ కంటెస్టెంట్‌ని విన్నర్ ని చేయబోతున్నారని అంటున్నారు.
ఓటింగ్ ప్రకారం విన్నర్ ఇతనేనా
ఓటింగ్ ప్రకారం కళ్యాణ్‌కి ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆయన ఎవరికీ సాధ్యం కాని విధంగా టాప్ ఓటింగ్‌లో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ప్రచారం జరుగుతోంది. ఈ సారి కామన్ మ్యాన్ దే బిగ్ బాస్ ట్రోపీ అంటున్నారు. దీంతో గేమ్ ఈ సారి మరింత రసవత్తరంగా మారిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఆదివారం ఎలిమినేట్ అయిన రీతూ చౌదరీ.. డీమాన్ పవన్ విన్ అవుతాడని చెప్పారు. దీంతో ఇంతకి ఈ సారి ఎవరు బిగ్ బాస్ విన్నర్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయంలో ఎవరికి తోచిన అభిప్రాయం వాళ్లు వెల్లడిస్తున్నారు.
విన్నర్‌గా ఇమ్మాన్యుయెల్ ఫిక్స్ ?
అయితే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరో ముందే డిసైడ్ అయ్యాడట. ఈ సారి విన్నర్ ఇమ్మాన్యుయెల్ అని తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ఇమ్మూని ఫైనల్ చేశారని సమాచారం. ఇదే నిజమైతే ఇది బిగ్ బాస్ హిస్టరీలోనే సరికొత్త సంచలనం కాబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక హాస్యనటుడిని విన్నర్‌గా ప్రకటించలేదు. నటులనే విన్నర్‌ని చేశారు. కామనర్స్ ని కూడా విన్నర్‌ని చేశారు. కానీ ఈ సారి మాత్రం కమెడియన్ ఇమ్మాన్యుయెల్‌ని విన్నర్‌ని చేయబోతున్నారని సమాచారం. ఇది ఆల్ రెడీ ఫిక్స్ అయ్యిందట.
చివర్లో ట్విస్ట్ ఉంటుందా?
తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా? లేదంటే చివరి నిమిషంలో ఓటింగ్‌కి ప్రయారిటీ ఇస్తారా అనేది చూడాలి. ఈ సీజన్‌లో నిర్వాహకులు చాలా ట్విస్ట్ లు ఇస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ట్విస్ట్ లతో సర్‌ప్రైజ్ చేస్తున్నారు. అదే జరిగితే ఈ విన్నర్ మారే అవకాశం ఉంది. కళ్యాణ్, తనూజలో ఒకరిని విన్నర్‌ని చేసే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. రెండు వారాల్లో దీనిపై క్లారిటీ రానుంది.

