- Home
- Entertainment
- 2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్, మోహన్ లాల్, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్, మోహన్ లాల్, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్
ఇటీవల వచ్చిన 'ధురంధర్' సినిమాతో అక్షయ్ ఖన్నా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాల కలెక్షన్లు రూ.1000 కోట్లకు చేరువైంది.

1. అక్షయ్ ఖన్నా: 2 సినిమాలు, దాదాపు రూ.1000 కోట్ల కలెక్షన్
2025లో అక్షయ్ ఖన్నా రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'ఛావా', 'ధురంధర్' సినిమాల్లో విలన్‌గా నటించి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.993.41 కోట్లు వసూలు చేసి టాప్‌లో నిలిచారు.
2. రిషబ్ శెట్టి: ఒక సినిమా, 800 కోట్లకు పైగా కలెక్షన్లు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 2025లో 'కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1' చిత్రంతో కనిపించారు. ఆయనే దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 852.16 కోట్లు వసూలు చేసింది. దీంతో టాప్ 2లో నిలిచారు రిషబ్ శెట్టి.
3. విక్కీ కౌశల్: ఒక సినిమా, 800 కోట్లకు పైగా కలెక్షన్లు
2025లో విక్కీ కౌశల్ 'ఛావా' అనే ఒక్క సినిమాలోనే కనిపించారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.807.91 కోట్లు వసూలు చేసింది. దీంతో విక్కీ కౌశల్ ఈ ఏడాది టాప్ 3లో నిలిచారు.
4. అక్షయ్ కుమార్: 4 సినిమాలు, రూ.789 కోట్లకు పైగా కలెక్షన్లు
2025లో అక్షయ్ కుమార్ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'స్కై ఫోర్స్', 'కేసరి చాప్టర్ 2', 'హౌస్‌ఫుల్ 5', 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' చిత్రాల మొత్తం ప్రపంచవ్యాప్త కలెక్షన్ రూ.789 కోట్లు. ఇలా అక్షయ్ టాప్ 4లో నిలిచారు.
5. మోహన్‌లాల్: 3 సినిమాలు, 500 కోట్లకు పైగా కలెక్షన్లు
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ 2025లో 3 సినిమాలతో వచ్చారు. 'L2: ఎంపురాన్', 'తుడారం', 'హృదయపూర్వం' చిత్రాల మొత్తం కలెక్షన్ రూ.578.45 కోట్లు. దీంతో మోహన్ లాల్ టాప్ 5లో నిలిచారు. ఇలా కలెక్షన్ల పరంగా ఇండియాలోనే ఈ ఏడాది టాప్ హీరోలు వీరే కావడం విశేషం.

