- Home
- Entertainment
- Janaki Kalaganaledu: అత్తగారింటికి వచ్చిన జానకికి కష్టాలు.. కోడలిని దాంతో పోలుస్తూ అవమానించిన జ్ఞానంబ!
Janaki Kalaganaledu: అత్తగారింటికి వచ్చిన జానకికి కష్టాలు.. కోడలిని దాంతో పోలుస్తూ అవమానించిన జ్ఞానంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబం అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 21వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్ఞానాంబ (Jnanamba) కొడుకు కోడలకి బొట్టు పెడుతుంది. అంతేకాకుండా వారిని దీవించి లోపలికి తీసుకుని వెళుతుంది. అది చూసిన మల్లిక (Mallika) ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఇక కొడుకు కోడలు ఇంటికి వచ్చిన సందర్భంగా ఇంట్లో అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు.
ఆ తర్వాత జ్ఞానాంబ (Jnanamba) స్వయంగా గోరుముద్దలు కలిపి రామచంద్రకు నోట్లో పెడుతుంది. దాంతో రామచంద్ర (Ramachandra) ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాడు. ఆ క్రమంలో ఇంట్లో వాళ్ళందరూ నాకు పెట్టమని అడుగుతారు. ఇక జ్ఞానాంబ వాళ్లకి కూడా గోరు ముద్దలు కలిపి పెడుతుంది. ఈ సంతోషాన్ని చూసి నా మనసు నిండి పోయిందని గోవిందరాజు అంటాడు.
ఇక జ్ఞానాంబ, జానకి (Janaki) లు ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జ్ఞానాంబ (Jnanamba ) నేను నీ మీద కోపం గా ఉంటున్నాను అంటే కేవలం నా కొడుకును మాత్రమే క్షమించాను అని అంటుంది. అంతేకాకుండా నేను ఒక మెట్టు దిగి ఇంట్లోకి రానించాను. ఎందుకంటే నా తమ్ముడు కి పట్టిన గతి నా కొడుకుకి రాకూడదు అని అంటుంది.
అదే క్రమంలో జ్ఞానాంబ (Jnanamba) జానకిని అనేక మాటలు అంటుంది. దాంతో జానకి ఎంతో బాధను వ్యక్తం చేస్తుంది. కానీ రామచంద్ర మళ్లీ తన తల్లి దగ్గరికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ జానకి (Janaki) చెప్పుకుంటూ ఉంటాడు. కానీ జానకి మాత్రం జ్ఞానాంబ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక తర్వాతి రోజు ఇంటి ముందు గుడిసె ఉండదు. అది గమనించిన మల్లిక (Mallika) ఎంత ఫాస్టుగా గుడిసె వేసారో అంతే ఫాస్ట్ గా పొడిసే పీకేసారంటు ఏడుస్తుంది. ఇంతలో అక్కడకు జానకి (Janaki) వచ్చి నేను ముగ్గెస్తాను. నువ్వు వెళ్లి అందరికీ పెట్టు అని మల్లిక తో అంటుంది. దాంతో మల్లిక ఆర్డర్ చేస్తున్నావా అని అడుగుతుంది.
ఇక తరువాయి భాగం లో జానకి ముగ్గు వేస్తూ ఉంటుంది. అక్కడకు జ్ఞానాంబ (Jnanamba) వచ్చి ఆ ముగ్గు గిన్నె లాగేసుకొని నువ్వు ఈ ఇంట్లో కేవలం ఒక వస్తువు లాగా ఉంటావు అంతే కానీ నీకు ఈ ఇంటితో సంబంధం లేదు అని అంటుంది. దాంతో జానకి (Janaki) మరింత బాధను వ్యక్తం చేస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.