Janaki Kalaganaledu: జానకి, రామచంద్ర రొమాంటిక్ సీన్స్.. అడ్డంగా బుక్కైన మల్లిక..?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ పరువు గల కుటుంబం అనే కథ నేపథ్యంతో సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈరోజు ఏప్రిల్ 26 వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలో జ్ఞానాంబ(jnanamba) కుటుంబం ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి ఉంటారు. కట్టెల పొయ్యి దగ్గర ఉన్న మల్లిక పొగకు దగ్గుతూ జ్ఞానాంబ ను మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. జానకి వైపు చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర(rama chandra)జానకిని అద్దంలో చూస్తూ మూగ సైగలు చేస్తూ ఉంటాడు.
అప్పుడు మల్లిక లోపలికి వెళ్లి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుండగా ఏమమ్మ పుల్లల మల్లిక (mallika)మొహమంతా అలా ఉంది అని అంటాడు రామచంద్ర తండ్రి. అప్పుడు రామ ఒకసారి గడ్డం తీసేయవచ్చు కదా అని అనడంతో, అప్పుడు రామచంద్ర(rama Chandra )జానకి వైపు చూసి ఓకేనా అని అడగగా అందుకు జానకి నో అని చెబుతుంది. అది చూసిన రామ చంద్ర నాన్న ఆట పట్టిస్తాడు.
అప్పుడు జ్ఞానాంబ,జానకి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తరువాత జ్ఞానాంబ (jnanamba)కూర్చొని ఆలోచిస్తూ జానకి నుంచి ఎలాగైనా రామచంద్ర ను దూరం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మల్లిక కాపీ తీసుకుని వస్తుంది. అప్పుడు మల్లిక (malika) స్వీటు షాపు రామచంద్ర కు అప్పగించడం గురించి మాట్లాడుతూ జానకి పై లేనిపోని మాటలను చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఇంట్లోకి వెళ్ళి ఒకసారి విష్ణు(vishnu) ని పిలుచుకొనిరా అని అనడంతో అప్పడు మల్లిక అడ్డంగా బుక్కయింది. అప్పుడు జ్ఞానాంబ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేయకుండా వెళ్లి పని చూసుకో అని అరుస్తుంది. మరొకవైపు రామచంద్ర (rama chandra)బట్టలు వేసుకుంటుండగా జానకి లోపలికి వెళ్లడంతో రామ చంద్ర పక్కకి వెళ్ళి దాక్కుంటాడు.
ఆ తర్వాత ఇద్దరూ కిందపడిపోయిన పూలను తీస్తు రొమాంటిక్ గా ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో యోగి(yogi) అతని భార్య జ్ఞానాంబ ఇంటికి వస్తారు. వారిద్దరూ ఇంట్లోకి వస్తుండగా రామచంద్ర (rama chandra)ఆగండి అని వారిని బయట నిలబెట్టేస్తాడు. ఆ మాట విని అందరూ షాక్ అవుతారు.