- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకి రామచంద్రను ఇంటి నుంచి తరిమేసిన జ్ఞానాంబ.. కుమిలిపోతున్న వెన్నెల!
Janaki Kalaganaledu: జానకి రామచంద్రను ఇంటి నుంచి తరిమేసిన జ్ఞానాంబ.. కుమిలిపోతున్న వెన్నెల!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పరువుగల కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

దిలీప్ (Dilip) వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞానంబ ఇంటికి వచ్చి పెళ్లి చెడిపోయినందుకు జానకి పై విరుచుకుపడతారు. ఇక దిలీప్ తల్లిదండ్రులతో.. ఆ రోజు మీకు ఈ విషయం గురించి చెప్పాలని అనుకున్నాను అని జ్ఞానాంబ తో అంటారు. కానీ జానకి (Janaki) చెప్పకుండా అడ్డుపడింది అని అంటారు.
దాంతో జ్ఞానాంబ మరింత బాధను వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో మల్లిక.. జ్ఞానాంబ (Jnanaamba) కోపాన్ని మరింత పెంచాలని చూస్తుంది. ఇక అదే క్రమంలో దిలీప్ (Dilip) వాళ్ళ ఫ్యామిలీ చూస్తుంటే.. కొండ దగ్గరికి వెళ్లి దిలీప్ వెన్నెలలు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం కూడా అబద్ధమే అనిపిస్తుంది అంటారు.
ఇదంతా పెళ్లి అవడానికి ఒక నాటకం అని కొట్టి పారేస్తారు. ఇక దాని గురించి జానకి (Janaki) దంపతులు ఎంత చెప్పినా వినకుండా దిలీప్ ఫ్యామిలీ నెగిటివ్ గానే తీసుకుంటారు. ఆ తర్వాత రామచంద్ర (Ramachandra) ను.. నువ్వేం కొడుకు అయ్యా భార్య తో కలిసి తల్లిని మోసం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అని దిలీప్ ఫ్యామిలీ అవమాన పరుస్తారు.
అదే క్రమంలో జ్ఞానాంబ (Jnanamba) పెంపకాన్ని కూడా దెబ్బ పొడుస్తారు దిలీప్ (Dilip) ఫ్యామిలీ. దాంతో జ్ఞానాంబ మరింత బాధను వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా మా పరువు తీసిన మీ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ కి లాగుతాం అంటూ దిలీప్ ఫ్యామిలీ అక్కడనుంచి వెళ్ళి పోతారు.
ఇక తర్వాత జ్ఞానాంబ (Jnanamba)ఈరోజు నుంచి నాకు పెద్ద కోడలు పెద్ద కొడుకు లేడు అని చెప్పి వాళ్ళను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని చెబుతుంది. ఈలోపు వెన్నెల (Vennela) జ్ఞానాంబ దగ్గరికి వచ్చి సర్ది చెబుతుండగా వెన్నెల ను గట్టిగా లాగి చెంప మీద కొడుతుంది.
ఇక జ్ఞానాంబ (Jnanaamba) అన్న మాట ప్రకారం జానకి దంపతులు కట్టుబట్టలతో బయటికి వెళ్లి పోతారు. దానికి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో బాధను వ్యక్తం చేస్తారు. కానీ మల్లిక (Mallika) తెగ సంతోష పడిపోతుంది. ఇక తరువాయి భాగం లో మల్లిక ఏదో వింతను చూసి స్టన్ అవుతుంది. అంతేకాకుండా అది జ్ఞానాంబ కు కూడా చూపిస్తుంది. మరి అది ఏంటో రేపటి భాగంలో చూడాలి.