- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకి, రామచంద్రలు గోడ దూకిన విషయాన్నీ బయటపెట్టిన మల్లిక.. అతర్వాత?
Janaki Kalaganaledu: జానకి, రామచంద్రలు గోడ దూకిన విషయాన్నీ బయటపెట్టిన మల్లిక.. అతర్వాత?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగనలేదు (Janaki kalaganaledu ) సీరియల్ ప్రేక్షకులకు రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక జానకి విషయంలో రామచంద్ర కవర్ చేయగా జ్ఞానాంబ నువ్వు ఎప్పుడు బయటకు వెళ్లాలన్నా రామచంద్ర (Rama chandra) ను తోడుగా తీసుకెళ్ళమని చెబుతుంది. మొత్తానికి మల్లిక (Mallika) కుటుంబంలో పుల్లలు పెట్టడానికే తయారైందని జ్ఞానాంబ దంపతులు గ్రహించుకుంటారు. ఇక జ్ఞానాంబ, మల్లికకు వార్ణింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత జానకి నా కోసం మీరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటూ రామచంద్ర (Ramchandra) తో చెప్పుకుంటూ బాధపడుతుంది. ఆ తర్వాత జానకి (Janaki) ను క్లాసుకు తీసుకువెళ్లడానికి రామచంద్ర తన చేతుల మీద జానకి ను ఎక్కించి గోదాదూకిస్తాడు.
ఇక అది చుసిన మల్లిక (Mallika) వాళ్ళ భర్త సహాయంతో అలాగే ఇమిటేట్ చేసి గోడ ఎక్కడానికి చూస్తుంది కానీ ఫన్నీగా కిందపడుతుంది. ఇక మల్లిక (Mallika) కింద పడడమే కాకుండా వాళ్ళ భర్తను కూడా కింద పడేస్తుంది. ఆ తర్వాత మల్లిక ' జానకి బావగారు దొంగచాటుగా గోడదూకి ఎక్కడికో బైటకి వెళ్లారు అని చెబుతుంది. కానీ దాన్ని జ్ఞానాంబ ఏమాత్రం నమ్మాడు దాంతో మల్లిక జానకి (Janaki) రూమ్ దగ్గరకు వెళ్లి చూపెడుతుంది.
కానీ రూంలో జానకి (Janaki) , రామచంద్రులు ఉన్నటుగా దుప్పటితో కవర్ చేస్తారు. ఇక మల్లిక మరోసారి జ్ఞానాంబ ముందు లేని పోనీ చాడీలు చెప్పే దానిలా మిగిలి పోతుంది. ఇక జ్ఞానాంబ (Jnanaamba ) , మల్లికను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అంటూ కోపడుతుంది.
ఇక ఆ తర్వాత జానకి (Janaki) , రామచంద్ర లు గోడ దూకి లోపలికి వస్తూ ఉండగా మల్లిక అక్కడే కాపలా కాస్తూ వాళ్లని వాళ్ళని చూస్తుంది. దాంతో జానకి రామ చంద్ర (Ramachandra) లు ఒకసారిగా స్టన్ అవుతారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం ఏం జరుగుతుందో చూడాలి.