- Home
- Entertainment
- Janaki kalaganaledu: జ్ఞానాంబ మాటలకు జానకి కన్నీళ్లు.. మల్లికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన గోవిందరాజులు?
Janaki kalaganaledu: జ్ఞానాంబ మాటలకు జానకి కన్నీళ్లు.. మల్లికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన గోవిందరాజులు?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 1వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఎపిసోడ్ ప్రారంభంలోనే.... జ్ఞానాంబ వరలక్ష్మీ వ్రతం కోసం కుటుంబ సభ్యులందరికీ పనులు చెప్పి "అలాగే మీరైనా నన్ను మోసం చేయకుండా, గుడ్డిదాన్ని చేయకుండా ఉండండి" అని అంటుంది.అప్పుడు జ్ఞానాంబ వాళ్ళ భర్త జ్ఞానంతో "నువ్వు బాధపడడం కాకుండా ఇవతల వైపు జానకిరాములను కూడా బాధపెడుతున్నావు" అని అంటాడు. తర్వాత జ్ఞానం వ్రతానికి అందరికీ కొత్త బట్టలు తన చేతితో ఇస్తుంది కానీ జానకి రాములకు బట్టలను అక్కడే పెట్టేస్తుంది.
జానకి, రామచంద్రలకు కూడా నువ్వే ఇవ్వు అని జ్ఞానాంబ భర్త అడగగా "వాళ్ళకి ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు నేను" అని చెప్పి వెళ్ళిపోతుంది. మల్లికా ఎవరూ చూడనప్పుడు తన గదిలోకి వెళ్లి చిందులేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి చికిత వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎంతో నవ్వులాటగా ముగుస్తుంది. తర్వాత జానకి తన గదిలో ఒంటరిగా కూర్చుని ఇందాక జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాది.
అదే సమయంలో రామ అక్కడికి వచ్చి మీరు ఇంకా రెడీ అవ్వలేదా జానకి గారు, వెళ్లి తయారవ్వండి అని అంటాడు. కానీ జానకి మాత్రం నేను రాకపోవడమే మంచిది లెండి అని అంటుంది.అప్పుడు రామా జానకిని ఓదార్చి "మీరు లేకపోతే కల ఉండదు, అమ్మ మనసులో ఉన్నది బాధ మాత్రమే కోపం కాదు" అని ధైర్యం చెబుతాడు. తర్వాత జానకి తయారయ్యి వ్రతం పనులన్నీ చేస్తూ ఉంటుంది.
జానకి వ్రత పనులు చేస్తుండడం చూసి మల్లికా "ఇందాక అత్తయ్య అన్న మాటలకు బాధపడుతూ లోపల ఉంతాదనుకుంటే,ఇలా బయటకు వచ్చి వ్రత పనులు చేస్తుంది ఏంటి!" అని ఆశ్చర్యపోతుంటాది. ఎలాగైనా జానకిని కుల్లబెట్టాలి అని అనుకుంటాది మల్లికా.జానకిని ఎటకారిస్తూ "అత్తయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి అని చెప్పి ఇవన్నీ చేస్తున్నావ్ కదా" అని అంటుంది.
ఆ మాటలకు జానకి బాధపడుతూ ఉంటాది.అత్తయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని నేను ఈ పనులు చేయట్లేదు నా బాధ్యత కాబట్టి చేస్తున్నాను అని జానకి అనగా దానికి కూడా మల్లి చాలా వెటకారంగా మాట్లాడడంతో జానకి చాలా బాధపడతాది.పక్కనే ఉన్న వెన్నెల మల్లికని అడ్డుకుంటాది. కానీ మల్లిక వెన్నెలని తిడుతూ నువ్వు జానకిని సపోర్ట్ చేస్తున్నావని మీ అమ్మగారికి తెలిస్తే అప్పుడు ఏమవుతాదో నీకు తెలుసు కదా? అని బెదిరిస్తాది.
ఈలోగా వాళ్ల మావయ్య వచ్చి మల్లికని తిడుతూ "తోటి కోడల్ని వేపుకు తినడం నీకు పండగ కదా" అని చెప్పి, "ఈ వ్రతం అయ్యేవరకు నువ్వు ఇక్కడ ఏ పెంట పెట్టినా, ఏ పుల్లలు పెట్టడానికి ట్రై చేసిన అసలు బాగోదు" అని చెబుతాడు. అంతటిలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక ఆతర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!