MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: కొత్త ఇంట్లో పాలు పొంగించిన జానకి.. జానకికి ముద్దు పెట్టిన రామచంద్ర?

Janaki Kalaganaledu: కొత్త ఇంట్లో పాలు పొంగించిన జానకి.. జానకికి ముద్దు పెట్టిన రామచంద్ర?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 12వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Navya G
Published : Jan 12 2023, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్లో అఖిల్,జెస్సి ఇద్దరూ బట్టలు సర్దుకుంటూ ఉండగా అప్పుడు గదిలో హ్యాంగర్ లేకపోవడంతో అఖిల్ కోపంతో బట్టలు విసిరేసి, ఒక హ్యాంగర్ కూడా లేదు ఇది ఒక ఇల్లు మళ్లీ ఫైవ్ స్టార్ హోటల్ ఇస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఒకటి అని కోపడుతూ ఉంటాడు. మామూలుగా శత్రువులు బయట ఉంటారు నాకు ఇంట్లోనే ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనడంతో ఇంకెవరు మా పెద్ద వదిన గురించి మొదటి రోజు నుంచి మా పెద్ద వదిన నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది అని అంటాడు. తప్పు లేకుండా జానకి అక్కను నువ్వు నిందించకు అనడంతో జానకి వదిని అంటే నీకెందుకు కోపం వస్తుంది నువ్వు కూడా మా నాన్న లాగా మాట్లాడకు అని అంటాడు అఖిల్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

 ఏ భార్య నా భర్త చెప్పినట్టుగా వింటుంది బావగారు చెప్పినట్టుగా అక్క నడుచుకుంది అని అంటుంది. ఆవిడ గురించి నీకు ఏం తెలుసు ఏమి తెలియదు నోరు మూసుకొని ఉండు అని అంటాడు అఖిల్. అప్పుడు జెస్సి ఎంత చెప్పినా కూడా అఖిల్ వినిపించుకోకుండా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. మరొకవైపు జ్ఞానాంబ దేవుడు ఫోటోలు తుడుస్తూ ఉండగా జానకి ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు జానకి వైపు అలాగే చూస్తూ ఉంటుంది జ్ఞానాంబ. అప్పుడు జానకి కుటుంబం ఫోటోని హాల్లో తగిలిస్తూ ఉండగా జానకి చేసే పనులు గోవిందరాజు దంపతులు చూస్తూ ఉంటారు. అప్పుడు మల్లిక బయటకు వచ్చి నేను ఇక్కడ కనిపిస్తే నాకు కూడా పనులు చెబుతారు అని లోపలికి వెళ్ళిపోతుండగా గోవిందరాజులు అమ్మ మల్లిక జానకి ఒక్కతే కష్టపడుతోంద.
 

38

 మీరు కూడా వచ్చి తలా ఒక చేయి వేయొచ్చు కదా అని అంటాడు. నాకు కూడా చేయాలని ఉంది మామయ్య కానీ ఒళ్ళు ఉంది కానీ ఒంట్లో ఓపిక లేదు మామయ్య అంటూ నాటకాలు ఆడుతూ ఉంటుంది. అప్పుడు ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి చెబుతూ నాటకాలు వాడుతూ ఉంటుంది మల్లిక. మొన్న అలా జరిగినప్పటి నుంచి ఒంట్లో నలతగా ఉంటుంది సరిగా ఉండటం లేదు మామయ్య అత్తయ్య అని అబద్ధాలు చెబుతుంది. ఇప్పుడు మల్లిక అదే అదునుగా భావించి బయటికి వెళ్లాలి అనుకుంటుండగా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటుంది జ్ఞానాంబ. ఇప్పుడు నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో రేపు పొద్దున వాళ్లకు బాగోలేనప్పుడు నువ్వు పని చేయ అని అంటుంది జ్ఞానాంబ.
 

48

ఆ తర్వాత లోపలికి వెళ్లి బయటకు వచ్చి చికిత వచ్చి నా రూమ్ కూడా క్లీన్ చేయి అని లోపలికి వెళ్ళిపోతుంది మల్లిక. చేస్తుంది కదా అని ఇంటి పనులు మొత్తం జానకి మీద వేస్తున్నారు అని గోవిందరాజులు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జ్ఞానాంబ తన ఫ్యామిలీ ఫోటో చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రామచంద్ర ఇంట్లోకి సరుకులు తీసుకుని రాగా ఏంటి రామ గారు ఇంత లేట్ అయింది అనడంతో ఒకచోట ఒక్కొక్కటి ఉన్నాయి అనగా అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా రామా గారు అనడంతో డబ్బులు ఉండాలి కదా జానకి గారు అనగా జానకి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు అదే రామా గారు ఇంకా కొన్ని సరుకులు తీసుకురాలేదు రామచంద్ర అబద్ధం చెబుతాడు. 
 

58

నిజం చెప్పండి రామా గారు అనడంతో ఇంకా కొన్ని సరుకులు తేవడానికి డబ్బులు లేవు అని అంటాడు. అమ్మవాళ్ళకి కాఫీ ఇవ్వకూడదా అనగా లేదు రామ గారు పాలు పొంగించిన తర్వాత కాఫీ ఇస్తాను అని అంటుంది. అదంతా చూసిన జెస్సి బావ గారు బాధపడకూడదని అక్క అక్క బాధపడకూడదు అని బావగారు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది జెస్సి. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది జెస్సి. ఆ తర్వాత జ్ఞానాంబ గోవిందరాజులు కి టాబ్లెట్స్ ఇస్తూ ఉండగా ఇంతలోనే జానకి అక్కడికి వచ్చి కొత్త ఇంట్లో పాలు పొంగిస్తే బాగుంటుంది వచ్చి పాలు పొంగించండి అత్తయ్య అనగా అలాంటి మంచి పనులు నువ్వే చెయ్యి అనడంతో పెద్దవాళ్ళు మీరు చేయాలి అత్తయ్య అని అంటుంది జానకి.
 

68

 అప్పుడు జ్ఞానాంబ పెద్దింటితోని పెద్దరికం పోయింది చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు కదా అని రామచంద్రని ఉద్దేశించి అంటుంది. అది చూసి జానకి నవ్వుకుంటూ ఉంటుంది. అవన్నీ ఎందుకు జ్ఞానం నువ్వే వెళ్లి పాలు పంపించు అనడంతో అప్పుడు జ్ఞానాంబ ఇంటికి పెద్ద కోడలు వచ్చింది అంటే అత్తగారి అధికారాలు పోయినట్టే తన చేతుల మీదే పాలు పొంగించమని చెప్పండి అంటుంది. రామచంద్ర కూడా పాలు పొంగించమ్మ అనగా గోవిందరాజులు ఎవరు చెప్పినా కూడా జ్ఞానాంబ మాత్రం తాను పాలు పొంగించనని చెబుతుంది. అప్పుడు రామచంద్ర నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే అద్భుతం జరుగుతుందమ్మా అనడంతో అమ్మ అనుకుంటేనో అమ్మకి చెబుతూనే అద్భుతం జరుగుతోంది అనుకుంటే ఈరోజు మన కుటుంబం ఈ పరిస్థితిలో ఉండేది కాదు అని అంటుంది.
 

78

అప్పుడు జ్ఞానాంబ వెళ్లి దేవుడు ముందు దీపం వెలిగిస్తుంది. ఇప్పుడు నువ్వేం బాధపడకు జానకి ఏ పని చేసినా మంచి మనసుతో చేస్తే అంతా మంచి జరుగుతుంది నువ్వు వెళ్లి పాలు పొంగిచ్చు అని అనడంతో సరే అని అంటుంది. ఇప్పుడు దేవుడు కూడా అత్తయ్య గారి చేతులతోనే పాలు పొంగించే అదృష్టాన్ని అవకాశాన్ని కలిగించాడు అని జ్ఞానాంబ వెలిగించిన దీపంతో జానకి గ్యాస్ స్టవ్ ని వెలిగిస్తుంది. అప్పుడు జానకి పాలు పొంగించడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు జానకి చికిత వెళ్లి పనులు మొదలు పెడతాము వంట చేద్దాం పద అనగా మల్లిక అబ్బా నాకు తలనొప్పిస్తోంది జానకి ఏమీ అనుకోవద్దు అంటూ నాటకాలు ఆడుతూ ఉంటుంది. అప్పుడు అందరూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో రామచంద్ర అటు ఇటు చూసి జానకి దగ్గరికి వెళ్లి వెనకనుంచి గట్టిగా హత్తుకుంటాడు.
 

88

చాలా థ్యాంక్స్ జానకి గారు మా అమ్మ చేతితో పాలు పొంగించలేదు అని బాధపడ్డాను కానీ ఆ బాధ లేకుండా చేశారు అని జానకికి రామచంద్ర ముద్దు పెడతాడు. దాంతో జానకి ఆశ్చర్యపోతుంది. అప్పుడు రామచంద్ర సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు తన గదిలోకి వెళ్ళిన మల్లిక తలనొప్పి లేదు ఏమీ లేదు అనుకుంటుండగా ఆనందపడుతూ ఉంటుంది. జానకి అక్కడికి వచ్చి నీకు వచ్చింది ఫేక్ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఓవరాక్షన్ అవసరమా అనగా నీకు నాకు తెలుసు అత్తయ్య గారికి తెలియదు ఇప్పుడు వెళ్లి నువ్వు ఏమైనా చెబుతావా అని అంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఫెయిల్యూర్స్ నుంచి బిగ్ బాస్ వరకు, హౌస్ లోకి అడుగుపెట్టిన బోల్డ్ యాంకర్ సుధీర్ రెడ్డి
Recommended image2
Singer Jhansi: రైతు నుంచి ఫోక్‌ సింగర్‌గా, అవమానాలు దాటుకొని బిగ్‌ బాస్‌లోకి.. సింగర్‌ ఝాన్సీ బ్యాక్‌ గ్రౌండ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: పాటతో ఆట మొదలుపెట్టిన దేబ్జానీ.. ఏకంగా నాగార్జునతోనే స్టార్ట్ చేసిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved