MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జ్ఞానాంబ కుటుంబంపై పగ తీర్చుకోవాలి అనుకుంటున్న కన్నబాబు.. బాధలో రామా,జానకి?

Janaki Kalaganaledu: జ్ఞానాంబ కుటుంబంపై పగ తీర్చుకోవాలి అనుకుంటున్న కన్నబాబు.. బాధలో రామా,జానకి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 6వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Jan 06 2023, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో భాస్కర్ రావు, రామచంద్ర ఇంటి పత్రాలను తీసుకుని వెళ్లి కన్నబాబు చేతిలో పెట్టడంతో అవి చూసి సంతోష పడుతూ ఉంటాడు. మా అమ్మ చెప్పినట్లుగా చేసి చాలా మంచి పని చేశావు చాలా థాంక్స్ భాస్కర్ రావు అనడంతో మీ అమ్మగారు ఐడియా వల్లే నేను ఇలా చేశాను మూడు రోజులే గడువు ఇచ్చాను అనడంతో,  రామచంద్ర గాడి ఫ్యామిలీ మూడు రోజుల్లో 25 లక్షలు అప్పు తీర్చలేదు అని నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు గతంలో జానకి ప్రవర్తించిన తీరుని తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు కన్నబాబు. ఆ జానకికి ఎంత ధైర్యం అంటే నాకు మా అమ్మకి చిటికె వేసి మరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుందా అని కన్నబాబు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
 

26

ఈ డాక్యుమెంట్స్ ని అడ్డుపెట్టుకొని ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డులో పడేలా చేస్తాను అని అంటాడు. మీరు వాళ్లకి గడువు ఇచ్చిన సమయం పూర్తి కాగానే వాళ్ళ కన్నీళ్ళకు కరిగిపోకుండా కట్టు బట్టలతో బయటకు గెంటేయండి అని సలహాలు ఇస్తాడు కన్నబాబు. మరొకవైపు రామచంద్ర మీరు అన్నట్టుగా భాస్కరరావు బాబాయ్ అలా మాట్లాడడానికి ఏదో కారణం ఉందని నాకు అనిపించడం లేదండి అని అంటాడు. తమ్మునికి ఇచ్చినది కాబట్టి 5 లక్షలు పెద్దగా అడగలేదు కానీ నేను ఇరవై లక్షలు అడిగాను కదా అందులో ఇంట్లో ఎవరికీ తెలియదు అనేసరికి కొంచెం భయం ఉంటుంది కదా జానకి గారు అంటాడు రామచంద్ర. ఇప్పుడు ఏం చేయాలి అని రామచంద్ర జానకి ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా మీరు పొద్దున్నుంచి ఏమి తినలేదు ఫస్ట్ భోజనం చేయండి అని అనడంతో అమ్మ తినిందా అడుగుతాడు రామచంద్ర.
 

36

అప్పుడు మా అమ్మ పస్తులు ఉంటే నేను తినలేను జానకి గారు మా అమ్మకి ఇప్పుడే అన్నం తీసుకుని వెళ్తాను అని రామచంద్ర అక్కడి నుంచి వెళ్తాడు. మరొకవైపు అఖిల్ జ్ఞానాంబ కోసం భోజనం తీసుకుని వచ్చి అమ్మ భోజనం చెయ్ అనడంతో మీ పెద్దన్నయ్య తీసుకొస్తే నేను తినను అని చెప్పి నీతో పంపించాడా అని అంటుంది జ్ఞానాంబ. ఆ మాటలు జానకి, రామచంద్ర బయట ఉండి తింటూ ఉంటారు. లేదమ్మా జెస్సి చెప్తే తీసుకుని వచ్చాను ఆరోగ్యం బాగోలేదు కదా ప్లీజ్ కొంచెం తినమ్మా అని అంటాడు అఖిల్. నాకు తెలియదు అనుకుంటున్నావా అఖిల్ మీ అన్నయ్య పంపిస్తేనే నువ్వు భోజనం తీసుకొని వచ్చావు అనడంతో అవునమ్మా అని అంటాడు. బయటే ఉన్న జానకి వాళ్ళని చూస్తూ నా బాధ సంతోషం ఆకలి అని ఎవరు కనిపెట్టుకొని ఉంటారో నాకు తెలుసు అని అంటుంది జ్ఞానాంబ.
 

46

ఇళ్ళు ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఇల్లు పోయి పిల్లలు అందరు రోడ్డున పడితే నాకు ఆకలి ఎలా ఉంటుంది రా అని అంటుంది జ్ఞానాంబ. రామచంద్ర నా దగ్గర ఏ నిజం దాచాడు. జానకిని నా కూతురు అనుకున్నాను వాళ్ళిద్దరూ నా దగ్గర అంత పెద్ద నిజాలు దాచిన మోసం చేశారు అలాంటప్పుడు ఎలా ఆకలి అవుతుంది ఎలా తినాలి అని అంటుంది. నాకు ఆకలిగా లేదు తీసుకెళ్ళు అని అఖిల్ పై సీరియస్ అవుతుంది. మరొకవైపు మల్లిక బట్టలు సర్దుకుంటూ సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి విష్ణు వస్తాడు. అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా మల్లిక అనడంతో మీ అన్నయ్య వాళ్ళు ఒక రోజులో పాతిక లక్షలు ఎలా అరేంజ్ చేస్తారు కాబట్టి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటూ తింగరి సమాధానాలు చెబుతూ ఉంటుంది.
 

56

మనకోసం ముందుగానే రెడీగా ఇళ్ళు చూడమని చెప్పాను అంటూ సంతోషంతో మాట్లాడుతుంది మల్లిక. ఆ తర్వాత జానకి, రామచంద్ర ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రామచంద్ర పరిస్థితి తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి జానకి కూడా ఏడుస్తూ ఉంటుంది. వారిద్దరు బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జెస్సి వస్తుంది. మీరు మీ తమ్ముని కోసమే అప్పు చేశారు అని ఎవరి నమ్మిన నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతాను మీ వ్యక్తిత్వం నాకు తెలుసు. అప్పుడు జెస్సి ఒక్కసారి మా నాన్నగారికి ఫోన్ చేసి డబ్బులు అడగండి మా నాన్న దగ్గర లేకపోయినా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు అంతో ఎంతో హెల్ప్ అవుతుంది అని అంటుంది జెస్సి. అప్పుడు జెస్సి మాటలకూ రామచంద్ర సంతోష పడతాడు.
 

66

అప్పుడు జానకి చాలా థాంక్స్ జెస్సి నువ్వు ఈ పరిస్థితిలో మమ్మల్ని నమ్మినందుకు అనగా మీరే లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండే దానికి నేను థాంక్స్ చెప్పుకోవాలి అని అంటుంది. మరుసటి రోజు ఉదయం గోవిందరాజులు కోసం జానకి కాఫీ తీసుకుని వెళ్ళగా డబ్బులు విషయంలో రామచంద్ర చాలా టెన్షన్ పడుతున్నాడమ్మా అనడంతో అవును మామయ్య గారు,ఎంతమందిని అడిగినా కూడా లేదు అని చెప్పడంతో రామచంద్ర గారు చాలా బాధపడుతున్నారు అని చెబుతుంది జానకి. ఒక తండ్రిగా నేను ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నాను అని గోవిందరాజులు బాధపడతాడు. అప్పుడు గోవిందరాజులు ఎవరికో ఫోన్ చేస్తుండగా ఇంతలో  అఖిల్ వచ్చి చాటుగా అది చూస్తూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collections: `పుష్ప 2` కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఎంతంటే?
Recommended image2
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Recommended image3
రాజమౌళి వల్ల కన్నీళ్లు పెట్టిన అనుష్క శెట్టి, యంగ్ హీరో చేసిన పనికి స్వీటీ ఎంత బాధపడిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved