MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రాజమౌళి వల్ల కన్నీళ్లు పెట్టిన అనుష్క శెట్టి, యంగ్ హీరో చేసిన పనికి స్వీటీ ఎంత బాధపడిందంటే?

రాజమౌళి వల్ల కన్నీళ్లు పెట్టిన అనుష్క శెట్టి, యంగ్ హీరో చేసిన పనికి స్వీటీ ఎంత బాధపడిందంటే?

రాజమౌళి నిర్ణయం వల్ల.. ఓ యంగ్ హీరో చేసిన పనికి అనుష్క శెట్టి కన్నీళ్లు పెట్టిన విషయం మీకు తెలుసా? బాహుబలి సినిమా టైమ్ లో స్టార్ హీరోయిన్ మనసు బాధపడిన సందర్భం ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 07 2026, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనుష్క
Image Credit : Asianet News

స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనుష్క

టాలీవుడ్ జేజమ్మ అనుష్క.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ.. అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలతో తిరుగులేని ఇమేజ్ ను సాధించింది. ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున, సూర్య, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ.. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్మురేపింది. స్టార్ హీరోలను మించి ఇమేజ్ ను సాధించిన అనుష్క.. భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ప్రస్తుతం సినిమాలు తగ్గించి.. అడపా దడపా మాత్రమే కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అనుష్క శెట్టి కన్నీళ్లు పెట్టిన సందర్భం..
Image Credit : Instagram/@anushkashettyofficial

అనుష్క శెట్టి కన్నీళ్లు పెట్టిన సందర్భం..

అనుష్క శెట్టి నటించిన భారీ సినిమాల్లో బాహుబలి కూడా ఒకటి. ఈ సినిమా టైమ్ లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే? బాహుబలి టైమ్ లో రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్ల.. ఓ యంగ్ హీరో చేసిన పనికి అనుష్క శెట్టికి గాయం తగిలి బాధపడిందట. కన్నీళ్లు వచ్చేంతగా అనుష్క ఫీల్ అయ్యిందట. ఆ యంగ్ హీరో ఎవరో కాదు అడివి శేష్. ఈ విషయాన్ని కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు.

37
నాలుగేళ్లుగా..ఒక్క సినిమా కూడా చేయని హీరో..
Image Credit : Adivi Sesh fb

నాలుగేళ్లుగా..ఒక్క సినిమా కూడా చేయని హీరో..

విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ యూత్ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన హీరోల్లో అడివి శేష్ ఒకరు. ఉరుకుటు పరుగులు పెడుతూ.. ఎక్కువ సినిమాలు చేయడం కంటే, నిదానంగా మంచి కంటెంట్‌తో సినిమాలు చేయడానికే ఇంపార్టెన్స్  ఇస్తూ ఆయన తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.

47
రిలీజ్ కు రెడీగా డెయాయిట్ మూవీ..
Image Credit : our own

రిలీజ్ కు రెడీగా డెయాయిట్ మూవీ..

ఇప్పుడు ఆయన హీరోగా నటించిన డెకాయిట్ ఒక ప్రేమ కథ చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అడివి శేష్ మీడియాతో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

57
బాహుబలి సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన
Image Credit : our own

బాహుబలి సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన

ఈ సందర్భంగా ఆయన బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రంలో అనుష్క శెట్టి తో కలిసి పనిచేసిన అనుభవాన్ని వివరించారు.అడివి శేష్ మాట్లాడుతూ, “అనుష్కను అందరూ ‘స్వీటీ’ అని పిలుస్తుంటారు. 

ఆమె వ్యక్తిత్వాన్ని చూసే ఆ పేరు పెట్టారని నాకు అనిపిస్తుంది. ఆమె ఎంతో మంచి వ్యక్తి. బాహుబలి సినిమాలో ఒక సన్నివేశంలో ఆమె ఖైదీగా ఉండగా, నేను కట్టెలతో కొట్టి నిద్రలేపే సీన్ ఉంది. ఆ సీన్ షూటింగ్ పూర్తయ్యాక ఆమెకు గట్టిగా ఏదైనా తగిలిందేమో అని నేను అడిగాను,”

67
అనుష్కను కాలితో తన్నిన హీరో..
Image Credit : Asianet News

అనుష్కను కాలితో తన్నిన హీరో..

అంతకు ముందు జరిగిన మరో సన్నివేశాన్ని కూడా ఆయన వివరించారు. “ఒక షాట్‌లో నేను నా కాలితో అనుష్కను గట్టిగా తన్నాలి ఉంటుంది. మొదట నేను సున్నితంగానే చేశాను. కానీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అది సరిపోదని చెప్పడంతో గట్టిగా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అనుష్కకు మెడ దగ్గర గాయమైంది. ఆమెకు నొప్పి ఎక్కువగా ఉండి, కళ్లలో నీళ్లు కూడా వచ్చాయి,” అని తెలిపారు.

77
బాహుబలిలో భద్రుగిగా అడవి శేష్..
Image Credit : our own

బాహుబలిలో భద్రుగిగా అడవి శేష్..

అడవి శేష్  మాట్లాడుతూ, “ఆ సంఘటన తర్వాతనే నేను ఆమెతో మొదటిసారి మాట్లాడాను,” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.బాహుబలి చిత్రంలో భల్లాలదేవ కుమారుడిగా భద్రుడి పాత్రలో అడివి శేష్ నటించారు. ఆ చిత్రంలో ఆయన నెగెటివ్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా మారి, వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
అనుష్క శెట్టి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Harsha Sai : యూట్యూబ్ లో వీడియో పెట్టి ఏడాది , హర్షసాయి ఏమైపోయాడు.. ఆ దెబ్బ కొంపముంచిందా..
Recommended image2
కొత్తల్లుడికి గ్రాండ్ వెల్కం, కొడవ సంప్రదాయ గెటప్ లో రష్మిక విజయ్ ఎలా ఉన్నారో చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved