MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌

Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌

అల్లు అరవింద్‌కి నిర్మాతగా ఎంతో అనుభవం ఉంది. కానీ కొడుకు అల్లు అర్జున్‌ సినిమా విషయంలో రాంగ్‌ జడ్జ్ మెంట్‌ ఇచ్చారు. సినిమా చూసి, దాన్ని గోడౌన్‌లో పడేయండి అంటూ కామెంట్‌ చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 07 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏఏ 22 ప్రీ లుక్‌తో ఆకట్టుకున్న అల్లు అర్జున్‌
Image Credit : youtube/unstoppable with nbk

ఏఏ 22 ప్రీ లుక్‌తో ఆకట్టుకున్న అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌ గా రాణిస్తున్నారు. `పుష్ప 2` సినిమాతో ఆయన రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్‌ సినిమాలోనే తాను టాప్‌ స్టార్‌గా నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అట్లీతో సినిమా చేస్తున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతుంది. తాజాగా విడుదల చేసిన ప్రీ లుక్‌ పోస్టర్‌ గూస్‌ బంమ్స్ తెప్పిస్తోంది. రేపు బన్నీ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`గంగోత్రి`తో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్‌
Image Credit : Allu Aravind & Allu Arjun

`గంగోత్రి`తో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్‌

హాస్యనటుడు, నిర్మాత అల్లు రామలింగయ్య మనవడిగా, నిర్మాత అల్లు అరవింద్‌ వారసుడిగా, మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్‌. బాలనటుడిగా సినిమాల్లో మెరిసిన ఆయన, `గంగోత్రి` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. సినిమా బాగానే ఆడింది. కానీ పేరు రాలేదు. దీంతో కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకుని `ఆర్య` సినిమా చేశాడు. దీంతో పెద్ద బ్రేక్‌ అందుకున్నారు. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఆ తర్వాత బన్నీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Related Articles

Related image1
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Related image2
Allu Arjun Top 10 Movies: అల్లు అర్జున్‌ బెస్ట్ టాప్‌ 10 మూవీస్‌, లిస్ట్ లోనే లేని పుష్ప 2.. ఇదేం విచిత్రం
35
గంగోత్రి సినిమాపై అల్లు అరవింద్‌ షాకింగ్‌ కామెంట్‌
Image Credit : our own

గంగోత్రి సినిమాపై అల్లు అరవింద్‌ షాకింగ్‌ కామెంట్‌

ఇదిలా ఉంటే తన మొదటి సినిమా విషయంలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. `గంగోత్రి` సినిమాని చూసి అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్‌ వంద సినిమాల డైరెక్టర్‌ అని కూడా చూడలేదు, సినిమాని చూసి గోడౌన్‌లో పడేయమని అన్నారట. ఆ కథేంటో చూస్తే, అల్లు అర్జున్‌ని హీరోగా పరిచయం చేసే బాధ్యతలను నిర్మాత అశ్వినీదత్‌ తీసుకున్నారు. డైరెక్షన్‌ బాధ్యతలు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తీసుకున్నారు. ఈ మూవీ నిర్మాణంలో అల్లు అరవింద్‌ కూడా భాగమయ్యారు.

45
అల్లు అర్జున్‌ సినిమాని డస్ట్ బిన్‌లో పడేయమంటూ కామెంట్‌
Image Credit : our own

అల్లు అర్జున్‌ సినిమాని డస్ట్ బిన్‌లో పడేయమంటూ కామెంట్‌

`గంగోత్రి` సినిమా పూర్తయ్యాక కొంత మందికి మూవీని చూపించారు రాఘవేంద్రరావు. చాలా మంది పెదవి విరిచారు. ఈ మూవీ రిలీజ్‌ అయితే అల్లు అర్జున్‌ కెరీర్‌ అయిపోయినట్టే అన్నారట. ఈ విషయం అల్లు అరవింద్‌ వరకు వెళ్లింది. ఆయన కూడా చూసి సినిమా బాగా రాలేదు, దీన్ని తీసి గోదాంలో పడేయండి అన్నారట. వంద సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి సినిమాని ఇలా అంటున్నారని ఆయన ఆందోళనకు గురయ్యారు. మళ్లీ కుదురుకుని అందరిని కూర్చోబెట్టి ముందుగా తాను చెప్పిన కథ చెప్పాడట. కథగా బాగుందని, సినిమాగా చూస్తే అంతగా ఎక్కడం లేదన్నారట. మళ్లీ సీన్‌ బై సీన్‌ వివరించారు రాఘవేంద్రరావు. దీంతో కొంత వరకు కన్విన్స్ అయ్యారు. కానీ అల్లు అరవింద్‌కి ఎక్కడో కొడుతుంది. ఫైనల్‌ మిక్సింగ్‌ అయ్యాక సినిమాని ఎట్టకేలకు రిలీజ్‌ చేశారు. మూవీకి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది.  సినిమా బాగానే ఆడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

55
రాఘవేంద్రరావు వందవ మూవీ
Image Credit : youtube/etv alitho saradaga show

రాఘవేంద్రరావు వందవ మూవీ

`గంగోత్రి` సినిమా రాఘవేంద్రరావుకి వందవ మూవీ కావడం విశేషం. తాను వంద సినిమాలు చేసినా నిత్య విద్యార్థినే అని, ప్రతి సినిమాకి నిరూపించుకోవాల్సిందే అని, అప్పుడే దర్శకుడిగా మనం నిలబడగలం అని తెలిపారు రాఘవేంద్రరావు. సౌందర్య లహరి ప్రోగ్రామంలో ఈ విషయాన్ని చెప్పారు స్టార్‌ డైరెక్టర్‌. ఇలా కొడుకు హీరోగా సినిమా ఎంట్రీ అదిరిపోయేలా ఉండాలని భావించిన అల్లు అరవింద్‌ ఇలా రియాక్ట్ కావడం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image2
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Recommended image3
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Related Stories
Recommended image1
AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Recommended image2
Allu Arjun Top 10 Movies: అల్లు అర్జున్‌ బెస్ట్ టాప్‌ 10 మూవీస్‌, లిస్ట్ లోనే లేని పుష్ప 2.. ఇదేం విచిత్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved