Devatha: మాధవ్ మీద అనుమానం.. జానకమ్మ ప్రశ్నలు.. రుక్మిణి, భాగ్యమ్మ వాగ్వాదం?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...మాధ,వ్ మీరు దేవీ కి నిజం చెప్పడానికి ఏదో ఒక సమయం అనుకొని ఉంటారు కదా! కానీ నేను అది జరగనివ్వను దేవిని అసలు ఆదిత్య కి దగ్గర చేయను అని చెప్పి వెళ్ళిపోతాడు.ఆ తర్వాత సీన్ లో ఆదిత్య దేవి దగ్గరికి వస్తాడు, దేవి,చిన్మయి లు ఆనందంతో దగ్గరికి వెళ్లి హాద్దుకొని ఎలా ఉన్నారు అంకుల్ అని అడుగుతారు. నేను బాగున్నాను అని అంటాడు ఆదిత్య.అప్పుడు చిన్మయి,దేవి మాకు బిడ్డ రుక్మిణి తో ఆడుకోవాలని ఉన్నది అని వాళ్ళిద్దరూ అంటారు...
మీరు వస్తానంటే మేము కాదంటామ!మీరు ఎప్పుడైనా రావచ్చు అని ఆదిత్య అంటాడు.ఆ తర్వాత సీన్లో భాగ్యమ్మ రుక్మిణి దగ్గరికి వెళ్లి, ఆదిత్య దేవి వాళ్ళ నాన్న అని నువ్వు ఎందుకు చెప్పడం లేదు అని అనగా ఏం చెప్పమంటావు అమ్మ అలా అడిగితే దేవి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.ఇప్పుడు పెనిమిటి దేవి వాళ్ళ నాన్న అని తెలిస్తే ఇంక మా అత్తమ్మ నన్ను ఇంట్లో కూర్చోపెడుతుంది.అప్పుడు సత్యకి కోరుకున్న జీవితాన్ని నేను ఇవ్వలేను...
దానివల్ల సత్య చనిపోతే దానికి నేనే కారణం అవుతానని బాధపడుతూ ఉంటుంది.ఆ తర్వాత సీన్లో మాధవ వాచ్ పట్టుకొని నన్ను భలే మోసం చేశారు నేను చేసే ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది కానీ ఇంకా అలా చూస్తూ ఉంటే రాదని నేనే నా ఇంటి నుంచి పంపించేటట్టున్నాను ఇంకా అలా చేయకూడదు అని గట్టి ప్లాన్ వేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత దేవి, చిన్మయి లు భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటాగా రుక్మిణి అక్కడికి వచ్చి భోజనం పెడుతుంది.
అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అమ్మ అని వాళ్ళు అడగగా మాధవ్ సార్ ఇక్కడికి వస్తే వీళ్లకు దగ్గరవుతున్నారు.ఈరోజు నుంచి భోజనం పెట్టడం, పిల్లలు తీసుకెళ్లి తీసుకురావడం నేనే చేయాలి అని మనసులో అనుకుంటుంది.రుక్మిణి వాళ్లకి భోజనం తినిపించి ఇప్పుడు నుంచి నేనే వస్తానమ్మా అని చెప్తుంది.అప్పుడు వాళ్ళిద్దరూ ఇందాక ఆఫీసర్ సార్ వచ్చారు అని చెప్పి మాట్లాడుకుంటారు.ఆ తర్వాత సీన్లో మాధవ్ క్యారేజ్ తీసుకెళ్తాను అని అనగా జానకమ్మ, రాధ అప్పుడే తీసుకెళ్లి పోయింది అని అంటుంది.
అప్పుడు మాధవ్ మనసులో, నేను పిల్లలకి దూరం అవ్వాలని రాద ఇలా చేసింది అనుకుంటాడు.అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు జానకమ్మ వచ్చి అసలు ఏం జరుగుతుంది నువ్వు రాదని ఏమైనా తిట్టావా? రాద ప్రవర్తన లో మార్పు వచ్చింది.అలాగే మీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది మొన్న దేవి నే ఎక్కడికి తీసుకెళ్లావు అంటే చెప్పలేదు అని అడగగా మాధవ్ కోపంతో నువ్వు నా గురించి, నాన్న గురించి మాత్రమే ఆలోచించామా మిగిలిన వాళ్ల గురించి నీకు అనవసరం అని తిట్టి వెళ్ళిపోతాడు.
మాధవ్ నన్ను తిట్టడం నా జీవితంలో ఇదే మొదటిసారి అసలు ఏం జరుగుతుంది అని బాధపడుతున్నప్పుడు జానకమ్మ వాళ్ళ భర్త అక్కడికి వస్తాడు. జరిగిన విషమంతా వాళ్లకు చెప్పి మీరైనా అడగండి అసలు ఏమవుతుంది అని అనగా పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకు ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈయన ఇలాగ అంటున్నార, దేవి ఏమో అలా ఉంటుంది, రాధ, మాధవ్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అసలు ఏమవుతుంది అని జానకమ్మ ఆలోచిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే,