MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?

Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?

Jailer 2 Review: రజనీకాంత్‌ హీరోగా నటించిన `జైలర్‌ 2` మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ టాక్‌ బయటకు వచ్చింది. ప్లస్‌ లే కాదు, మైనస్‌లు కూడా కలవరపెడుతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 13 2026, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ నెల 15న రజనీకాంత్‌ జైలర్‌ 2 విడుదల
Image Credit : Asianet News

ఈ నెల 15న రజనీకాంత్‌ జైలర్‌ 2 విడుదల

రజనీకాంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `జైలర్‌ 2`. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రమ్యకృష్ణ ఆయనకు జోడీగా నటించిన ఈ చిత్రంలో మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌ గెస్ట్ రోల్స్ చేశారు. అలాగే ఎస్‌ జే సూర్య, విద్యాబాలన్‌, మిథున్‌ చక్రవర్తి, మిర్నా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌, విజయ్‌ సేతుపతి ఎంట్రీ కూడా ఉంటుందట. సన్‌ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదల కాబోతుంది. మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్‌` మూవీ పెద్ద హిట్‌ కావడంతో ఇప్పుడు `జైలర్‌ 2`పై భారీ అంచనాలున్నాయి. మరి సినిమా ఎలా ఉందబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జైలర్‌ 2 సెన్సార్‌ టాక్‌
Image Credit : Asianet News

జైలర్‌ 2 సెన్సార్‌ టాక్‌

`జైలర్‌` 2 మూవీ ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యూఏ సర్టిఫికెట్‌ని పొందింది. 16 ఏళ్లకుపైబడ్డ వాళ్లు సినిమా చూడొచ్చు. సినిమా నిడివి రెండు గంటల 45 నిమిషాలు ఉంటుందని తెలిసింది. ఇది డీసెంట్‌ నిడివి అనే చెప్పొచ్చు. ఇక సెన్సార్‌ నుంచి పాజిటివ్ రియాక్షన్‌ వచ్చినట్టు సమాచారం. కానీ రక్తపాతం ఎక్కువగా ఉండటంతో ఆయా సీన్లలో హింసని తగ్గించాలని తెలిపారట. కొన్ని సీన్లని మార్చాలని వెల్లడించారట. అభ్యంతకర డైలాగ్‌లను మ్యూట్‌ చేయాలని వెల్లడించారట. ఇలా కొన్ని కండీషన్లు పెట్టడంతో టీమ్‌ ఓకే చెప్పింది. కొన్ని డైలాగ్‌లు, రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలకు సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తం మయ్యాయి. అలా సుమారు 15సెకన్లపాటు కట్‌ విధించినట్టు సమాచారం.

35
జైలర్‌ 2 కథ ఇదే
Image Credit : Youtube

జైలర్‌ 2 కథ ఇదే

జైలర్‌ 2 కథ ఏంటనేది చూస్తే, రజనీకాంత్‌ రిటైర్డ్ జైలర్‌. ఆర్థిక సమస్యలతో ఉన్న తన కుటుంబాన్ని పార్ట్ టైమ్‌ కార్‌ వాషింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తూ సపోర్ట్ గా ఉంటాడు. మాదకద్రవ్యాల మాఫియా నుంచి తన కోడలు మిర్నా, మనవడు రిత్విక్‌, భార్య రమ్యకృష్ణలకు ప్రాణ హానీ ఉంటుంది. ఈ క్రమంలో తప్పని పరిస్థితుల్లో మిథున్‌ చక్రవర్తి, ఆయన కొడుకు ఎస్‌ జే సూర్య, కోడలు విద్యాబాలన్‌ నిర్వహించే దందాలో భాగమవుతాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం హీరో తిరుగుబాటు చేస్తాడు. పరిస్థితులు చేయి దాటే పరిస్థితుల్లో మరోసారి మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌లా సహాయం తీసుకుంటాడట. ఈ క్రమంలో ఇందులో హృతిక్‌, విజయ్‌ సేతుపతి ఎంట్రీ కూడా ఉంటుందని సమాచారం. వరుస ట్విస్ట్ లు ఆశ్చర్యపరుస్తాయని తెలుస్తోంది.

45
జైలర్‌ 2లో హైలైట్స్ ఇవే
Image Credit : Asianet News

జైలర్‌ 2లో హైలైట్స్ ఇవే

సినిమా ఫస్టాఫ్‌ డార్క్ హ్యూమర్‌, రజనీకాంత్‌ మాస్‌ ఎలివేషన్లు, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ ప్లేతో ఫస్టాఫ్‌ అదిరిపోయిందని అంటున్నారు. ముత్తువేల్‌ పాండియన్‌ గా రజనీకాంత్‌ మరోసారి దుమ్ములేపాడని చెబుతున్నారు. ఇంటర్వెల్‌ సీన్‌ గుస్‌బంమ్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్‌లో రెండు బలమైన ట్విస్టు లు ఉంటాయని, క్లైమాక్స్ లో వచ్చే హృతిక్‌ రోషన్‌ సీన్స్ హైలైట్స్ గా నిలుస్తాయని తెలుస్తుంది. హీరోల పాత్రలతోపాటు విలన్‌ పాత్ర కూడా హైలైట్‌గా నిలుస్తుందంటున్నారు. దీనికితోడు అనిరుద్‌ రవిచందర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మరో హైలైట్‌ అవుతుందని సమాచారం. బీజీఎంతో సినిమా నడిచిపోతుందని చెబుతున్నారు.

55
జైలర్‌ 2ని కలవరపెట్టే అంశం
Image Credit : Asianet News

జైలర్‌ 2ని కలవరపెట్టే అంశం

ఇదిలా ఉంటే కొంత నెగటివ్‌ టాక్‌ కూడా ఉంది. సీక్వెల్‌ చాలా బలవంతంగా తీసినట్టుగా ఉందని, డ్రామా అంతగా పండలేదని చెబుతున్నారు. గెస్ట్ రోల్స్, ట్విస్ట్ లు అంతగా పండలేదంటున్నారు. మొదటి భాగం స్థాయిలో లేవని టాక్‌. అనిరుద్‌ బీజీఎం కూడా రొటీన్‌గానే ఉంటుందని చెబుతున్నారు. రజనీకాంత్‌ నిలబడి నటించాడు, యాక్షన్‌లో ఆయన చేసిందేం లేదని చెబుతున్నారు. ఇలా కొంత నెగటివ్‌ టాక్‌ కూడా ఉంది. మరి సినిమా రియల్‌గా ఎలా ఉంటుందనేది ఏసియానెట్‌ ఒరిజినల్‌ రివ్యూలో చూడండి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Recommended image2
Jailer 2: జన నాయకన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయిన జైలర్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇన్ని కోట్లా?
Recommended image3
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Related Stories
Recommended image1
Rajinikanth Villain Movies: రజనీకాంత్‌ విలన్‌గా విశ్వరూపం చూపించిన టాప్ 5 మూవీస్‌.. సూపర్‌ స్టార్‌ కావడానికి ముందు
Recommended image2
Chiranjeevi: రాజశేఖర్‌లాగా నేను కూడా యాక్ట్ చేయలేను.. చిరంజీవి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌.. ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved