- Home
- Entertainment
- ఇష్టం లేకపోయినా సూపర్ స్టార్ కృష్ణకి విలన్ గా నటించిన లెజెండ్రీ నటుడు.. చరిత్ర సృష్టించిన మూవీ అది
ఇష్టం లేకపోయినా సూపర్ స్టార్ కృష్ణకి విలన్ గా నటించిన లెజెండ్రీ నటుడు.. చరిత్ర సృష్టించిన మూవీ అది
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక చిత్రంలో విలన్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఓ లెజెండ్రీ నటుడు ఆ చిత్రంలో ఇష్టం లేకపోయినప్పటికీ విలన్ గా నటించారట. ఆ వివరాలు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సూపర్ స్టార్ కృష్ణ సాహసాలు
టాలీవుడ్ లో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ లో కౌబాయ్ చిత్రాల మొదలుపెట్టింది ఆయనే. ఎవరూ చేయని సాహసాలు చేసి చూపించారు. సినిమా మేకింగ్ లో అప్పట్లో కృష్ణ తీసుకున్న నిర్ణయాలు టాలీవుడ్ గతిని మార్చేశాయి. ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన రికార్డు కూడా కృష్ణ పైనే ఉంది.
అల్లూరిగా కృష్ణ అద్భుత నటన
సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని అద్భుతమైన చిత్రాల్లో నటించినప్పటికీ అల్లూరి సీతారామరాజు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతలా ఒదిగిపోయారో.. విలన్ గా బ్రిటిష్ అధికారి రూథర్ ఫోర్డ్ పాత్రలో లెజెండ్రీ నటుడు జగ్గయ్య కూడా అంతే అద్భుతంగా నటించారు. అయితే ఈ మూవీలో విలన్ గా నటించడం జగ్గయ్యకి ముందుగా ఇష్టం లేదట. కానీ చిత్ర యూనిట్ ఆయన్ని ఒప్పించారు.
జగ్గయ్యకి ఆ పాత్రలో నటించడం ఇష్టం లేదా ?
జగ్గయ్యకి రూథర్ ఫోర్డ్ పాత్రలో నటించడం ఇష్టం లేకపోవడానికి ఓ కారణం ఉంది. ఆ పాత్రలో నటిస్తే నెగిటివ్ షేడ్స్ లో చెడ్డవాడిగా నటించాలి. జగ్గయ్యకి అలా నటించడం ఇష్టం లేదు. తన చిన్నతనంలో బ్రిటిష్ అధికారి రూథర్ ఫోర్డ్ గురించి జగ్గయ్య చాలా మంచి విషయాలు విన్నారట. జగ్గయ్య సొంత జిల్లా గుంటూరులో రూథర్ ఫోర్డ్ కలెక్టర్ గా పని చేశారట. ఆ టైంలో రూథర్ ఫోర్డ్ ఆసుపత్రులు కట్టించడం, పేదలకు అవసరమైన పనులు చేయడం లాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారని జగ్గయ్య విన్నారట. అందువల్ల రూథర్ ఫోర్డ్ పై జగ్గయ్యకి మంచి అభిప్రాయం ఉండేది.
జగ్గయ్య చేసిన సూచనలు
దీంతో అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించాల్సి వచ్చినప్పుడు రూథర్ ఫోర్డ్ పాత్ర గురించి కొన్ని సూచనలు చేశారట. ఆయన పాత్రని కంప్లీట్ గా ఒక యాంగిల్ లోనే నెగిటివ్ గా చూపించడం కరెక్ట్ కాదు. ఆయన తన దేశానికి కట్టుబడిన సిన్సియర్ అధికారి. ఆయన కోణం నుంచి కూడా కొన్ని మంచి డైలాగులు రాయండి అని సూచించారట.
అల్లూరి సీతారామరాజు మూవీ ప్రభావం
ఆ విధంగా జగ్గయ్య అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించారు. అల్లూరి సీతారామరాజు మూవీ చరిత్ర సృష్టించిన చిత్రంగా నిలిచిపోయింది. ఈ మూవీ తర్వాత కృష్ణ నటించిన చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అల్లూరి సీతారామరాజు చిత్రం పెంచేసిన అంచనాలని ఆ తర్వాత కృష్ణ నటించిన చిత్రాలు ఏవీ అందుకోలేకపోయాయి. అంతలా ఆ మూవీ ప్రభావం ఉండేది.