- Home
- Entertainment
- Keerthy Suresh: తెలుగు, తమిళంలో అంకుల్స్ తో పెళ్లి, రొమాన్స్.. కీర్తిసురేష్, రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
Keerthy Suresh: తెలుగు, తమిళంలో అంకుల్స్ తో పెళ్లి, రొమాన్స్.. కీర్తిసురేష్, రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
తెలుగులో ఒక అంకుల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, చాలా ఏజ్ ఉన్న వ్యక్తితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని కామెంట్స్ చేసింది రాధికా ఆప్టే. అదే సమయంలో కీర్తిసురేష్ కూడా అలాంటి కామెంటే చేయడం గమనార్హం.

అక్క మూవీలో మాస్ రోల్స్ లో కీర్తిసురేష్, రాధిక ఆప్టే
స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్, బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్‌లో అంకుల్స్ నే పెళ్లి చేసుకోవాలంటూ కామెంట్స్ చేశారు. వీరి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వీరిద్దరు కలిసి బాలీవుడ్లో `అక్కా` అనే సిరీస్‌లో నటించారు. కాస్త మాస్ యాక్షన్ కంటెంట్‌తో తెరకెక్కిన సిరీస్ ఇది. ఇందులో కీర్తిసురేష్ అక్క పాత్రలో డామినేటింగ్, యాక్షన్ రోల్ చేసింది. రాధికా ఆప్టే పాత్ర బోల్డ్ గా, యాక్షన్ ప్రధానంగా సాగింది. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
అంకుల్‌తో పెళ్లి, రొమాన్స్ చాలా కష్టంగా అనిపించింది- రాధికా ఆప్టే
ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రాధికా ఆప్టే, కీర్తిసురేష్ హిందీ మీడియాతో ముచ్చటించారు. ఇందులో తెలుగు హీరోల గురించి యాంకర్ ప్రశ్నించగా, రాధికా ఆప్టే స్పందస్తూ, `నేను తెలుగులో ఒక మామ వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చాలా పెద్ద వయసున్న వ్యక్తితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. వారితో ఇలాంటి సీన్లు చేస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. పితృస్వామ్యంతో కూడిన ధోరణి ఉన్న పరిస్థితి. ఇది నాకు చాలా కష్టతరమైన అనుభవం` అని చెప్పింది రాధికా ఆప్టే. నవ్వుతూ ఆమె ఈ కామెంట్స్ చేసింది.
తెలుగు, తమిళంలో అంకుల్స్ ని పెళ్లి చేసుకోవాలి- కీర్తిసురేష్
దీనికి కీర్తిసురేష్ కూడా రియాక్ట్ అవుతూ, తెలుగులో, తమిళంలో చాలా వరకు అంకుల్స్ నే పెళ్లి చేసుకోవాలని, రాధికా ఆప్టే కామెంట్స్ ని సమర్ధించింది. ప్రస్తుతం వీరి కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ అవుతున్నాయి. రాధికా ఆప్టేని ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెకి ఇష్టం లేకపోయి ఉంటే ఆ సినిమా ఎందుకు చేశారని అంటున్నారు. అప్పుడు అవకాశం రావడం అదృష్టమని చెప్పారు. ఇప్పుడు అంకుల్స్ తో రొమాన్స్ చేయడం ఇబ్బంది అంటున్నారని, అవకాశాన్ని బట్టి మాటలు మారుస్తుంటారని విమర్శిస్తున్నారు.
రాధికా ఆప్టే తెలుగులో `రక్తచరిత్ర` రెండు భాగాలతోపాటు బాలయ్యతో `లెజెండ్`, `లయన్` చిత్రాలు చేసింది. ఆయనకు భార్యగా కనిపించింది. దీంతో బాలయ్యని ఉద్దేశించే ఆమె ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. గతంలోనూ తెలుగు హీరో అసభ్యంగా తాకాడని, ఇబ్బంది పెట్టాడని చెప్పి కామెంట్స్ చేసింది రాధిక. ఇప్పుడు ఇలా వ్యంగ్యంగా రియాక్ట్ కావడం గమనార్హం.





