- Home
- Entertainment
- Singer Jhansi: పాటలు పాడితే ఆపేశారు, ఎలిమినేషన్ అన్‌ఫెయిర్.. ట్రోల్స్ పై సింగర్ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
Singer Jhansi: పాటలు పాడితే ఆపేశారు, ఎలిమినేషన్ అన్‌ఫెయిర్.. ట్రోల్స్ పై సింగర్ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
సింగర్ ఝాన్సీ బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలిమినేషన్‌పై, బిగ్ బాస్ పాటలు పాడనివ్వకపోవడం, ట్రోల్స్ పై సింగర్ ఝాన్సీ స్పందించింది.

ఎలిమినేషన్‌పై సింగర్ ఝాన్సీ రియాక్షన్
బిగ్ బాస్ తెలుగు 8వ వారం పూర్తయ్యింది. డబుల్ ఎలిమినేషన్ పెద్ద రచ్చ అయిన విషయం తెలిసిందే. సింగర్ ఝాన్సీ, రోహిత్ ఎలిమినేట్ అయ్యారు. ఆడియెన్స్ ఓట్ల ద్వారా సింగర్ ఝాన్సీని, కంటెస్టెంట్ల ఓట్ల ద్వారా రోహిత్‌ని ఇంటి నుంచి పంపించారు. ఈ క్రమంలో సింగర్ ఝాన్సీ మీడియాతో ముచ్చటించింది. తన ఎలిమినేషన్‌పై స్పందించింది. తాను ఇంత తొందరగా హౌజ్ నుంచి బయటకు వస్తానని అనుకోలేదని, తనకే పెద్ద షాకింగ్‌గా ఉందని చెప్పింది. తాను టాప్ 5 లో ఉంటానని భావించాను. కానీ సడెన్ గా ఎలిమినేషన్ అనేసరికి నమ్మలేకపోతున్నాను. గేమ్స్, టాస్క్ లో తాను బాగానే చేశాను, ఎక్కడ తగ్గలేదని చెప్పింది.
బిగ్ బాస్ పాటలు పాడనివ్వకుండా చేశారు
ప్రారంభంలో ఎక్కువగా గేమ్స్ ఆడే అవకాశం వచ్చిందని, కానీ చివర్లో ఆ ఛాన్స్ రాలేదని, అందుకే ఎక్కువగా కెమెరాల్లో కనిపించలేదని చెప్పింది ఝాన్సీ. తన బలం పాటలు అని, అందులోనూ పాటలు పాడాలి, తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని అనుకున్నాను. కానీ బిగ్ బాస్ హౌజ్‌లో ఆ అవకాశం కల్పించలేదు. తాను పాటలు పాడే సమయంలో బిగ్ బాస్ వెంటనే పాడటం ఆపేయాలని ఆదేశించారు. చాలా సార్లు ఇలా జరిగింది. హౌజ్‌లో పాటలు పాడొద్దు అనేది తనకు తెలియదని, అదొక రూల్ ఉందని తర్వాత చెప్పారని వెల్లడించింది. అయితే కొన్ని తన సొంత పాటలు ఉన్నాయని, వాటికి కాపీరైట్స్ సమర్పించాను, వాటిని కూడా పాడనివ్వలేదు, టెలికాస్ట్ చేయలేదని చెప్పింది ఝాన్సీ. ఆ విషయంలో తనకు అన్యాయం జరిగిందని చెప్పింది. బిగ్ బాస్ ఎలిమినేషన్ కూడా అన్ ఫెయిర్ గా భావించింది ఝాన్సీ.
రోహిత్ ఎలిమినేషన్ అన్‌ఫెయిర్
ఇక రోహిత్ ఎలిమినేషన్‌పై స్పందిస్తూ ఆయనది అన్‌ఫెయిర్ ఎలిమినేషనే అనిపిస్తుంది. ఆడియెన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ చేస్తే బాగుండేది, అలా కాకుండా ఆడియెన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ చేయడం సరైనది కాదు, అది పూర్తిగా అన్‌ఫెయిరే అనిపించిందని చెప్పింది ఝాన్సీ. విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందని అడగ్గా త్రిగుణ్‌కి ఛాన్స్ ఉందని చెప్పింది. ముఖేష్ అన్న కూడా విన్నర్ కావాలని కోరుకుంటానని చెప్పింది. టాప్ 5 గురించి స్పందిస్తూ, తాను అక్కడ ఉండాల్సిన దాన్ని అని చెప్పింది.
ట్రోలింగ్‌పై సింగర్‌ఝాన్సీ ఘాటు వ్యాఖ్యలు
ఈ క్రమంలో తనపై ట్రోలింగ్‌కి స్పందించింది సింగర్ ఝాన్సీ. రైతు బిడ్డ ట్యాగ్‌ని వాడటం పట్ల ఆమె రియాక్ట్ అయ్యింది. తాను వ్వవసాయం చేస్తాను, ఆ మట్టి వాసన ఏంటో నాకు తెలుసు. రైతు బిడ్డగా చెప్పుకుంటాను అందులో తప్పేముంది. ఎవరికి వాళ్లు తాము చేసే పని చెప్పుకుంటారు. అలా నేను రైతు బిడ్డని కాబట్టి అదే చెప్పుకున్నా, బరాబర్ చెప్పుకుంటా. అందులో తప్పేం లేదు, కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారని, అమ్మాయినని తనని తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిపింది. తాను ఎంతో కష్టపడి, అవమానాలు దాటుకొని ఇక్కడి వరకు వచ్చాను. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి ఇక్కడ వరకు వచ్చాను, తాను చాలా వరకు సాధించాను, ఇలాంటి అవమానాలు, ట్రోల్స్ ని దాటుకొని వచ్చాను, అదే స్థాయిలో వారిపై పోరాడుతూ వెళ్తాను, ట్రోలర్స్ కి భయపడేది లేదని స్పష్టం చేసింది సింగర్ ఝాన్సీ.





