- Home
- Entertainment
- Guppedantha Manasu: జగతికి సారీ చెప్పిన వసుధార.. ఇంటికి వెళ్ళిపోదామని మహేంద్రని అడిగిన జాగతి?
Guppedantha Manasu: జగతికి సారీ చెప్పిన వసుధార.. ఇంటికి వెళ్ళిపోదామని మహేంద్రని అడిగిన జాగతి?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. వసుధార రిషి తో, దేవయాని గురించి మాట్లాడుతూ, మేడమ్ కి నేను ఇక్కడ ఉండడం బాగా నచ్చుతుంది అంట సర్. నేను మీకు తోడుగా ఉంటున్నాను అని నన్ను మెచ్చుకుంటున్నారు. వీలైతే ఇక్కడే ఉండమంటున్నారు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో నేను ఉండడం ధైర్యంగా ఉన్నదట అని అంటుంది. చేసేదేమీ లేక దేవయాని బుర్ర ఊపుతుంది. అప్పుడు రిషి దేవయానితో, మీరు వసుధారకు థాంక్స్ చెప్పడం ఎందుకు పెద్దమ్మ ఎంత కాదనుకున్న వసుధార మన కుటుంబ సభ్యురాలు కదా అని అంటాడు రిషి.
అప్పుడు రిషి వసుధరాలు కాలేజీకి బయలుదేరుతూ ఉండగా కార్ ఎక్కుతున్నప్పుడు మహీంద్ర గురించి ఆలోచించుకుంటూ ఉండిపోతాడు. ఇది చూసిన వసుధార, ఇదంతా నా వల్లే వచ్చిందా ఆ గురుదక్షిణ కోసమే ఇదంతా జరుగుతుందా! నేను మరీ మొండి దానిలా తయారవుతున్నానా పరిష్కారం కోసం వెతుకుతూ పెద్ద సమస్యను సృష్టించానా ఒక తండ్రిని ఒక కొడుకుకి దూరం చేశానా అని అనుకుంటుంది. అప్పుడు రిషి వసుతో, నేను ఇంత బాధపడుతున్నాను కదా వసుధార వాళ్ళు కూడా ఇలాగే ఉండుంటారా అని అడుగుతాడు.
బాధ లేకుండా ఎలా ఉంటుంది సార్ మీ కన్నా ఎక్కువే బాధపడుతూ ఉంటుంటారు అని వసు అనగా, మరి అంత బాధ ఉన్నప్పుడు నన్ను వదిలి వెళ్ళడం ఎందుకు అయినా జగతి మేడం కూడా తెలివైన వారే కదా చెప్పాలి కదా ఒక మాట అయినా అని అంటాడు రిషి. దానికి వసు, చెప్పలేదని మనం ఎలా అనుకుంటాం సార్. మీ అందరిలోని ఒక లక్షణాలే ఉన్నాయి అందర్నీ బాగా ప్రేమిస్తారు, అభిమానిస్తారు కానీ మొండి వాళ్ళు అంటుంది వసు. అప్పుడు వసు మనసులో, నేను దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తాను మిమ్మల్ని కలుపుతాను అని అనుకుంటుంది.
ఆ తర్వాత సీన్లో జగతి, మహీంద్ర లు హాల్ లో కూర్చొని ఉండగా వసు జగతికి సారీ అంటూ మెసేజ్ పెడుతుంది. అప్పుడు జగతి మహీంద్ర తో ఇలా వసూ సారీ అని చెప్తూ, మహేంద్ర మనం ఇంక అక్కడికి వెళ్దామా ఇక్కడ ఉండలేకపోతున్నాము. వాళ్ళ మనసులు మారాయి కదా క్షమించమని కూడా అడిగారు అని అనగా సారీ చెప్పినంత మాత్రాన మనం వెళ్ళిపోతే ఇన్ని రోజుల మన అజ్ఞాతవానికి విలువ ఉండదు జగతి. వాళ్ళు ఇంకా మారాలి ఈ గురుదక్షిణ ఒప్పందాన్ని పూర్తిగా తొలగించాలి. వసు సారీ చెప్పింది గాని గురుదక్షిణ గురించి ఇంక మాట్లాడను అని చెప్పలేదు కదా.
మనం వెళ్తే మళ్ళీ సమస్య తిరిగి మొదటికి వస్తుంది కనుక ఇంకొన్ని రోజులు ఓర్చుకోవాలి అని మహేంద్ర అంటాడు. అప్పుడు జగతి, రిషి లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావు నువ్వు లేకుండా రిషి అస్సలు ఉండలేకపోతున్నాడు. మనం ఇలాగే దూరంగా ఉంటే మన బంధాలు ఇంకా దూరం అయిపోతాయేమో మనం రిషి దగ్గరికి వెళ్ళిపోదాం మహేంద్ర అని జగతి అంటుంది. దానికి మహేంద్ర, నన్ను బలవంతంగా ఒప్పించాలని చూడొద్దు జగతి మనం ప్రస్తుతానికి రిషీని, వసుని కలపడానికి మాత్రమే చూడాలి దయచేసి ఇంక బలవంతం పెట్టొద్దు అని అంటాడు.
ఆ తర్వాత సీన్లో దేవయాని హాల్లో కూర్చుని ధరణిని పిలుస్తుంది. నా పక్కన కూర్చో ధరణి అనగా, మీరు పెద్దవాళ్ళు అత్తయ్య నాకు నీ పక్కన కూర్చోవడం గౌరవంగా ఉండదు అని అంటుంది. అప్పుడు దేవయాని ఒకసారి నీ ఫోన్ తీసుకురా అని అనగా ఎవరికి ఫోన్ చేస్తారు అత్తయ్య అని ధరణి అంటుంది. అప్పుడు దేవయాని ధరణి ఫోన్ తీసుకొని కాల్ లిస్ట్ వెతుకుతుంది. జగతి అత్తయ్య మావయ్యలు గురించి నాకు తెలుసు అని మీరు అనుకుంటున్నారా అత్తయ్య. లేదు వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు అని అనగా నేను నిన్ను నమ్మను నువ్వు వాళ్ళ పార్టీయే అని దేవయాని అంటుంది.
మీరు నన్ను నమ్మాలి అత్తయ్య అని అంటుంది ధరణి. నువ్వు జగతి ట్రైనింగ్ లో బానే తయారైనట్టున్నావే అని దేవయాని అనగా, సరే అత్తయ్య నేను వెళ్లి వంట చేసుకోవాలి ఏదైనా ఫోన్ వస్తే నాకు చెప్పండి అలాగే చివర్లో రెండు సున్నాలు వచ్చి ఒక నెంబర్ ఉంటాది ఆ ఫోన్ని లిస్ట్ చెయ్యొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. అలాగే వెళ్తూ వెళ్తూ ఫోన్లో పాము ముంగిస ఆటున్నది ఆడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. దీనికి నేను ఎలా కనిపిస్తున్నాను చి చి అని అనుకుంటుంది దేవయాని. ఆ తర్వాత సీన్లో మహేంద్ర, రిషిదీ తనది ఫోటో చూసుకుంటూ ఉంటాడు.
భోజనం చేయు మహేంద్ర అని జగతి అనగా, వద్దు జగతి నాకు రిషి గుర్తొస్తున్నాడు ఆకలి లేదు అని అంటాడు. ఇప్పుడు రిషి కూడా నీ గురించి ఆలోచిస్తూ భోజనం మానేయాలి అని నువ్వు కోరుకోవు కదా రా మహీంద్ర అని తినిపిస్తూ ఉంటుంది జగతి. అప్పుడు మహేంద్ర రిషి తనికి తినిపిస్తున్నట్టు అనుకుంటూ ఎంతో బాధపడతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!