- Home
- Entertainment
- Guppedantha Manasu: సాక్షికి చుక్కలు చూపించిన జగతి.. అధికారం గురించి దేవయానికి ప్రశ్నలు.. బయపడిపోయిన వసు!
Guppedantha Manasu: సాక్షికి చుక్కలు చూపించిన జగతి.. అధికారం గురించి దేవయానికి ప్రశ్నలు.. బయపడిపోయిన వసు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత (Guppedantha Manasu) మనసు సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సాక్షి (Sakshi).. నీకు ఆ వసునే ప్రాధాన్యత అయింది అని రిషి తో అంటుంది. ఆ మాటతో రిషి (Rishi) షట్ అప్ అంటూ విరుచుకుపడతాడు. అంతేకాకుండా ఆ వసుధార స్నేహం కోసం నువ్వు తహతహలాడుతున్నావు అని సాక్షి అందరి ముందు వెళ్లగక్కుతుంది.
ఇక రిషి (Rishi) నీకు నేను దక్కను అని తెలిసాక నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇంకెవరినో బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు సాక్షి అని అంటాడు. ఇక సాక్షి (Sakshi) రిషి, వసులు కలిసి ఉన్న ఫోటోను ప్రూఫ్ గా చూపిస్తుంది. ఇక జగతి ఇన్నాళ్లుగా గుర్తుకురాని రిషి సడన్ గా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాడు అని సాక్షి ను అడుగుతుంది.
ఆ తర్వాత నేను ఎందుకు మాట్లాడుతున్నానో నా అర్హత ఏమిటో ఇక్కడ అందరికీ తెలుసని జగతి (Jagathi) అంటుంది. అంతేకాకుండా రిషి జీవితం ఏమిటో తనకు క్లారిటీ ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి పాఠాలు చెప్పనవసరం లేదు అని అంటుంది. సాక్షి (Sakshi) నాకు ఆ హక్కు ఉంది ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది అని అంటుంది.
ఈలోపు అక్కడికి వసు (Vasu) వస్తుంది ఇక అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వసు రిషి (Rishi) దగ్గరికి వెళ్లగా ఎందుకు వచ్చావని విరుచుకు పడతాడు. వచ్చేముందు ఫోన్ చేయాలని తెలియద అని కోపం పడతాడు. ఇక వసు మీరు కాలేజీలో ఫర్స్ మర్చిపోయారు అని ఆ ఫర్స్ అక్కడ పెట్టి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత రిషి (Rishi) దగ్గరకు జగతి (Jagathi) వెళ్లి ఇప్పటిదాకా అందరూ ఏవేవో అనుకున్నారు. అందులో నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు కానీ ఈ విషయం నీకు నేను ముందే చెప్పాను. వసును నువ్వు లవ్ చేస్తున్నావని అని జగతి రిషి తో అంటుంది.
ఇక తరువాయి భాగం లో రిషి (Rishi) వసును హాల్ టికెట్ తీసుకున్నావా అని అంటాడు. ఇక ఎప్పుడు వెళ్తున్నావ్ అని అడుగుతాడు. వెళ్లడం ఏమిటి సార్ మీరు రారా అని వసు (Vasu) అంటుంది. దాంతో రిషి వసుధార నువ్వేమీ చిన్నపిల్లవు కాదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో వసు భాద పడుతుంది.