- Home
- Entertainment
- Guppedantha Manasu: జగతి ప్లాన్.. డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న మహేంద్ర.. షాక్ లో రిషి!
Guppedantha Manasu: జగతి ప్లాన్.. డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న మహేంద్ర.. షాక్ లో రిషి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తల్లి, కొడుకు అనే కాన్సెప్టుతో ప్రసారమవుతుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Guppedantha Manasu
కోపంగా ఇంటికి వచ్చిన జగతి (Jagathi) కూల్ గా కాఫీ తాగుతూ ఉంటుంది. అదే క్రమంలో వసు (Vasu) మీకు ప్రాజెక్టు పోయినందుకు బాధ లేదా అని జగతి ను అడుగుతుంది. దానికి నాకు నా ప్రాజెక్ట్ కంటే కొడుకు ముఖ్యం అని చెబుతుంది. అదే క్రమంలో జగతి (Jagathi) నీకు ప్రాజెక్టు పోయినందుకు ఇంత బాధగా ఉంటే మరి నాకు కొడుకు దూరమైతే ఇంకెంత బాధగా ఉంటుంది అని అంటుంది.
Guppedantha Manasu
ఆ తర్వాత మహేంద్ర (Mahendra) వచ్చి జగతి నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావో అని నేను అనుకుంటే నువ్వెంటి స్పెషల్ వంటకాలు అంటావ్ అని అడుగుతాడు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే జగతి (Jagathi) సిటీ వదిలేసి వెళుతుందని మహేంద్ర మనసులో బాధపడతాడు.
Guppedantha Manasu
అదే క్రమంలో జగతి (Jagathi) నేను ఒక నిర్ణయానికి వచ్చానని తన ప్లాన్ ని వసు, మహేంద్ర లకు పంచుకుంటుంది. దాంతో మహేంద్ర కొంచెం ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత రిషి.. వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తాడు. అంతేకాకుండా మీ జగతి మేడం ఏమనుకుంటున్నారు అని వసు (Vasu) ను అడుగుతాడు.
Guppedantha Manasu
అదే క్రమంలో వసు (Vasu) రిషి కోసం స్వీట్ తీసుకొని వస్తుంది. అంతేకాకుండా వసు కాఫి కూడా తెప్పించి ఐస్ క్రీమ్ తింటూ కాఫీ తాగండి అని అంటుంది. కానీ రిషి (Rishi) కి ఏమీ అర్థం కాదు. ఇక అంతే కాకుండా ఈరోజు బిల్ మొత్తం ఫ్రీ అని వసు అంటుంది.
Guppedantha Manasu
దాంతో రిషి (Rishi).. వసు కోపంగా ఉంటుంది అనుకుంటే ఇంత సంతోషంగా ఉంది ఏంటి అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత నీ ఉత్సాహానికి కారణమేమిటని వసుకు రిషి టెక్స్ట్ చేసి అడుగుతాడు. దాంతో వసు (Vasu) ఉత్సాహంగా ఉండడం మంచిదే కదా సార్ అని అంటుంది.
Guppedantha Manasu
ఆ తర్వాత మహేంద్ర (Mahendra) నీకు ఇష్టమైన నిర్ణయాలను నువ్వు తీసుకుంటే కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ పదవి నుంచి నేను తప్పుకుంటాను అని రిషి తో చెప్పుతాడు. దాంతో రిషి (Rishi) ఆశ్చర్యపోతాడు.