- Home
- Entertainment
- Guppedantha Manasu: లైబ్రరీలో రిషి, వసులను చూసిన గౌతమ్.. ప్రపోజ్ చేద్దాం అంటే అల్టిమేట్ షాక్?
Guppedantha Manasu: లైబ్రరీలో రిషి, వసులను చూసిన గౌతమ్.. ప్రపోజ్ చేద్దాం అంటే అల్టిమేట్ షాక్?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత (Guppedantha Manasu) మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్ ఏంటో తెలుసుకుందాం. గౌతమ్ కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా ఆఫీస్ ప్రాజెక్ట్ సంభందించిన చార్ట్ ల కోసం ఒక స్టూడెంట్ వస్తుంది. గౌతమ్ (Goutham) వాటిని ఇవ్వబోతు వాటిలో వసుధార బొమ్మ గీసిన చార్ట్ కూడా కలిపేస్తాడు.

ఆ మరోవైపు మహేంద్ర , జగతి (Jagathi) లు ఆఫీస్ లో జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా అక్కడకు స్టూడెంట్ వచ్చి ఆ ప్రాజెక్టు కు సంబంధించిన చార్ట్ లను టేబుల్ పై పెట్టి వెళుతుంది. ఇక మహేంద్ర ఆ చార్ట్ ను ఓపెన్ చేస్తూ ఉండగా ఈ లోపు ఫోన్ వస్తుంది. దాంతో మహేంద్ర (Mahendra) ఆ చార్ట్ ను క్లోజ్ చేసి పక్కన పెడతాడు.
ఒకవైపు రిషి (Rishi) , వసులు ఒకరికొకరు అనుకోకుండా లైబ్రరీ లోకి వెళతారు. ఇక లైబ్రేరియన్ లైబ్రరీ లో ఎవరూ లేరు అనుకోని లైబ్రరీ లో లైట్స్ ఆఫ్ చేసి లైబ్రరీ తలుపులు క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. దాంతో వీరిద్దరూ లైబ్రరిలో స్టక్ అయిపోతారు. ఆ క్రమంలో రిషి, వసు (Vasu) లు ఒకరికొకరు ఎదురు పడి బయటనుంచి లైబ్రేరియర్ లాక్ చేసుకుని వెళ్లిపోయిన సంగతి గ్రహించుకుంటారు.
ఇక దాంతో వసుధార (Vasudhara) తెగ కంగారు పడిపోతుంది. ఆ క్రమంలో వసు ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అడగగా రిషి అంతాక్షరి ఆడుకుందాం అని వెటకారంగా చెబుతాడు. దానికి వసు కూడా నవ్వుకుంటూ సరే అని అంటుంది. దానికి రిషి (Rishi) 'మనం లైబ్రరీ లో ఇరుక్కు పోయాం నేను ఏదో కోపం లో అంటే నిజంగానే అంతాక్షరి ఆడుతావా' అని కొద్దిగా చిరాకు పడుతూ అంటాడు.
ఇక తర్వాత రిషి (Rishi) లైబ్రేరియన్ కి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడు దాంతో రిషి టెన్షన్ పడి పోతూ ఉంటాడు. ఇక వసు (Vasu) మాత్రం ఒక టేబుల్ వైపు కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఉంటుంది. అది చూసిన రిషి వసు పై కొద్దిగా చిరాకు పడుతాడు.
ఇక దానితో వసు (Vasu) , ప్రశాంతంగా కూల్ గా లైబ్రేరియన్ కి ఫోన్ చేయండి అప్పుడు లిఫ్ట్ చేస్తాడు అని చెబుతోంది. ఇక లైబ్రరీయన్ కి ఫోన్ చేయడంతో నిజంగానే కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇక రిషి (Rishi) ఆ లైబ్రేరియన్ కాల్ లిఫ్ట్ చేయనందుకు విరుచుకు పడతాడు.
దాంతో లైబ్రేరియన్ కంగారు గా కాలేజ్ కి వచ్చి అక్కడ గౌతమ్ (Goutham) ను తీసుకొని లైబ్రరీ తలుపులు తెరుస్తాడు. ఇక లైబ్రరీలో వసు (Vasu) తో పాటు రిషి ని చూసిన గౌతమ్ చాలా షాక్ అవుతాడు మరి ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.