- Home
- Entertainment
- Guppedantha Manasu: ప్రేమలేఖ విషయంలో కోపంతో రగిలిపోతున్న జగతి.. టెన్షన్ లో రిషి, గౌతమ్!
Guppedantha Manasu: ప్రేమలేఖ విషయంలో కోపంతో రగిలిపోతున్న జగతి.. టెన్షన్ లో రిషి, గౌతమ్!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. అంతేకాకుండా రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

గౌతమ్ (Gautham) తనకు ఓ లవ్ లెటర్ రాయమని రిషిని కోరడంతో వెంటనే రిషి కాదనకుండా రాసిస్తాడు. దీంతో గౌతమ్ ఆ లెటర్ ను తెగ కేకలు పెడుతూ సంతోష పడతాడు. బాగా రాశాడని మురిసిపోతాడు. అక్కడి నుంచి వసుకి (Vasu) ఇవ్వాలని బయటికి వస్తూ అందులో వసు పేరును పెడతాడు.
వెంటనే రిషి (Rishi) బయటకు వచ్చి.. వసు దగ్గరికి వెళ్తున్న గౌతమ్ ని చూసి షాక్ అవుతాడు. కానీ అప్పటికే గౌతమ్ జేబులో నుంచి లవ్ లెటర్ కింద పడిపోతుంది. అది గమనించకుండా గౌతమ్ వసు దగ్గరికి వెళ్తాడు. ఇక వసు (Vasu) తో సర్ప్రైజ్ అంటూ మాట్లాడుతాడు.
దూరం నుండి రిషి (Rishi) ఇదంతా గమనిస్తూనే వుంటాడు. గౌతమ్ కాసేపు సరదాగా మాట్లాడుతూ మోకాళ్ళ పై కూర్చొని జేబులో నుంచి లవ్ లెటర్ తీయాలని అనుకుంటాడు. కానీ ఆ సమయంలో దువ్వెన తీయడంతో వసుధార (Vasudhara) ఆశ్చర్యపోతుంది.
దూరంగా ఉన్న రిషి కూడా ఆశ్చర్యపోతాడు. అంతలోనే జగతి అక్కడినుంచి రావటంతో ఆ లెటర్ ని చూసి చదువుతుంది. వెంటనే జగతి (Jagathi) దగ్గరికి వసు, గౌతమ్ వెళ్తారు. లవ్ లెటర్ జగతికి దొరకటంతో గౌతమ్ టెన్షన్ పడతాడు. అదే సమయంలో రిషి అక్కడికి రావడంతో గౌతమ్ (Gautham) భయపడతాడు.
ఇక జగతి కోపంతో రగిలిపోతూ.. వసుకు (Vasu) ఎవరో లవ్ లెటర్ రాశారు అని ఫైర్ అవుతుంది. మరోవైపు రిషి గౌతమ్ (Gautham) ను ఓ రేంజ్ లో కోపంతో చూస్తాడు. ఇక వసు తనకు లవ్ లెటర్ వచ్చింది అని తెలియటంతో ఎవరు ఆరాటపడుతుంది.
వెంటనే జగతి (Jagathi) కాస్త కోపంతో రగిలిపోతూ.. లెటర్ ని చదువుతూ ఉంటుంది. అందులో వసుధార పేరు రావడంతో రిషి (Rishi) కోపంతో చూస్తాడు. ఇక జగతి లెటర్ చదువుతూ ఉండగా అందులోని పదాలు బాగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
ఇక జగతి కోపంతో రగిలిపోతూ ఎవరు ఇలా లెటర్ రాశారు అని అరుస్తుంది. రిషి కి ఆ లెటర్ ఎవరు రాసారో కనుక్కోమని చెబుతుంది. వాడి చెంప పగల కొట్టాలి అని ఆవేశ పడటంతో గౌతమ్ (Gautham) తనను జగతి (Jagathi) కొడుతున్నట్లు ఊహించుకొని నో అంటాడు.
జగతి లెటర్ ని చింపేసి పడేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ పేపర్ ముక్కలను రిషి (Rishi) జేబులో పెట్టుకుంటాడు. రిషి గౌతమ్ ను పక్కకు తీసుకెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు జగతి (Jagathi) ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. రిషి కూడా గ్రౌండ్లో జరిగిన విషయం గురించి తలుచుకుంటూ బాధపడతాడు.