Guppedantha Manasu: దేవయానికి బుద్ధి చెప్పిన వసుధార.. జగతికి మెయిల్ చేసిన రిషి?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 17 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో ఫణీంద్ర, మహేంద్ర ఇలా చేశాను అంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను రిషి అని అంటాడు. అప్పుడు రిసి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మీరు వెళ్లిన పని ఏమైంది పెద్దనాన్న అని అడగగా అప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ గురించి అక్కడి వాళ్ళతో మాట్లాడాను వారు చాలా ఆసక్తిగా ఉన్నారు అని అంటాడు ఫణీంద్ర. అందుకు సంబంధించిన వివరాలు మనకు తొందర్లోనే తెలుస్తాయి రిషి అని అంటాడు. అప్పుడు ఫణీంద్ర రిషి నువ్వు మహేంద్ర వాళ్ళ గురించి బాధపడకు ఎందుకు వెళ్లిపోయారు అనేదానికంటే ఏం చేస్తే ఇంటికి వస్తారు అన్న విషయం గురించి నిదానంగా ఆలోచించు అని చెబుతాడు.
మరొకవైపు వసుధార రిషితో అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి భోజనం తీసుకొని వస్తాడు. అప్పుడు నాకు ఆకలిగా లేదు సార్ అని అనడంతో నువ్వు ఇలా చెప్తే వినవు అని వసుధారని ఒకచోట కూర్చోబెట్టి తినిపించడానికి ప్రయత్నించగా అప్పుడు వసు తాను తింటూ రిషికి కూడా తినిపిస్తుంది. అప్పుడు రిషి కూడా వసుధార కి తినిపిస్తాడు. వారిద్దరూ ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి చేతులు కడుక్కున్న తర్వాత వసుధర తన చున్నీని తుడుచుకోవడానికి ఇస్తుంది. ఇప్పుడు రిషి నువ్వు ఇంకెప్పుడూ ఏడవకు వసుధార ని ప్లీజ్ అని చెప్పి వసు ని పిలుచుకుని వెళ్లి పడుకోబెడతాడు.
అప్పుడు గుడ్ నైట్ చెప్పి ఎక్కడ నుంచి రిషి వెళ్ళిపోగా అప్పుడు వసుధార మనసులో గుడ్ నైట్ జెంటిల్మెన్ అని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రిషి తన రూమ్ కి వెళ్లి వసు అన్న మాటలు తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అప్పుడు జగతి ని తలచుకున్న రిషి మేడం నాకు మీ మీద చిన్నప్పటి నుంచి కోపం ఉందేమో వసుధార అంటే మీకు ఇష్టమే కదా అలాంటప్పుడు ఎందుకు విడిచి వెళ్లారు అని అనుకుంటూ ఉంటాడు రిషి. మరుసటి రోజు ఉదయం దేవయాని దంపతులు రిషి గౌతమ్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు రిషి వసుధార గెలిచిన సందర్భంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అనడంతో దేవి అని దేవ్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసు కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు దేవయాని వసుధారని మాట్లాడిస్తూ ఏం వసుధార ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా అని మాట్లాడుతూ జగతి వాళ్ళు లేరు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార దేవయానికి అందరి ముందు తగిన విధంగా బుద్ధి చెబుతుంది. అప్పుడు గౌతమ్ ఏంట్రా వసుధారకి జగతి మేడం వాళ్ళు వస్తారు అని చెప్పావా అది ఎలా సాధ్యం జగతి మేడం వాళ్ళు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా అని అనడంతో చూస్తూ ఉండు అని అనగా గౌతమ్ ఆశ్చర్యపోతాడు.
మరొకవైపు జగతి ఆనందంతో మహేంద్ర అని గట్టిగా పిలుస్తుంది. ఏం జరిగింది జగతి అనడంతో నా కొడుకు రిషి ఈ అమ్మకి ఉత్తరం రాశాడు మెయిల్ పంపించాడు అని సంతోషపడుతూ ఉంటుంది జగతి. అప్పుడు పక్కనే ఉండి రిషి మాట్లాడుతున్నట్టుగా ఆ మెయిల్ ని చదివి వినిపిస్తూ ఉంటాడు. నాకు వేసిన శిక్ష ఇప్పుడు మీరు వసుధారకి వేస్తున్నారు. డాడ్ ఆనందం కోసం ఒక మెట్టు దిగి నేను మిమ్మల్ని ఇంటికి రానిచ్చాను. మీరు వచ్చినట్టే వచ్చి డాడీని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు జరిగిన విషయాల గురించి రిషి ఎమోషనల్ రాసి ఉంటాడు. అప్పుడు జగతి సంతోషంతో చూసావా మహేంద్ర నా కొడుకు నాకు ప్రేమతో ఉత్తరం రాశాడు అని సంతోషపడుతూ ఉంటుంది.
అప్పుడు మహేంద్ర జగతి నిన్ను రిషి నిన్ను అమ్మగా రమ్మని చెప్పడం లేదు వసుధారకి ఇంటర్వ్యూ చేస్తుంటే తనకు సపోర్టుగా ఉండటం కోసం నేను రమ్మంటున్నాడు అంటూ జగతి సంతోషాన్ని పాడు చేస్తాడు మహేంద్ర. అప్పుడు జగతి నాకు వెంటనే వెళ్లి పోవాలని ఉంది మహేంద్ర అని అనడంతో వెంటనేమహేంద్ర వారి పెళ్లి విషయం ప్రకటించే వరకు మనం ఇక్కడి నుంచి వెళ్లేది లేదు జగతి అని అంటాడు. ఇప్పుడు నేను వెళ్లకపోతే రిషి చాలా ఫీల్ అవుతాడు మహేంద్ర అని అంటుంది. కానీ మహేంద్ర మాత్రం ఇప్పుడు మనం వెళ్లలేము జగతి అని అనడంతో జగతి బాధపడుతూ ఉంటుంది.