Guppedantha Manasu: వసును బాధ పెడుతున్న జగతి.. ఇదంతా రిషి కోసమేనా?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

కాలేజ్ లో రిషి, జగతి (Jagathi) తో వసును ఎలా అయినా హాస్టల్ కు పంపాలని డిమాండ్ చేస్తాడు. ఈ మాటతో జగతి షాక్ అవుతుంది. వీరిద్దరూ వసు గురించి మాట్లాడుతుండగా మహేంద్ర, వసు (Vasudhara) అక్కడకు వస్తారు.
వాళ్ళు రావడం తో టాపిక్ మార్చేసి మాట్లాడుతారు. ఇక ఆ తరువాత వసు(Vasu)ఓ చెట్టు కింద ఒంటరిగా ఉండగా రిషి అక్కడకు వచ్చి క్లాసులో పడిపోయిన గోళీలు పాకెట్లో నుంచి తీసిస్తాడు. ఇక వసు కూడా రిషి (Rishi) ఇదివరకు కార్ లో ఇచ్చినా టై ని తిరిగి ఇస్తుంది.
ఆ తరువాత గౌతమ్ (Gautham) ఓ బొమ్మ గీస్తుండగా రిషి అక్కడకు వెళ్లి కాసేపు మాట్లాడుతాడు. ఇక గౌతమ్.. రిషిని (Rishi) అడుగుతాడు ఎలాంటి అమ్మాయి బొమ్మ గీయాలని.. దాంతో రిషి మనసులో వసుని ఊహించుకుంటూ పోలికలు చెబుతాడు.
ఇక రిషి (Rishi) వసు ను ఊహించుకుంటూ మౌత్ హార్మోనిక తో మ్యూజిక్ ప్లే చేస్తాడు. మరో వైవు వసు (Vasu) రిషి ఇచ్చిన గోళీలు చూసుకుంటూ ఊహల్లోకి వెళుతుంది. తరువాత ఆ గోళీలను ఒక ఫ్లవర్ వాజ్ లో వేసి ఫోటోలు తీసుకుంటూ మురిసిపోతుంది.
మరోవైవు రిషి నిద్రపోకుండా వసు గురించి ఆలోచిస్తూ.. ఉంటాడు వసుధార (Vasudhara) తీసిన ఫోటోలు రిషికి సెండ్ చేసి. తన రిప్లై కోసం వెయిట్ చేస్తుంది. ఇక మరోవైపు జగతి కాలేజ్ లో (Jagthi) రిషి చెప్పిన విషయం గురించి తలుచుకుంటూ బాధపడుతుంది.
దాన్ని గురుంచే పదే పదే ఆలోచిస్తూ ఉండగా వసు (Vasu) అక్కడకి వచ్చి ఏమి ఆలోచిస్తున్నారు మేడం అని అడగగా వసుకి అర్ధమయ్యేలా కొన్ని మాటలు చెబుతుంది. కానీ ఆ మాటలు వసుకి ఏమీ అర్ధంకావు తరువాయి భాగంలో జగతి (Jagathi )కాలేజ్ కి వెళ్తుంది.
వసు (Vasu) ని పట్టించుకోకుండా కాలేజ్ కి కూడా తన తనతో పాటు తీసుకొనివెళ్ళదు. కానీ మనసులో జగతి వసు గురించి బాధపడుతూనే ఉంటుంది. ఇక వసు జగతి (Jagathi) ప్రవర్తన గురించి బాధపడుతుంది.
ఇక రిషి, వసు దగ్గరకి వచ్చి కాలేజ్ కి ఎలా వెళతావ్ అని అడిగితే ఆటోలో వెళతా అని సమాధానం ఇస్తుంది. అయితే రిషి (Rishi) తాను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటాడు. మొత్తానికి వసు ను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది జగతి (Jagathi).