Guppedantha Manasu: ఏంజెల్ చెప్పింది విని స్పృహ కోల్పోయిన వసుధార.. షాక్ లో జగతి, మహేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు మరో అమ్మాయిని చేసుకుంటున్నాడని తెలిసి కంగారు పడుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ఏంజెల్ వసుధారకి ఫోన్ చేసి రిషి పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్తుంది. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. అవునా అంటూ షాకింగ్ గా అడుగుతుంది. అవును మనం అడిగితే ఇష్టం లేదన్నాడు కానీ విశ్వం అడిగితే ఒప్పుకున్నాడు అని ఆనందంగా చెప్తుంది ఏంజెల్. ఆ మాటలు వింటూనే బాధతో స్పృహ కోల్పోతుంది వసుధార. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఆమెని పట్టుకొని కూర్చోబెడతాడు.
ఆమె మీద నీళ్లు చిలకరించి ఆమెకి కొంచెం స్పృహ వచ్చిన తరువాత ఏం జరిగింది అని అడుగుతాడు. మీరు పెళ్లికి ఒప్పుకున్నారంట కదా అని బాధగా అడుగుతుంది పసుధార. ఆ మాటలు మీరు నమ్మారా? నేను పూర్తిగా నా అభిప్రాయాన్ని చెప్పేలోపు వాళ్లు నేను పెళ్ళికి ఒప్పుకున్నాను అనుకొని ఆనంద పడిపోతున్నారు. ఇప్పుడు నిజం చెబుదామంటే ఆయన ఆరోగ్యం ఏమైపోతుందో అని భయంగా ఉంది. ఇదంతా నీ వల్లే అంటూ వసుధార మీద కేకలు వేస్తాడు రిషి.
మీ సమస్యకు ఈ మధ్యలో నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు అంటుంది వసుధార. నీకు అన్నీ తెలిసి కూడా ఏంజెల్ ని ఎంకరేజ్ చేస్తున్నావు. తనకి నేను తగనని చెప్పొచ్చు కదా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. అప్పుడే ఏంజెల్ మళ్లీ వసుధారకి ఫోన్ చేస్తుంది కానీ తను లిఫ్ట్ చేయదు. ఏం జరిగిందో అని తన దగ్గరికి బయలుదేరబోతుంది ఏంజెల్. ఏమి జరగదు.. ఆనందంతో తనే మన ఇంటికి వస్తూ ఉంటుంది అని విశ్వనాథం చెప్పటంతో ఆగిపోతుంది.
మరోవైపు అకౌంట్స్ క్లియర్ అవ్వకపోవడంతో ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు జగతి దంపతులు. ఇంతలో విశ్వనాథం ఫోన్ చేసి మా ఏంజెల్ కి రిషితో పెళ్లి ఫిక్స్ అయింది. నిశ్చితార్థానికి ముహూర్తం పెడుతున్నాము. ఈ సమయంలో అతని తల్లిదండ్రులు ఉంటే బాగుండు కానీ అతను తన తల్లిదండ్రుల గురించి చెప్పడం లేదు. మీరు అతని ఆత్మీయులు కదా అందుకే ఆ రోజు మీరు రండి.
కానీ అతనికి చెప్పకుండా సర్ప్రైజింగ్ గా రండి అని చెప్తాడు విశ్వనాథం. విశ్వనాథం చెప్పింది విని షాక్ అవుతారు జగతీ దంపతులు. రిషితో ఒకసారి మాట్లాడతాము అక్కడ ఉన్నాడా అని అడుగుతాడు. లేదు పనుందని బయటకు వెళ్ళాడు అని చెప్తాడు విశ్వనాథం. సరే నేను వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర.ఈ విషయం వసుధారకు తెలుసో లేదో అని కంగారుగా ఆమెకి ఫోన్ చేస్తాడు మహేంద్ర. కానీ తను లిఫ్ట్ చేయదు. అక్కడ ఏదో జరుగుతుంది, రిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు మనం వెళ్దాము అంటుంది జగతి.
అప్పుడే అటుగా వెళుతున్న శైలేంద్ర ఆ మాటలు వింటూ ఉంటాడు. వెళ్దాం కానీ ఈ విషయం అన్నయ్యకు చెప్దాము అంటాడు మహేంద్ర. ఇప్పుడు వద్దు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వచ్చాక అప్పుడు మొత్తం జరిగిందంతా చెబుదాము అని భర్తని కన్విన్స్ చేస్తుంది జగతి. మీరు రిషి దగ్గరికి వెళుతున్నారని అర్థమైంది. మీరు మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి వెళ్తున్నారు. మీరు వచ్చేటప్పటికి నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను అని కసిగా అనుకుంటాడు శైలేంద్ర. మరోవైపు జరిగిందానికి ఏడుస్తూ కూర్చుంటుంది వసుధార.
వసుధార ఇంటి బయట వసుధారనే చూస్తూ ఉంటాడు రిషి. తలుపులు వేయటానికి వచ్చిన చక్రపాణి రిషి, వసుధారల పరిస్థితికి బాధపడతాడు. నేను పిలిస్తే ఎలాగూ రారు అని మనసులో అనుకొని కూతురు దగ్గరికి వెళ్లి అల్లుడుగారు బయట ఉన్నారు వెళ్లి తీసుకురా అని చెప్తాడు. చక్రపాణి మాటలకి ఆశ్చర్యపోతూ బయటికి వస్తుంది వసుధార. రిషి ని పిలిచే లోపు అతను కారు ఎక్కి వెళ్ళిపోతాడు. మన మనసులో దగ్గరగానే ఉన్నాయి కానీ మీ మనసుకి తలుపులు వేసేసి కూర్చున్నారు.
నన్ను లోపలకి రానివ్వడం లేదు. ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటూ వసుధార కూడా బైక్ మీద రిషి ఎప్పుడు కూర్చునే ప్లేస్ కి వెళుతుంది. అక్కడ రిషి బాధపడుతూ నాకేంటి టార్చర్, జీవితం అంతా ఇలా బాధపడుతూ గడపడమేనా అంటూ బాధపడుతూ ఉంటాడు. అతనికి ధైర్యం చెబుతూ ఓదారుస్తూ ఉంటుంది వసుధార. ఇంతలో విశ్వనాథం ఫోన్ చేస్తాడు. మీకేం మీరు బయట నుంచి మాటలు బాగానే చెప్తారు. కానీ నాకేంటి ఈ టార్చర్ అని ఆ ఫోన్ ని చూపిస్తాడు రిషి.
లిఫ్ట్ చేయండి సార్ లేదంటే ఏం జరిగిపోయిందో అని కంగారు పడిపోతారు అంటుంది వసుధార. ఫోన్ లిఫ్ట్ చేసిన రిషి ని ఎక్కడ ఉన్నావు, త్వరగా ఇంటికి వచ్చేయ్, ఏంజెల్ నీకోసం స్వీట్ చేసింది అంటాడు విశ్వనాథం. నేను రాను అని కోపంగా అంటాడు రిషి. ఆ మాటలకి షాక్ అవుతాడు విశ్వనాథం. మళ్ళీ రిషియే తమాఇంచుకొని లేదు సర్ నాకు ఇంకా పని అవ్వలేదు, పని అయ్యాక వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ ప్రెజర్ ని తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.