Guppedantha Manasu: రిషి ముందు రివర్స్ డ్రామా ప్లే చేస్తున్న శైలేంద్ర.. కోపంతో రగిలిపోతున్న జగతి దంపతులు!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అధికారం కోసం తమ్ముడు జీవితంతో ఆడుకుంటున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో డబ్బులు ఇచ్చినందుకు మురుగన్ కి థాంక్స్ చెప్పి కారు ఎక్కుతాడు రిషి. అప్పటికే అందులో ఉన్న వసుని చూసి షాక్ అవుతాడు. మీరు ఏంటి ఇక్కడ అని అడుగుతాడు. నేను కూడా మీతో పాటు వస్తాను అంటుంది వసుధార. క్యాబ్లో వెళ్ళమంటాడు రిషి. మనం వెళ్లే దారి ఒకటే కదా మళ్లీ క్యాబ్ ఎందుకు, అయినా నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు అంటుంది వసుధార. వెళ్లే దారి ఒకటే గాని గమ్యం వేరు అంటాడు రిషి. ఇప్పుడేంటి దిగిపోమంటారా అని కోపంగా అడుగుతుంది వసుధార.
ఏమి మాట్లాడకుండా కారు ముందుకి పోనిస్తాడు రిషి. వాళ్ళిద్దర్నీ చూస్తన్న జగతి దంపతులు ఆనందపడతారు. ఎప్పటికైనా వాళ్ళిద్దరూ కలుస్తారు, వాళ్ళ బంధం గట్టిది, వాళ్ళిద్దరూ రిషిధారలు అని సంతోషపడతాడు మహేంద్ర. మరోవైపు కారులో వెళ్తున్న వసుధార సమస్యలు తీరిపోయినందుకు సంతోషపడుతుంది. సమస్యలు తీరిపోయాయని సంతోష పడకండి మేడం, మీరు చేసిన గాయం నన్ను ఇప్పటికీ బాధ పెడుతుంది మనం జీవితంలో కలవబోయేది లేదు అంటాడు రిషి.
అందుకు నవ్వుతుంది వసుధార. ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు రిషి. కలవపోయేది లేదు అంటూనే మనం పక్కపక్కనే కూర్చొని కలిసి ప్రయాణం చేస్తున్నాము నాకు ఈ ఆనందం చాలు సార్. అయినా నాకు నీ మీద గట్టి నమ్మకం ఉంది. అందుకే ఏంజెల్ మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా నేను ఏమీ రియాక్ట్ అవ్వలేదు అంటుంది వసుధార. సడన్ గా కారు బ్రేక్ వేస్తాడు రిషి. ఏం జరిగిందో అని ముందుకి చూసేసరికి ఎదురుగా శైలేంద్ర ఉంటాడు. షాక్ అవుతారు రిషి, వసుధార. కిందకి దిగి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు రిషి.
నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లడానికి మనసు ఒప్పుకోలేదు. అయినా మేమందరం ఉండగా నువ్వు ఒంటరిగా ఉండడం ఏంటి నాతో వచ్చేయ్ అంటాడు శైలేంద్ర. నాకు ఇష్టం లేదు అన్నయ్య నేను రాలేను అంటాడు రిషి. నేను చెప్పిన వినవా అని రిషి చేయి పట్టుకొని శైలేంద్ర తన కార్ వైపు తీసుకుపోతుంటే అక్కడికి మహేంద్ర దంపతులు వస్తారు. వాళ్లని చూసి కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర. మీరు ఎందుకు వచ్చారు రిషి ని నాతో పాటు తీసుకురావటం మీకు ఇష్టం లేదా, తను లేకుండా మీరు ఉండగలరేమో కానీ మేము ఉండలేము అంటాడు శైలేంద్ర.
నేను ఎక్కడికి రాను, నాకు రావడం ఇష్టం లేదు అంటాడు రిషి. అప్పుడు పక్కనే ఉన్న వసుధారతో నీవల్లే రిషి ఇల్లు, కాలేజ్ వదిలి వెళ్ళిపోయాడు. ఎప్పటికైనా రిషిని నువ్వే మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి. రిషి ఒంటరిగా ఉన్నా తోడుగా నువ్వున్నావని ధైర్యం ఉన్నాము అంటూ రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు శైలేంద్ర. నిజమేలే అసలు దొంగలు ఎవరో త్వరలోనే తెలుస్తుంది అప్పుడు రిషి కూడా ఇంటికి వస్తాడు అంటాడు మహేంద్ర. వాళ్ల మధ్య ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు రిషి.
రిషి వెనకే వసుధార కూడా వెళ్ళిపోతుంది. ఆ తరువాత శైలేంద్రని కోప్పడతాడు మహేంద్ర. తండ్రి కొడుకుల్ని విడదీసిన పాపం మూట కట్టుకుంటున్నావు. ఎప్పుడో ఒకరోజు నువ్వు తీసుకుని గోతిలో నువ్వే పడతావు, మా అన్నయ్యకి నిజం తెలిసిన రోజు నేను కుక్కని కొట్టినట్టు కొడతాడు అంటాడు మహేంద్ర. మీకు మా నాన్న అంటే చాలా గౌరవం, అతను బాధపడే పని ఏది మీరు చేయరు. అప్పటివరకు నాకు ఎలాంటి హాని జరగదు అంటూ వెటకారంగా నవ్వుతాడు శైలేంద్ర.
నిన్ను చూస్తే ఒక మృగాన్ని చూసినట్లుగా ఉంది అని ఈసడించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు మహేంద్ర దంపతులు. మరోవైపు కారులో వెళ్తున్న రిషి ని ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతుంది వసుధార. ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్తాను, ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను అంటాడు రిషి. ఇంతలో వసుధార వాళ్ళ ఇల్లు రావడంతో కారు ఆపుతాడు రిషి. అతడిని ఇంట్లోకి రమ్మని..
కాఫీ తాగమని ఆహ్వానిస్తుంది వసుధార. కానీ ఇంట్లోకి రావటానికి ఒప్పుకోకుండా వెళ్ళిపోతాడు రిషి. ఇదంతా చూసిన చక్రపాణి ఏం జరిగింది అల్లుడుగారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏంజెల్ ఇంటికి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్తారో ఏంటో అని బాధపడుతుంది వసుధార. ఆ మాటలు విని చక్రపాణి బాధపడతాడు. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.