MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుకీ తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన రిషి.. బాధలో జగతి మహేంద్ర?

Guppedantha Manasu: వసుకీ తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన రిషి.. బాధలో జగతి మహేంద్ర?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 11వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Jan 12 2023, 08:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లు రాజీవ్, వసుధారతో మాట్లాడుతూ నీ మెడలో నువ్వే తాళి కట్టుకొని ఎవరో తాళి కట్టారని నన్ని నమ్మిస్తున్నావు. ఎంత గొప్ప ఆలోచన నీది ఎంత తెలివి నీది. ఇంత తెలివైనది నాకు భార్యగా వస్తుంది అంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అని అంటాడు రాజీవ్. అందుకే నాకు నువ్వే కావాలి ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చావు నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పద హాస్పిటల్ కి వెళ్దాము అని అంటాడు రాజీవ్. ఇప్పుడు వసుధార నేను హాస్పిటల్ కీ వెళ్తాను నువ్వు హాస్పిటల్ కి రావాల్సిన అవసరం లేదు అనగా పైనుంచి నీ రక్షణ సంరక్షణ అన్ని నావే కదా దగ్గరుండి తీసుకెళ్తాను అని అంటాడు రాజీవ్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు వసు నువ్వు అవసరం లేదు ఇక్కడే ఉండు అని రాజీవ్ నీ అక్కడే పెట్టి వసుధా  ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. మరొకవైపు కాలేజీకి వెళ్లిన రిషి, వసుధారతో కలిసి గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ అక్కడికి వెళ్తాడు. ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది. జ్ఞాపకాలు అందంగానే ఉంటాయి. కానీ అన్ని జ్ఞాపకాలు అందమైనవి కావు రిషి అని అంటుంది. ఎందుకు మనసుకు గుచ్చుకునే జ్ఞాపకాలను తలుచుకుంటావు అని అంటుంది జగతి. ఈ జ్ఞాపకాల నుంచి నువ్వు బయటపడాలి అనగా మేడం నా తప్పేముంది చెప్పండి. ఎందుకు ఇలా చేసింది అని బాధగా మాట్లాడుతాడు రిషి.
 

37

ప్రాణంగా ప్రేమించడమే తప్ప మీ శిష్యురాలు నా మనసుని ఏం అర్థం చేసుకుంది మేడం అని అంటుంది. నా పసి మనసుని అర్థం చేసుకోకుండా మీరు వెళ్లిపోయారు. మీరు ఎందుకు వెళ్లిపోయారు నాకు తెలియదు, మీరు కూడా నాకు చెప్పలేదు. ఆపరేషన్ కి సమాధానం చెప్పలేని వారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారని అనుకోవడం లేదు అనడంతో జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆగు రిషి అనడంతో మీరేం చెప్పకండి మేడం మీ శిష్యురాలు కనిపిస్తే ఈ రిషేంద్ర భూషణ్ కి మోసపోవడం కొత్తేమీ కాదు. జ్ఞాపకాలతో బతకగలడు తను నాకు అక్కర్లేదు అన్న విషయం చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
 

47

మరొకవైపు వసుధార హాస్పిటల్ కి వెళుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది వసుధార. డాక్టర్ ఎం భయం లేదు బాగానే ఉంది అనడంతో చాలా థాంక్స్ డాక్టర్ అని అంటుంది. అప్పుడు వసు, చక్రపాణి, సుమిత్రని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. చక్రపాణి చేతులు పట్టుకుని ఎప్పుడు నీ కూతురు తలవంచే పని చేయదు నాన్న అని ఎమోషనల్ అవుతూ ఇంతలో సుమిత్రకు మెలుకువ వస్తుంది. అప్పుడు సుమిత్రని చూసి వసుధార సంతోష పడుతూ నిద్ర కూడా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న ఎక్కడ ఉన్నాడు అనడంతో అదిగో పక్కనే ఉన్నాడు నాన్నకు బాగానే ఉంది అని అంటుంది వసుధార.
 

57

మరొకవైపు కాలేజీలో జగతి రిషి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. జగతి ఏంటి జగతి ఇది అనగా రిషిని చూడాలంటేనే నా గుండె తరుక్కుపోతోంది మహేంద్ర అని అంటుంది. మనసు ముక్కలు చేసుకుని బాధను అనుభవిస్తూ మౌనంగా ఉన్నాడు మనం ఏమి చేయలేమా రిషి బాధను తీర్చలేమా అని అంటుంది. మనం ఏం చేయలేము జగతి అనడంతో అయినా వసుధర ఆరోజు మాట్లాడింది. నాకు ఇప్పటికీ మర్చిపోలేను చాలా హ్యాపీగా ఉంది జగతి అని అంటాడు మహేంద్ర. అప్పుడు వాళ్ళిద్దరూ రిషి ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు.

67

 మరొకవైపు వసుధార సుమిత్రతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రాజీవ్ వస్తాడు. అత్తయ్య మామయ్య బాగానే ఉన్నారు నువ్వు మీ ఇంటికి వెళ్లి వాళ్ళని బాగానే చూసుకుంటావు మరి నా సంగతేంటి మీ కుటుంబం లిస్టులో నుంచి నన్ను కొట్టేసావా అని అంటాడు రాజీవ్. చూడు వసు ఇప్పుడు నువ్వు నేను ఈ ప్రపంచం దృష్టిలో భార్యా భర్తలము అనడంతో బావ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని అంటుంది వసుధార. అప్పుడు రాజీవ్ వసుధార గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రిషి గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా వసుధార సీరియస్ అవుతుంది.
 

77

ఇంతలోనే సుమిత్రకు మెలకువ వచ్చి నాన్న ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనగా పక్కనే ఉన్నాడు అనడంతో సుమిత్ర ఏవండీ అని పిలవగా ఇంతలో చక్రపాణికీ కూడా మెలకువ వస్తుంది. అప్పుడు రాజీవ్ అత్తయ్య గారికి మావయ్య గారికి ప్రణామం. మీరిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు అని అంటాడు. అప్పుడు కానిస్టేబుల్ ఎస్సై కి ఫోన్ చేసి వాళ్ళకి మెలకువ వచ్చింది అని చెప్పడంతో సరే వస్తున్నాను అని అంటాడు. మరొకవైపు రిషి క్యాబిన్ లోకి వెళ్లి ఉద్యోగ పదేపదే వసుధార అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు రిషి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved