- Home
- Entertainment
- నాగ చైతన్య లైఫ్ లో కష్టాలన్నీ తొలగిపోయాయి, ఇక ఎంజాయ్ చేయడమే.. స్టార్ హీరో వ్యాఖ్యలు దేని గురించో తెలుసా
నాగ చైతన్య లైఫ్ లో కష్టాలన్నీ తొలగిపోయాయి, ఇక ఎంజాయ్ చేయడమే.. స్టార్ హీరో వ్యాఖ్యలు దేని గురించో తెలుసా
అక్కినేని నాగ చైతన్య తన లైఫ్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు. కష్టాలన్నీ తొలగిపోయాయి. ఇక మిగిలింది ఎంజాయ్ చేయడమే అని ఓ స్టార్ హీరో కామెంట్స్ చేశారు. ఆయన ఎందుకు ఇలా అన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం

తండేల్ తో విజయం
అక్కినేని నాగ చైతన్య చివరగా తండేల్ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. పాకిస్తాన్ లో చిక్కుకుపోయిన మత్య్సకారుల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో NC 24 (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ మైథాలజీ అంశాలు ఉన్న అడ్వెంచర్ కథాంశంతో రూపొందుతోంది. నాగ చైతన్య ఇటీవల జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి అతిథిగా హాజరయ్యారు.
రెండు ఫ్యామిలీలకు బ్రిడ్జిలాంటి వాడు
అక్కినేని ఫ్యామిలీతో జగపతిబాబుకి మంచి బాండింగ్ ఉంది. జగపతి బాబు, నాగార్జున మంచి స్నేహితులు కూడా. దీనితో నాగ చైతన్యకి జగపతి బాబుతో కూడా చనువు ఉంది. ఈ షోలో వీరిద్దరి సంభాషణ సరదాగా సాగింది. జగపతి బాబు.. నాగ చైతన్య కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తావించారు. అటు అక్కినేని ఫ్యామిలీకి, దగ్గుబాటి ఫ్యామిలీకి చైతు బ్రిడ్జి లాంటి వాడు అని జగపతి బాబు అభివర్ణించారు.
నాగ చైతన్యకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ
నాగ చైతన్య అంతగా హంగామా చేయడు. కానీ లేడీస్ అతడంటే పడి చస్తారు అని జగపతి బాబు అన్నారు. ప్రస్తుతం నాగార్జున కంటే నీకే ఎక్కువ లేడీస్ ఫాలోయింగ్ ఉందని కూడా జగపతి బాబు తెలిపారు. నాగ చైతన్య సిగ్గు పడుతూ బదులిచ్చారు. నేను, నాన్న, అఖిల్ ముగ్గురం బయటకి వెళితే అట్రాక్షన్ మొత్తం నాన్న వైపే ఉంటుంది అని చైతు అన్నారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలకు తాను వారధిగా ఉండడం గురించి మాట్లాడుతూ ఒక విధంగా అది తనకి వరం అని చైతు తెలిపారు. ప్రారంభంలో తనకి అది ఒత్తిడిలా అనిపించింది అని అన్నారు.
డ్రైవింగ్ లో బాధ్యతతో ఉంటా
రెండు ఫ్యామిలీల్లో లెజెండ్స్ ఉన్నారు. ఎవరి క్రాఫ్ట్స్ లో వాళ్ళు మాస్టర్స్. అలాంటప్పుడు నాకు ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు అది పాజిటివ్ ఛాలెంజ్ లాగా మారింది అని చైతు తెలిపారు. ఈ షోలో నాగ చైతన్య కార్ రేసింగ్ పై తనకున్న ఆసక్తిని బయటపెట్టారు. తనకి కార్ రేసింగ్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. చాలా బాధ్యతతో కార్ డ్రైవ్ చేస్తానని చైతు తెలిపారు. రేసింగ్ ఎంజాయ్ చేయాలంటే మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి రేస్ ట్రాక్ ని రెంట్ కి తీసుకుని సరదాగా రేసింగ్ చేసి వస్తాం. పబ్లిక్ రోడ్లలో మాత్రం చాలా బాధ్యతగా ఉంటానని నాగ చైతన్య అన్నారు. జగపతి బాబు నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చైతు జీవితంలో కష్టాలన్నీ పోయాయి
జగపతి బాబు మాట్లాడుతూ.. 'చైతు నువ్వు స్టార్ అనే విషయాన్ని పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో చాలా కష్టాలు ఎదుర్కొన్నావు. చాలా అప్ అండ్ డౌన్స్ చూశావు. ఆ ఇబ్బందులే నిన్ను మరింత దృఢంగా మార్చాయి. జీవితంలో ఎప్పుడైనా ముందు కష్టాలు వస్తే ఆ తర్వాత తప్పకుండా సంతోషాలు ఉంటాయి. నీ జీవితంలో కష్టాలన్నీ పోయాయి. ఇక మిగిలింది సంతోషమే, జీవితాన్ని ఎంజాయ్ చేయడమే' అని జగపతి బాబు అన్నారు. జగపతి బాబు.. నాగ చైతన్య ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ గురించి ఇలా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. సమంతతో విడిపోయిన తర్వాత చైతు.. శోభిత ధూళిపాలని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.