MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..కిక్కిచ్చే వినోదం రెడీ

ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..కిక్కిచ్చే వినోదం రెడీ

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రంతో పాటు తేజ సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ మిరాయ్ కూడా ఈ వారమే ఓటీటీలో సందడి చేయనుంది. పలు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 06 2025, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
This Week OTT Releases
Image Credit : Asianet News

This Week OTT Releases

ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వారం విడుదల కానున్న ప్రాజెక్టులు విభిన్న జానర్లలో ఉండడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ నుంచి మైథాలజికల్ డ్రామా వరకు ప్రేక్షకులకు పలు ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. వాటి జాబితా, రిలీజ్ డేట్ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
Image Credit : instagram

వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

వార్ 2 (War 2)

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ “వార్ 2” ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. YRF స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రం మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్లు బాగా తగ్గాయి. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం థియేటర్స్ లో రాణించలేదు.  దీనితో చాలా మంది అభిమానులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ అక్టోబర్ 9న ఓటీటీలో రిలీజ్ కానుంది.  

విడుదల తేదీ: అక్టోబర్ 9 

ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్

35
తేజ సజ్జ సూపర్ హీరో మూవీ మిరాయ్
Image Credit : instagram

తేజ సజ్జ సూపర్ హీరో మూవీ మిరాయ్

మిరాయ్ (Mirai)

తెలుగు నటుడు తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో చిత్రం “మిరాయ్” బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం పురాణ నేపథ్యంతో, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, విశేషమైన VFXతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మిరై OTT ప్రీమియర్‌కు సిద్ధమైంది. 

విడుదల తేదీ: అక్టోబర్ 10 

ఎక్కడ చూడవచ్చు: జియో హాట్‌స్టార్

కారమెలో అనే  మరో చిత్రం కూడా ఓటీటీలో ఈవారం సందడి చేయబోతోంది.


కారమెలో (Caramelo)

స్పానిష్ నేపథ్యంలోని ఈ డ్రామా చిత్రంలో కుటుంబం, ప్రేమ, స్వీయ గుర్తింపు వంటి అంశాలు ఉంటాయి. ఒక శునకంతో హీరో ప్రయాణం ఎలా ఉంటుంది అనే కథాంశం ఈ చిత్రంలో చూపించారు.  

విడుదల తేదీ: అక్టోబర్ 8 

ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్

45
ఈ వారం విడుదల కానున్న వెబ్ సిరీస్‌లు (Web Series Releasing This Week):
Image Credit : Asianet News

ఈ వారం విడుదల కానున్న వెబ్ సిరీస్‌లు (Web Series Releasing This Week):

వెడువాన్ (Veduvan)

“కూలీ” ఫేమ్ కన్నా రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రేమ, మోసం, వంటి భావోద్వేగ అంశాలను కలగలిపిన కథతో వస్తోంది. 

విడుదల తేదీ: అక్టోబర్ 10 

ఎక్కడ చూడవచ్చు: జీ5

కురుక్షేత్ర (Kurukshetra)

2025 నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ అనిమేటెడ్ సిరీస్‌గా రూపొందిన “కురుక్షేత్ర”, మహాభారతాన్ని 18 మంది యోధుల దృష్టికోణంలో చెప్పే వినూత్న ప్రయత్నం. యుద్ధంలో నైతిక సందిగ్ధతలను ఇది ఆవిష్కరిస్తుంది. 

విడుదల తేదీ: అక్టోబర్ 10 

ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్

సెర్చ్ ది నైనా మర్డర్ కేస్ (Search: The Naina Murder Case)

రహస్య హత్యా కేసును ఆధారంగా తీసుకున్న ఈ సిరీస్ థ్రిల్లర్ ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

విడుదల తేదీ: అక్టోబర్ 10 

ఎక్కడ చూడవచ్చు: జియో హాట్‌స్టార్

డా.సెస్సూస్ హార్టన్ (Dr Seuss’s Horton!)

పిల్లల కోసం రూపొందిన ఈ యానిమేటెడ్ సిరీస్ హృదయాన్ని హత్తుకునే సందేశంతో వస్తుంది. సో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సిరీస్ ని చూపించవచ్చు.  

విడుదల తేదీ: అక్టోబర్ 6 

ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్

ట్రూ హాంటింగ్( True Haunting)

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ హారర్ చిత్రం భయాన్ని రేకెత్తిస్తుంది. 

విడుదల తేదీ: అక్టోబర్ 7 

ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్

ఈజ్ ఇట్ కేక్ ? హాలోవీన్ (Is It Cake? Halloween)

హాలోవీన్ థీమ్‌తో రూపొందిన ఈ షోలో క్రియేటివ్ బేకింగ్ టాస్క్‌లు ప్రధాన ఆకర్షణ. 

విడుదల తేదీ: అక్టోబర్ 8 

ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్

ది రిసరెక్టెడ్ (The Resurrected)

ఈ సైకాలజికల్ థ్రిల్లర్‌లో రహస్యాలు, మోసం, పునర్జన్మ వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. 

విడుదల తేదీ: అక్టోబర్ 8 

ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్

55
ఆ రెండు చిత్రాలతో ఫ్యాన్స్ కి పండగే
Image Credit : Asianet News

ఆ రెండు చిత్రాలతో ఫ్యాన్స్ కి పండగే

మొత్తంగా ఈ వారం పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లతో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులకు మంచి వినోదం అందించబోతున్నాయి. అయితే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు సినిమా లవర్స్ రెండు చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రెండు చిత్రాలలో ఒకటి వార్ 2 కాగా మరొకటి మిరాయ్. ఈ వారమే ఆ రెండు చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు కానున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
రిలీజ్ కి ముందే పుష్ప 2 హెచ్‌డీ ప్రింట్ పైరసీ, ఇంటర్ కుర్రాడు 500 కోట్ల మూవీని ఎలా హ్యాక్ చేశాడో తెలుసా
Recommended image2
స్టార్ హీరోని ముద్దుగా జాగ్స్ అని పిలిచే నటి, సౌందర్య తర్వాత ఆమెతో ఎఫైర్ ? వాళ్లిద్దరూ ఎవరో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved