- Home
- Entertainment
- అదే జరిగింది, హరిత హరీష్ అవుట్.. ఆమెలో నన్ను నేను చూసుకున్నా, హౌస్ లో నటించేది అతడే
అదే జరిగింది, హరిత హరీష్ అవుట్.. ఆమెలో నన్ను నేను చూసుకున్నా, హౌస్ లో నటించేది అతడే
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో నాల్గవ వారం హరితా హరీష్ ఎలిమినేట్ అయ్యారు. మాస్క్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన హరీష్.. వెళుతూ వెళుతూ హౌస్ లో నిజంగా ముసుగు పెట్టుకున్న వారి బండారం బయట పెట్టారు.

Bigg Boss Telugu 9
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో సండే ఎపిసోడ్ సందడిగా సాగింది. ఏసియా నెట్ ముందే చెప్పినట్లుగా హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయ్యాక హరిత హరీష్ ఏం మాట్లాడారో వివరాల్లో తెలుసుకుందాం. సండే కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడించారు. కొందరి సభ్యులని జంటలుగా పిలిచి గేమ్స్ ఆడించారు. వినోదం తక్కువగా అందిస్తున్న వారితో వినోదభరిత గేమ్స్ ఆడించారు. టాస్క్ లలో స్మార్ట్ గా ఆలోచించని వారితో మెదడుకు మేత పెట్టే గేమ్స్ ఆడించారు.
నామినేషన్స్ లో ఉన్నది వీరే
ఈవారం నామినేషన్స్ లో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజన, శ్రీజ, దివ్య, హరిత హరీష్ ఉన్నారు. వారందరికీ నాగార్జున స్లేట్ లు ఇచ్చి సేఫ్ అని రాయించారు. డస్టర్ తో చెరిపివేయమని చెప్పారు. సేఫ్ అనేది చెరిగిపోకుండా ఉంటే వాళ్ళు సేఫ్. ఆ విధంగా ఫ్లోరా షైనీ, సంజన సేఫ్ అయ్యారు. ఒక్కొక్క రౌండ్ లో కొందరు సేఫ్ అవుతూ వచ్చారు. చివరికి శ్రీజ, హరిత హరీష్, దివ్య మిగిలారు. ఇంతలో నాగార్జున మరికొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించారు.
కళ్ళు చూసి కనిపెట్టాలి
కొందరు నటీనటుల కళ్ళు మాత్రమే చూపించారు. కళ్ళు చూసి వాళ్లెవరో గుర్తు పట్టాలి. తప్పు చెబితే షర్ట్ లోపల ఐస్ వేయించుకోవాలి. ఆ విధంగా భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, సుమన్ శెట్టి పాల్గొన్నారు. ఈ గేమ్ లో ఇమ్మాన్యుయేల్ బాగా నవ్వించాడు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ మళ్ళీ ప్రారంభం అయింది. హరిత హరీష్, శ్రీజ, దివ్య లకు పోప్ డబ్బాలు ఇచ్చారు. అందరూ ఆ బాక్స్ లు ఓపెన్ చేయగా శ్రీజకి సేఫ్ అని వచ్చింది. దీనితో ఆమె సేవ్ అయింది.
హరిత హరీష్ అవుట్
ఇక మిగిలింది దివ్య, హరిత హరీష్ మాత్రమే. నాగార్జున వారిద్దరినీ యాక్టివిటీ ఏరియాకి పిలిచారు. వారి వెనుక కొన్ని బాక్స్ లు ఉన్నాయి. వాటి లోపల సేఫ్, ఎలిమినేట్ అని రాసి ఉంటుంది. ఆ బాక్స్ లని బ్రేక్ చేయగా దివ్యకి సేఫ్ అని వచ్చింది. దీనితో హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు.
ముసుగు పెట్టుకుని నటిస్తున్నది వీళ్ళే
నాగార్జున హరిత హరీష్ ని వేదికపైకి పిలిచారు. అతడి బిగ్ బాస్ జర్నీ చూపించారు. నాగార్జున హరీష్ కి ఒక టాస్క్ ఇచ్చారు. వేదికపై బ్లాక్ మాస్క్, వైట్ మాస్క్ ఉంటాయి. హౌస్ లో ముసుగు పెట్టుకుని నటిస్తున్న ముగ్గురి ఫోటోలు బ్లాక్ మాస్క్ దగ్గర పెట్టాలి. జెన్యూన్ గా ఉన్న ముగ్గురి ఫోటోలు వైట్ మాస్క్ దగ్గర పెట్టాలి అని నాగార్జున తెలిపారు. దీనితో హరీష్.. భరణి, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్ ఫోటోలని బ్లాక్ మాస్క్ దగ్గర పెట్టారు. భరణి హౌస్ లో రేలంగి మావయ్య లాగా నటిస్తున్నారు అని ఆయన నిజస్వరూపం తనకి మాత్రమే తెలుసు అని హరీష్ తెలిపారు. ఇమ్మాన్యుయేల్ అందరితూ మంచిగా ఉంటున్నట్లు నటిస్తున్నారు. కానీ అది ఆయన అసలు రూపం కాదు. ఇక డిమాన్ పవన్ విషయానికి వస్తే అతడికి మంచి పొటెన్షియల్ ఉంది.. కానీ దానిని దాచిపెట్టి హౌస్ లో ఉంటున్నాడు అని అన్నారు. ఇక హౌస్ లో శ్రీజ, కళ్యాణ్, తనూజ జెన్యూన్ గా ఉంటున్నారని హరీష్ ప్రశంసించారు. తనూజలో తనని తాను చూసుకుంటున్నానని హరీష్ అన్నారు. మా ఇద్దరికీ వెంటనే కోపం వస్తుంది, కానీ ఆ కోపానికి కారణం ఉంటుంది అని హరీష్ తెలిపారు.