- Home
- Entertainment
- డెత్ బెడ్ పై ఉన్న స్థితిలో బ్లేడ్ తలగడ కింద పెట్టుకుని.. జబర్దస్త్ వినోద్ జీవితంలో దారుణమైన రోజులు
డెత్ బెడ్ పై ఉన్న స్థితిలో బ్లేడ్ తలగడ కింద పెట్టుకుని.. జబర్దస్త్ వినోద్ జీవితంలో దారుణమైన రోజులు
లేడీ గెటప్‌లో జబర్దస్త్ కమెడియన్‌గా నవ్వులు పూయించాడు జబర్దస్త్ వినోద్. ఇప్పుడు షోకి దూరమైన వినోద్ తన జీవితంలోని దారుణమైన రోజులను గుర్తు చేసుకున్నారు.

లేడీ గెటప్‌లో నవ్వులు పూయించిన జబర్దస్త్ వినోద్
జబర్దస్త్ వినోద్ లేడీ గెటప్‌లో తన కామెడీతో కొన్నేళ్లపాటు ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉన్నారు. నవ్వులు పూయిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు చమ్మక్ చంద్రకు జోడీగా నటించి మెప్పించాడు. అప్పట్లో వీరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉండేది. అదే సమయంలో ఆద్యంతం నవ్వులు పూయించారు. చమ్మక్ చంద్ర, వినోద్ పోటీపడి అరిచేవారు. ఒకరిపై ఒకరు పంచులు వేసుకోగా, జబర్దస్త్ షోలో నవ్వులకు కొదవలేదు అనేలా సాగింది. జబర్దస్త్ షో సక్సెస్‌లో వీరి జంట పాత్ర ఎంతో ఉంది.
జబర్దస్త్ వినోద్ జీవితంలోని మరో కోణం
ఇప్పుడు జబర్దస్త్ కి దూరమయ్యాడు వినోద్. చాలా కాలంగా ఆయన షోస్ చేయడం లేదు. చమ్మక్ చంద్ర కూడా జబర్దస్త్ ని వదిలేశాడు. సినిమాల్లో బిజీ అయ్యారు. దీంతో వినోద్ కూడా జబర్దస్త్ ని వదిలేశాడు. కాకపోతే అడపాదపా కనిపిస్తుంటాడు. తాజాగా వినోద్ `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో సందడి చేశారు. తాజా ఎపిసోడ్‌లో ఆయన తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వినోద్ తన జీవితంలోని దారుణమైన రోజులను గుర్తు చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న జబర్దస్త్ వినోద్
తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు తెలిపారు. డెత్ బెడ్‌పై ఉన్న పరిస్థితుల్లో సూసైడ్‌కి ప్రయత్నించినట్టు తెలిపారు వినోద్. ఇందులో ఆయన చెబుతూ, నాజీవితంలోని చాలా దారుణమైన స్థితిలో అనారోగ్యం పీక్‌లో ఉండి, నేను డెత్ బెడ్‌పై ఉన్న స్థితిలో బ్లేడ్ తలగడ కింద పెట్టుకుని ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను` అంటూ వెళ్లడించి షాక్ ఇచ్చాడు. పక్కనే ఉన్న తన భార్య మౌనంగా ఉండిపోయింది. వినోద్ చెప్పిన విషయాలు విని జబర్దస్త్ కమెడియన్లు అంతా షాక్ అయ్యారు. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా కనిపించారు. అయ్యో అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జడ్జ్ ఇంద్రజ, యాంకర్ రష్మి కూడా ఎమోషనల్ అయ్యారు.
ఓనర్‌తో గొడవనే కారణమా?
జబర్దస్త్ వినోద్ జీవితంలో ఏం జరిగిందనేది ఆశ్చర్యంగా మారింది. ఆయన ఏం చెప్పబోతున్నాడో ఈ ఆదివారం తెలియనుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానున్న విషయం తెలిసిందే. అయితే గతంలో వినోద్ తాను రెంట్‌కి ఉన్న ఇంటినే కొనుక్కోవాలని ప్రయత్నించారు. ఓనర్‌కి కొంత అమౌంట్ కూడా చెల్లించాడట. ఆ తర్వాత అతను హ్యాండిచ్చారు. ఇళ్లు అమ్మేందుకు నిరాకరించారు. దీంతో వారితో గొడవ జరిగిందని, ఆ ఓనర్ మనుషులతో దాడి చేయించాడని, దీంతో తీవ్రంగా గాయపడినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు వినోద్. చాలా రోజులు బెడ్‌పైనే ఉన్నాడట. అయితే తాజాగా వినోద్ చెప్పినది ఆ ఘటన గురించే అని తెలుస్తుంది. మరి అది నిజమేనా కాదా? తెలియాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.
`వినోద్‌తో వినోదం` రచ్చ
ఇప్పుడు జబర్దస్త్ కి దూరంగా ఉన్న వినోద్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని వీడియోలు చేస్తున్నారు. `వినోద్ తో వినోదం` పేరుతో వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక లేడీ గెటప్‌లో నవ్వులు పూయించిన వినోద్‌ని చూసి ఊర్లో చాలా మంది అవమానించారట. రకరకాలుగా హేళన చేశారట. అవన్నీ దాటుకుని సెలబ్రిటీగా ఎదిగాడు వినోద్. తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యాడు. ఆయనకు కూతురు, కొడుకు కూడా ఉన్నారు. ఇటీవల బర్త్ డే కూడా చేశారు. ఆయా ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు జబర్దస్త్ వినోద్.

