- Home
- Entertainment
- సావిత్రి ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఇటీవల రెండు హిట్స్ అందుకున్న సూపర్ స్టార్.. టాలీవుడ్ రిచెస్ట్ హీరో
సావిత్రి ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఇటీవల రెండు హిట్స్ అందుకున్న సూపర్ స్టార్.. టాలీవుడ్ రిచెస్ట్ హీరో
సావిత్రి ఎత్తుకుని ఆడిస్తున్న ఈ చిన్నారిని చూశారా? ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్‌లో ఒక రిచెస్ట్ హీరోగానూ నిలిచారు.

సావిత్రి ఎత్తుకున్న చిన్నోడిని గుర్తుపట్టారా?
ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్న చాలా మంది హీరోలు ఒకప్పుడు బాలనటులుగా నటించి మెప్పించిన వారే. ముఖ్యంగా స్టార్ వారసులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా మెరిశారు. అయితే చిన్నప్పుడు బాలనటులుగా నటించిన అందరు హీరోలుగా ఎదగలేరు. కొందరు మాత్రమే హీరోగా పరిచయమై మెప్పించారు. స్టార్లుగా, సూపర్ స్టార్లుగా ఎదిగారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ స్టార్ కావడం విశేషం.
నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న హీరో
సావిత్రి ఎత్తుకుని ఆడిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రకాల సినిమాలు చేసి మెప్పించారు. రొమాంటిక్ సినిమాలతోపాటు యాక్షన్ చిత్రాలు చేసి మెప్పించారు. డివోషనల్ మూవీస్‌తోనూ అలరించారు. తన ఇమేజ్‌ని తానే బ్రేక్ చేసి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు విలన్ రోల్స్ కూడా చేసేందుకు రెడీ అయ్యారు. సావిత్రి ఆడించిన ఆ చిన్నారి పుట్టిన రోజు నేడు కావడం విశేషం. ఆయన ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా?
సావిత్రి ఎత్తుకున్న చిన్నోడు నాగార్జున
సావిత్రి చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా రాణిస్తున్న హీరో. తెలుగులో సీనియర్లలో ఒకరిగా మెప్పిస్తున్నారు. నాగార్జున ఇటీవల `కూలీ`, `కుబేర` చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ భిన్నమైన పాత్రలు పోషించారు. `కూలీ`లో విలన్‌గా నటించగా, `కుబేర`లో కాస్త నెగటివ్ రోల్ చేసి మెప్పించారు. ఎప్పుడూ హీరోగానేనా, కాస్త ఛేంజోవర్ ఉండాలని చెప్పి ఇలా టర్న్ తీసుకున్నారు. మెప్పించారు.
`వెలుగు నీడలు` చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నాగ్
నాగార్జున బాలనటుడిగా నటించిన ఈ మూవీ `వెలుగు నీడలు`. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కలిసి నటించిన సినిమా. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై డి మధుసూధనరావు నిర్మించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో ఏఎన్నార్ సావిత్రిని ప్రేమిస్తాడు. కానీ గిరిజని పెళ్లి చేసుకుంటారు. వీరికి పుట్టిన బాబే నాగార్జున. చిన్ననాటి నాగార్జుననే ఇందులో సావిత్రి ఎత్తుకుంటుంది. ఈ సినిమా 1961 జనవరిలో విడుదలై పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతోనే నాగార్జున మొదటిసారి వెండితెరకు పరిచయం అయ్యారు. సినిమా చిత్రీకరించే సమయంలో ఆయన జన్మించి కొన్ని నెలలే అవుతుంది. అందుకే చిన్నారిగా కనిపించారు.
సూపర్ స్టారే కాదు, రిచెస్ట్ హీరో కూడా
అక్కినేని నాగార్జున 1959 ఆగస్ట్ 29న జన్మించిన విషయం తెలిసిందే. నేడు(శుక్రవారం) ఆయన 66వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. మాస్ హీరోగా `విక్రమ్` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున `అఖరి పోరాటం`తో మెప్పించారు. `గీతాంజలి` చిత్రంతో మంచి బ్రేక్ అందుకున్నారు. `శివ`తో ఇండస్ట్రీని షేక్ చేశారు. `హలో బ్రదర్`తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. `అన్నమయ్య`, `శ్రీరామదాసు`, `రాజన్న`, `నేటి సిద్ధార్థ`, `రక్షణ`, `వారసుడు`, `గోవిందా గోవిందా`, `క్రిమినల్`, `అజాద్`, `శివమణి`, `మన్మథుడు`, `సంతోషం`, `మాస్`, `కింగ్`, `సోగ్గాడే చిన్ని నాయన`, `బంగ్గార్రాజు`, `నా సామి రంగా` వంటి చిత్రాలతో విజయాలు అందుకుని తెలుగులో స్టార్ హీరోగా ఎదిగారు. అదే సమయంలో ఏఎన్నార్ నట వారసుడిగా రాణించారు. సినిమాల్లోనే కాదు, వ్యాపారాలను కూడా విస్తరించి వేలకోట్లకు ఎదిగారు నాగార్జున.