కడుపుబ్బా నవ్వించే జబర్ధస్త్ సన్నీ నవ్వుల వెనుక ఎంత విషాదం ఉందో తెలుసా ?
జబర్ధస్త్ లో నవ్వులు పూయించే కమెడియన్స్ లో సన్నీ కూడా ఒకడు. సుడిగాలి సుధీర్ టీమ్ లో తాగుబోతు పాత్రలు చేస్తూ నేచురల్ నటనతో ఆకట్టుకుంటాడు సన్నీ. ఇక ఈ కమెడియన్ జీవితంలో పడిన కష్టాల గురించి తెలిస్తే అంతా షాక్ అవుతారు.

జబర్ధస్త్ లో నవ్వులు పూయించే కమెడియన్స్ లో సన్నీ కూడా ఒకడు. సుడిగాలి సుధీర్ టీమ్ లో తాగుబోతు పాత్రలు చేస్తూ నేచురల్ నటనతో ఆకట్టుకుంటాడు సన్నీ. ఇక ఈ కమెడియన్ జీవితంలో పడిన కష్టాల గురించి తెలిస్తే అంతా షాక్ అవుతారు.
జబర్ధస్త్ ఎంతో మందికి జీవితం ఇచ్చింది. పేదరికంలో మగ్గిన చాలామంది కళాకారులు ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తూ.. సెటిల్ అయ్యారంటే జబర్థస్త్ వల్ల వచ్చిన ఇమేజ్ తోనే. అయితే ఈ జబర్ధస్త్ నవ్వుల వెనుక ఎన్నో జీవితాల్లో ఎంతో విషయాదం కూడాదాగి ఉంది. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే జబర్థస్త్ సన్నీ లాంటి కమెడియన్స్ వెనుక ఎన్నో అనుభవాలు ఉన్నాయి. జబర్ధస్త్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అలానే సన్నీ కథ కూడా అందులో భాగమే.
నలుగురిని నవ్విస్తున్నారు కాబట్టి.. కమెడియన్స్ జీవితంలో నవ్వులే ఉంటాయి అనుకోవడం పెద్ద పొరపాటు. ఏ కళాకారుడైనా.. స్ట్రగుల్డ్ లైఫ్ నుంచే ఎదుగుతాడు. జీవితం విలువ తెలిసిన వాడు..కమెడియన్ గా స్థిరపడినా కూడా.. రియల్ లైఫ్ లో మాత్రం చాలా హుందాగా ఉంటాడు. లోపల ఎంత బాధ ఉన్నా..పైకి నవ్వుతూ నవ్విస్తూ.. తన పాత్ర తాను అద్భుతంగా పోషిస్తాడు. అలాంటి జీవితమే సన్నీది కూడా.
జబర్ధస్త్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కంటీన్యూ అవుతూనే ఉన్నాడు సన్నీ.. మొదటి నుంచి.. సుడిగాలి సుధీర్ టీమ్ లోనే నటిస్తున్నాడు. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ తరువాత వీరితో కనిపించేవ్యక్తి సన్నీ. చాలా క్వాజువల్ గా కనిపిస్తాడు. తాగుబోతు పాత్రలు ఎక్కువగా చేస్తుంటాడు, సింపుల్ గా అలా వచ్చి ఇలా చేసి వెళ్తుంటాడు. సన్నీది అంతా నేచురల్ యాక్టింగ్.
అయితే సన్నీ గురించి అప్పుడప్పుడు ఏవో జోకులు వేయడం తప్ప.. స్టేజ్ మీద పెద్దగా ఎవరు మాట్లాడరు. సన్నీ అలవాట్ల గురించి మాత్రం పంచ్ లు పడుతూనే ఉంటాయి. కాని సన్నీ గురించి ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి ఎప్పుడు బయటకు చెప్పలేదు. ఏ ఎపిసోడ్ లో కూడా చూపించలేదు. అందుకే సన్నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనేది చాలామందకి తెలియదు.
ఈ విషయం సన్నీ కూడా ఎప్పుడు చెప్పుకోలేదు కూడా. ఇక రీసెంట్ గా సన్నీ గురించి ఓ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది. సన్నీ నవ్వుల వెనకు ఎంత విషాదం ఉందో అప్పుడు బయటపడింది. మధ్య ఓ స్కిట్ అయిపోయిన తరువాత రష్మి అడిగింది. సన్నీ ఇన్నాళ్ళ నుంచి జబర్ధస్త్ లో నవ్విస్తున్నారు కదా..? మీ గురించి మీరు సరదాగా చెపుతుంటారు కదా.. మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి, ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది.
అప్పుడు సన్నీ మాట్లాడుతూ.. ఓ అమ్మాయిని ప్రేమించా.. ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం. కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పెళ్ళి మీద ఇంట్రెస్ట్ పోయింది అని చాలా సింపుల్ గా చెప్పేశాడు.
ఇక సన్నీ గురించి రామ్ ప్రసాద్ కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. సన్నీ పెద్ద కోటీశ్వరుడు. ఇంత వరకూ ఎవరికీ తెలియదు.. అతనికి బోలెడన్ని డబ్బులు ఉన్నాయి.. చాలా ఆస్తులు ఉన్నాయి. కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను ఇలా వదిలేసుకున్నాడు.
సన్నీ అన్న, వదిన ఇద్దరూ గవర్నమెంట్ డాక్టర్స్.. సన్నీ వదిన గైనకాలజిస్ట్.. అన్న రేడియాలజిస్ట్. .. అంత డబ్బున్నా వాడు ఎక్కువగా వాళ్ళ ఇంట్లో ఉండడు.. మా రూమ్స్ కు వచ్చి తాగి పడుకుంటాడు. ఇంట్లో వాళ్లు కూడా బ్రతిమలాడారు, మేము కూడా పెళ్ళి చేసకోవచ్చు కదా అని చాలా సార్లు చెప్పి చూశాం.. కాని అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేశాడు. ఆ అమ్మాయి అలా చేయడంతో.. ప్రేమ, పెళ్ళిపై వాడికి విరక్తి వచ్చేసింది అన్నారు రామ్ ప్రసాద్.
ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో సన్నీ గురించి తెలియని వారంతా ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో సన్నీకి సపోర్ట్ గా రకరకా కామెంట్లు కూడా పెట్టారు. ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం.. కానీ ఇంత బాధ ఉందా అన్న అని.. నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రమే ఇలా సింగల్ గా ఉండిపోతారు. కాని నువ్వు కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని కామెంట్స్ చేస్తున్నారు.