బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?
త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ కాబోతోంది. ఈసారి బిగ్ బాస్ త్వరగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లు కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ రియాల్టీ షో. మరి ఈ 8 సీజన్లలో విన్నర్స్ ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నరు.

లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా నడిచింది. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే సీజన్ 9 కు సబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇక పోయిన ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. చివరి వరకు గౌతమ్ విన్నర్ అవుతాడు అనుకున్నారు అంతా. కాని నిఖిల్ విన్నర్ గా..గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. ఇక సీజన్ 8 విజేతకు ట్రోఫీ తో పాటు 55 లక్షల చెక్ ను కూడా అందించారు. ప్రస్తుతం నిఖిల్ తెలుగులో పెద్దగా యాక్టీవ్ గా లేడు. కన్నడ పరిశ్రమలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. యూట్యూబర్.. రైతుగా హౌస్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేశాడు. టైటిల్ గెలిచిన తరువాత కూడా బయట అతను చేసిన గొడవకు పోలీస్ కేసుల వరకూ వెళ్లింది. ఆ ప్రభావం బిగ్ బాస్ మీద గట్టిగా చూపించింది. ప్రస్తుతం ప్రశాంత్ రిచ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. ఏవో బిజినెస్ లు చేస్తున్నట్టు సమాచారం. ఆమధ్య సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ టోటల్ గెటప్ మార్చి కనిపించడంతో విమ్శల పాలు అయ్యాడు.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ గా నిలిచాడు సింగర్ రేవంత్. రన్నర్ గా శ్రీహాన్ విన్ అయ్యాడు. నిజానికి 40లక్షల ప్రైజ్ మనీ తీసుకోవడంతో శ్రీహాన్ బిగ్ బాస్ టైటిల్ ను చేతులారా వదిలేసుకున్నాడు. నాగార్జున ఆఫర్ చేసిన మనీ తీసుకోకుండా ఉండి ఉంటే శ్రీహాన్ విన్నర్ అయ్యేవాడు. అక్కడ రాంగ్ స్టెప్ వేయడంతో రేవంత్ కు టైటిల్ వెళ్లింది. ఇక బిగ్ బాస్ విన్నర్ అయిన తరువాత రేవంత్ పెద్దగా కనిపించడంలేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ అయిన రేవంత్ ఎన్నో పాటలు పాడి, ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సింగర్ గానే కొనసాగుతున్నాడు.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా వీజే సన్నీ కప్పు గెలుచుకున్నాడు. జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. మోడలింగ్ చేసుకుంటూ.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు సన్ని. అలాగే కళ్యాణ వైభోగం వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించారు. ఈ సీరియల్ తోనే ఆయనకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ప్రస్తుతం హీరోగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్నాడు సన్నీ.. అవి కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో హైదరాబాద్ లో రెస్టారెంట్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. హౌస్ అంతా అతనికి వ్యతిరేకంగా ఉన్నా.. ఆడియన్స్ మాత్రం అండగా ఉన్నారు. ఒక రకంగా ఒక్కడే ఒంటరి పోరాటం చేసి విన్ అయ్యాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పాపులర్ అయిన ఈ కుర్రాడు..హౌస్ లో ఎక్కడా కాస్త కూడా స్లిప్ అవ్వకుండా..నోరు జారకుండా జాగ్రత్తగా తెలివిగా గేమ్ ఆడాడు.
అభిజిత్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ తరువాత సినిమాలు చేస్తాడు అని అంతా అనుకున్నారు. కాని కొంత అనారోగ్య కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అయినట్టు తెలుస్తోంది ప్రస్తుతం అభిజిత్.. ట్రావెలర్ గా మారి దేశ విదేశాలుతిరుగుతున్నాడు. లైఫ్ ను ఏంజాయ్ చేస్తున్నాడు.
ఇక కింగ్ నాగార్జున హోస్టింగ్ చేయడంస్టార్ట్ చేసిన సీజన్ 3 చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సీజన్ విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. స్టార్ యాంకర్ శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. ఫోక్ సింగర్ గా.. వీడియో సాంగ్స్, ఆల్బమ్స్ తో ఫేమస్అయ్యాడు రాహుల్.. ఆతరువాత సినిమాల్లో పాటలు పాడటం స్టార్ట్ చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో పునర్నవితో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్. విన్నర్ గా బయటకు వెళ్లాక అష్షురెడ్డితో ఎఫైర్ నడిపించాడు.
బిగ్ బాస్ విన్నర్ అయ్యాక రాహుల్ కు అవకాశాలు పెరిగిపోయాయి. సినిమాల్లో వరుసగా పాడుతున్నాడు రాహుల్. ఆర్ఆర్ఆర్ లో అతను పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా వచ్చింది. అంతే కాదు ఆస్కార్ స్టేజ్ మీద కూడా రాహుల్ కు పాడే అవకాశం లభించింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ గా కౌశల్ విన్ అయ్యాడు. ఈ సీజన్ కూడా రచ్చ రచ్చ అయ్యింది. కౌశల్ బయట మనుషులను పెట్టి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు ఈ విషయంలో చాలా విమర్శలు ఫేస్ చేశాడు. కౌశల్ అర్మీ అనే పేరుతో మామూలు రచ్చ చేయలేదు. ఈ సీజన్ కు నాని హోస్ట్ చేయగా..కౌశల్ వల్ల నానీ హోస్టింగ్ పై కూడా ట్రోల్స్ తప్పలేదు.
ఈ సీజన్ ను సరిగ్గా నడిపించలేకపోయారు అన్న విమర్శలు కూడా నానీపై వచ్చాయి. విన్ అయ్యి బయటకు వచ్చిన కొత్తలో కాస్త హడావిడి చేసినా..ఆతరువాత అసలు కనిపించకుండాపోయాడు కౌశల్. తనకు తాను పీపుల్స్ స్టార్అని ట్యాగ్ ఇచ్చుకుని విమర్శల పాలు అయ్యారు. ఇక రీసెంట్ గా కన్నప్ప సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేశాడు కౌశల్ మంద.
ఇక అసలు బిగ్ బాస్ తెలుగు స్టార్ట్ అయ్యింది 2017లో. ఫస్ట్ సీజన్ ను తనహోస్టింగ్ తో జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ హిట్ చేశాడు. ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ సీజన్ అంతా సక్సెస్ మరే సీజన్ సాధించలేకపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా నటుడు శివ బాలాజీ నిలిచారు. శివ బాలాజీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎన్నో సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కాస్త సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన వ్యాపారాలు చూసుకుంటున్నాడు. రీసెంట్ గా కన్నప్ప సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు శివబాలాజీ.

