భార్య కాళ్లు కడిగి, నీళ్లు నెత్తిన చల్లుకున్న జబర్థస్త్ కమెడియన్, ఎందుకలా చేశాడో తెలుసా..?
చరిత్రలో నిలిచిపోయే పని చేశాడు జబర్థస్త్ కమెడియన్. అందరు ఆశ్చర్యపోయేలా.. తన భార్యకాళ్ళు కడిగి.. ఆ నీళ్ళు నెత్తిన చల్లుకున్నాడు. ఇంతకీ అతను ఎందుకు ఇలా చేశాడు..?
జబర్థస్త్ కమెడియన్స్ కడుపుబ్బా నవ్విస్తారు కాని.. వారి జీవితం వెనుక ఎన్నో విషాదగాదలు ఉంటాయి. చాలామంది కమెడియన్స్ లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ను ఫేస్ చేసి వచ్చినవారే. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. ఆయన స్కిట్ లో అడుగు పెట్టాడంటే వరుసగా పంచ్ లుపడుతూనే ఉంటాయి. ఆటోరామ్ ప్రసాద్ కు కూడా తలతిరిగే పంచ్ లు వేయగలడు ప్రసాద్. అందుకే అతనికి పంచ్ ప్రసాద్ అని పేరు వచ్చింది.
Also Read: మళ్ళీ రొమాన్స్ మొదలెట్టిన సుడిగాలి సుధీర్ - రష్మి,
జబర్ధస్త్ లో చాలా ఫాస్ట్ గా మంచి ఇమేజ్ సాధించుకున్న కమెడియన్లలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. తాజాగా ఓ ప్రోగ్రామ్ కు ఫ్యామిలీతో వచ్చిన ప్రసాద్.. ఆ ప్రోగ్రామ్ లో తన భార్య కాళ్లు కడిగి అందరికి షాక్ ఇచ్చాడు. అంతే కాదుఆ నీళ్ళు నెత్తిమీద చల్లుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. తల్లీ తండ్రులు జన్మనిస్తే.. తన భార్య తనకు పునర్జన్మనిచ్చిందన్నారు ప్రసాద్. అయితే తన భార్యపై ఇంత ప్రేమ, గౌరవం చూపించడానికి చాలా పెద్ద కారణం ఉంది.
నవ్వులు పూయిస్తూ.. నవ్విస్తూ.. కమెడియన్ గా ఎంతో సాధించిన ప్రసాద్ వెనుక అతి పెద్ద విషాదం అతని అనారోగ్యం. పంచ్ ప్రసాద్ ఎంత నవ్వించేవాడో అంత విషాదం అతని వెనక ఉంది. అనారోగ్యం అతనికి నిద్రలేకుండా చేసింది. స్టేజ్ మీద నవ్విస్తున్నా.. తెరవెనుక అతని బాధ వర్ణనాతీతం. రెండు కిడ్నీలు చెడిపోయి.. డయాలసీస్ మీద బ్రతికాడు చాలా కాలం. అది కూడా సరిపోక.. నడవలేక, నొప్పి భరించలేక చాలా ఇబ్బందిపడ్డాడు పంచ్ ప్రసాద్.
Also Read:అమరన్ మూవీ కోసం సాయి పల్లవి షాకింగ్ రెమ్యునరేషన్ ..?
కిడ్నీ డోనార్ కోసం దాదాపు రెండేళ్ళు నిరీక్షించాడు ప్రసాద్. ఇక తన భర్త బాధను చూడలేక ప్రసాద్ భార్య తన కిడ్నీ ఇవ్వడానకిి ముందుకు వచ్చింది. కాని వయస్సు చిన్నది కావడంతో డాక్టర్లు కుదరదు అనేశారు. దాంతో ప్రసాద్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఎట్టకేళకు డోనర్ దొరకడంతో ప్రసాద్ కు ఆపరేషన్ జరిగి..కోలుకుని మళ్ళీ జబర్థస్త్ స్టేజ్ ఎక్కాడు.
ఇక ఈ ఇబ్బందుల్లో తన భార్య తనకోసం తనతోనే ఉంటూ.. కుటుంబాన్నికంటికిరెప్పలా చూసుకుంది అని అన్నారు ప్రసాద్. ఈరోజు ఇలా తాను ఆరోగ్యంగా తిరగడానికి కారణం తన భార్య అంటూ.. ఆమె కు తాను చేసే ఈ పని చాలా చిన్నదంటూ. భార్యకాళ్లు కడిగి ఆ నీళ్ళునెత్తిన చల్లుకున్నాడు పంచ్ ప్రసాద్. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.