రజినీకాంత్ సినిమా లో బాలయ్య ను ఎందుకు తీసుకోలేదు...వీరిద్దరి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. నట సింహం బాలయ్య బాబు.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా మిస్ అయ్యిందని మీకు తెలుసా..? బాలయ్యను తీసుకోవాలని అనుకున్న తలైవా టీమ్ ఎందుకు తీసుకోలేదు.. అసలు వీరి కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటి..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎన్నో మాల్టీ స్టారర్స్ వచ్చాయి. పక్క భాష నుంచి స్టార్ హీరోలు.. కూడా మన హీరోలతో కలిసి నటించిన సందర్భాలుఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలకు భాషా బేదం లేకుండా స్టార్ హీరోలు నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో స్టార్ హీరోల కాంబినేషన్లు కూడా మిస్ అయిన సందర్భాలు లేకపోలేదు.అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాంబినేషన్.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. నందమూరి నటసింహం బాలయ్య బాబు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రెండు సార్లు మిస్ అయ్యిందట. రీసెంట్ ఇయర్స్ లో కూడా వీరి కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉండి అది మిస్ అయ్యింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. ఆయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది జైలర్ మూవీ. ఈమూవీ లో రజినీకాంత్ తో పాటు కన్నడ నుంచి రాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి జాకీష్రాఫ్ గెస్ట్ రోల్స్ చేశారు.
గెస్ట్ రోల్స్ అయినా.. అవి చాలా పవర్ ఫుల్ పాత్రలు కావడం విశేషం. అయితే ఈ సినిమా లో తెలుగు నుంచి అలాంటి పాత్రను తీసుకోలేదు మేకర్స్. అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం బాలయ్యను తీసుకోవాలి అని అనుకున్నారట. దాదాపు సంప్రదించాలి అనుకున్నటైమ్ లోనే ఎందుకో తెలియదు.. ఈ ప్రపోజల్ ఆపేశారు. బాలయ్యను తీసుకోవాలి అని అనుకున్నట్టు ఒ సందర్భంలో రజినీకాంత్ కూడా అన్నారు.
కాని ఏం జరిగిందో తెలియదు తీసుకోలేదు. అలా వీరి కాంబోలో సినిమా మిస్ అయ్యింది. అంతకు మందు కూడా రజినీకాంత్.. బాలకృష్ణ ఇద్దరి కాంబినేషనర్ లో భారీ మల్టీ స్టారర్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. ఇద్దరు హీరోలు మంచి ఫామ్ లో ఉండగానే ఇది అనుకున్నారట. కాని ఆ సినిమా విషయంలో డిస్ట్రీబ్యూటర్స్.. బయ్యర్స్.. భయపడ్డారట.
అంత పెద్ద స్టారస్ తో మల్టీస్టారర్ అంటే రిస్క్ చేయలేము అన్నట్టు టాలీవుడ్ టాక్. దాంతో వీరిద్దరు నటించాల్సిన సినిమా రెండు సార్లు మిస్ అయ్యింది. ప్రస్తుతం భారీ మల్టీ స్టారర్స్ తెరకెక్కుతున్న నేపథ్యంలో.. వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా వస్లే.. అది భారీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. జైలర్ లాంటియాక్షన్ అడ్వెంచర్ మూవీని ఇద్దరి కాంబోలో చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.