MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పీకల్లోతు అప్పుల్లో జబర్దస్త్ కమెడియన్, యాంకర్ శ్రీముఖి తో సినిమా చేసి కోట్లు పోగొట్టుకున్నాడా..?

పీకల్లోతు అప్పుల్లో జబర్దస్త్ కమెడియన్, యాంకర్ శ్రీముఖి తో సినిమా చేసి కోట్లు పోగొట్టుకున్నాడా..?

ఒక్క సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకుని..పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాడట ఓ జబర్థస్త్ కమెడియన్.  యాంకర్ శ్రీముఖితో చేసిన ఆ సినిమా.. ఓ భారీ బడ్జెట్ మూవీ కింద నలిగిపోయిందట. ఇంతకీ ఎవరా కమెడియన్..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 05 2024, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా.. జబర్థస్త్ లో టీమ్ లీడర్ గా.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సాధించాడు ఓ నటుడు. కాని కొన్ని నిర్ణయాలు అతన్నీ అప్పుల ఊబిలోకి లాగేశాయి. పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ఈ నటుడు.. రీసెంట్ గా తేరుకుని.. మెగా ఫోన్ పట్టాడు.. స్టార్ కాస్ట్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. 
 

మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్, బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు ధనరాజ్. దనాధన్ ధనరాజ్ గా ఫేమస్ అయిన ఈ నటుడు.. ముందు సినిమాల్లో కమెడియన్ గా ఫేమస్ అయ్యాడు. రాజా, జై, పరుగు, పిల్లజమిందారు, భీమిలి కబడ్డి జట్టు.. ఇలా వరుస సినిమాలతో రచ్చ చేశాడు ధనరాజ్. ఆతరువాత వచ్చిన కొంత మంది కమెడియన్ల వల్ల ధనరాజ్ కు అవకాశాలు తగ్గాయి. దాంతో జబర్ధస్త్ స్టేజ్ ఎక్కడు. ఈ స్టేజ్ ను దడదడలాడించాడు ధనరాజ్. 
 

మెగాస్టార్ చిరంజీవి కి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న మెగాస్టార్ SSC మెమో..

36

జబర్థస్త్ లో టీమ్ లీడర్ గా.. మంచి మంచి స్కిట్లతో సక్సెస్ లు కొడుతూ వెళ్లాడు. ఆతరువాత చిన్న గా జబర్థస్త్ స్టేజ్ ను వదిలేసి.. మళ్లీ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశాడు ధనరాజ్. జబర్థస్త్ లో స్కిట్లు చేస్తున్న టైమ్ లోనే.. సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకున్న ఈ నటుడు.. ఆతరువాత సినిమాలకే పరిమితం అయ్యాడు. నటుడిగానే మిగిలిపోకుండా.. నిర్మాతగ, దర్శకుడుగా పలు అవతారాలు ఎత్తాడు., 
 

46

లాస్ట్ ఇయర్ సముద్ర ఖని లీడ్ చేసిన  విమానం సినిమాలో మంచి రోల్ చేశాడు ధనరాజ్. ఆ వెంటనే  అనూహ్యంగా మెగా ఫోన్ చేతబట్టి ‘రామం రాఘవం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. నటుడిగా కొనసాగుతూనే ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు స్టార్ కమెడియన్. ఇక విమానం సినిమాను లీడ్ చేసిన మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్  సముద్రఖనిని  ఈసినిమాకు ఓప్పించాడు.  షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.
 

56

ఇక ఈ విషయాలు పక్కన పెడితే.. ధనరాజ్ సినిమాకు బాహుబలి వల్ల తీరని నష్టం జరిగిందట. ధనరాజ్ ఓ సారి నిర్మాతగా మారి ఓ సినిమా తెరకెక్కించాడు. యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఈసినిమా కోసం తన దగ్గర ఉన్నదంతా పెట్టేశాడట, ఇంకా సరిపోకపోవతే.. స్నేహితుల దగ్గర అప్పు చేశాడట. ఇంత కష్టపడి చేసిన  సినిమా మంచి రిజల్ట్ కూడా ఇచ్చిందట. 
 

66

అయితే రిలీజ్ అయిన వారం రోజుల వరకూ బాగా ఆడిందట ఈమూవీ. కాని వారం రోజులకు బాహుబలి సినిమా రిలీజ్ అవ్వడంతో తన సినిమా వెనక్కి వెళ్ళిపోయిందన్నారు ధనరాజ్. దాంతో కలెక్షన్లు లేక నష్టాపాలు అవ్వాల్సి వచ్చిందని ఓ సందర్భంలో వెల్లడించాడు ధనరాజ్. ఆతరువాత మళ్లీ పుంజుకోవడానికి చాలా సమయం పట్టిందట. ఎన్నో కష్టాలు కూడా అనుభవించానంటున్నాడు ఈస్టార్ కమెడియన్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved