MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • హరిహర వీరమల్లు టార్గెట్ గా థియేటర్ల బంద్ ? తెలుగు ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఇదే

హరిహర వీరమల్లు టార్గెట్ గా థియేటర్ల బంద్ ? తెలుగు ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ క్లారిటీ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 

2 Min read
tirumala AN
Published : May 24 2025, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్
Image Credit : Asianet News

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్

జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ నిర్వహించబోతున్నట్లు ఎగ్జిబిటర్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో టాలీవుడ్ నిర్మాతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వివిధ రకాల వార్తలు బయటకు వస్తుండగా దీనిపై ఫిలిం ఛాంబర్ ఓ స్పష్టత ఇచ్చింది.

25
ఊహాగానాలు మాత్రమే 
Image Credit : Asianet News

ఊహాగానాలు మాత్రమే 

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల వినిపిస్తున్న కొన్ని వార్తలను బేస్ చేసుకుని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిపై ఉదయం 11 గంటల నుండి ఫిలిం ఛాంబర్ లో ఒక మీటింగ్ నిర్వహించాము. ఈ మీటింగ్ కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ప్రస్తుతం థియేటర్ల విషయంలో నెలకొన్న సమస్యల గురించి చర్చలు జరగాయి. మే 1 నుంచి థియేటర్లు మూత పడతాయని వార్త బయటకు వెళ్ళింది. కానీ అలా థియేటర్లు మూసి వేయడం అనేది జరగడం లేదు. అది పూర్తిగా ఊహాగానం మాత్రమే. జూన్ 1న కూడా థియేటర్ల బంద్ ఉండదని స్పష్టం చేశారు.

Related Articles

ఎన్టీఆర్ తో మాత్రమే కాదు.. వెంకీ, ప్రభాస్ తో కూడా కన్నడ సెన్సేషనల్ బ్యూటీ రొమాన్స్ ?
ఎన్టీఆర్ తో మాత్రమే కాదు.. వెంకీ, ప్రభాస్ తో కూడా కన్నడ సెన్సేషనల్ బ్యూటీ రొమాన్స్ ?
ఫారెన్ నుంచి వచ్చాను కదా, దానికి ఒప్పేసుకుంటానని అనుకున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ కామెంట్స్
ఫారెన్ నుంచి వచ్చాను కదా, దానికి ఒప్పేసుకుంటానని అనుకున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ కామెంట్స్
35
ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు 
Image Credit : Asianet News

ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు 

ఈనెల 30వ తేదీన ఈసీ మీటింగ్ ఉండబోతుంది. ఆ రోజు మూడు సెక్టార్ల నుండి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఓ నిర్ణీత సమయంలోనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేలా ఆ కమిటీ పనిచేయబోతోంది. దీనికి సంబంధించిన ఎటువంటి వార్తలైనా  ఫిలిం ఛాంబర్, ఇంకా అనుసంధాన సంస్థల నుంచి బయటకు వస్తే కేవలం ఆ వార్తలను మాత్రమే ప్రచారం చేయండి. అంతేకానీ బయటనుంచి వేరే ఇతర వార్తలు ఏమైనా వస్తే వాటిని దయచేసి నమ్మకండి, ప్రచారం చేయకండి. ఎందుకంటే అటువంటి అబద్ధపు వార్తలు చిత్ర పరిశ్రమలో అనవసరమైన ఆటంకాలు తీసుకొస్తున్నాయి.

45
ఏ చిత్రాన్ని టార్గెట్ చేయలేదు 
Image Credit : our own

ఏ చిత్రాన్ని టార్గెట్ చేయలేదు 

అలాగే ఈ విషయంపై అవసరమైతే ప్రభుత్వంతో కూడా మాట్లాడతాము. గతంలో కూడా కొన్ని సమస్యలకు ప్రభుత్వంతో కూర్చుని చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చర్చించబోతున్నాము. చిత్ర పరిశ్రమ స్వయంగా కష్టాల నుంచి బయట పడుతుంది. అలాగే ఏదో ఒక సినిమాను టార్గెట్ చేసి థియేటర్లు బంద్ చేస్తున్నారు అనే వార్తను పూర్తిగా ఖండిస్తున్నాము. ఇండస్ట్రీకి మంచి జరిగే విధంగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యల నుండి బయట పడి ముందుకు వెళ్తాము అని అన్నారు.

55
జూన్ 12న హరిహర వీరమల్లు
Image Credit : our own

జూన్ 12న హరిహర వీరమల్లు

జూన్ 12న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ చిత్రాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే థియేటర్ల సమస్యని తెరపైకి తీసుకువచ్చినట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఫిలిం ఛాంబర్ అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది.   

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రసన్న కుమార్, శ్రీధర్, సుధాకర్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, కేల్ దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వెంకటేశ్వరరావు, సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, భరత్ చౌదరి, టి ఎస్ రాంప్రసాద్, సి కళ్యాణ్, ముత్యాల రామదాస్, ఎం సుధాకర్ తదితరులు.

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved