MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `గేమ్‌ ఛేంజర్‌` రిజల్ట్ పై ఫస్ట్ టైమ్‌ రామ్‌ చరణ్‌ స్పందన.. పోస్ట్ వైరల్‌, ఏమన్నాడంటే?

`గేమ్‌ ఛేంజర్‌` రిజల్ట్ పై ఫస్ట్ టైమ్‌ రామ్‌ చరణ్‌ స్పందన.. పోస్ట్ వైరల్‌, ఏమన్నాడంటే?

రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ థియేటర్‌లో రన్‌ అవుతుంది. సినిమాపై రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫలితంపై రామ్‌ చరణ్‌ స్పందించారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 14 2025, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనతో రన్‌ అవుతుంది. సంక్రాంతి పండగ కావడంతో బాగానే రన్‌ అవుతుందని తెలుస్తుంది. కలెక్షన్లు స్టడీగానే ఉంటున్నాయని అంటున్నారు. అయితే సినిమా రేంజ్‌తో పోల్చితే తక్కువనే చెప్పాలి. 
 

25

సినిమాపై దారుణంగా నెగటివిటీ స్ప్రెడ్‌ అయ్యింది. ఇతర హీరోల అభిమానులు సినిమాని ట్రోల్‌ చేస్తున్నారు. వీరిలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు హెచ్‌ డీ ప్రింట్‌ని కూడా లీక్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. సినిమాని డ్యామేజ్‌ చేసేందుకు కుట్ర చేసినట్టు టీమ్‌ వెల్లడించింది.

వారిపై సైబర్‌ క్రైమ్‌కి కూడా ఫిర్యాదు చేసింది. నిజంగానే ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఉన్నారా? లేక ఫ్యాన్స్ ముసుగులో ఎవరైనా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఓ పెద్ద సినిమా రిలీజ్‌ సందర్భంగా ఇలాంటివి ఇటీవల కామన్‌ అవుతున్నాయి. సినిమా నిర్మాతలకు పెద్ద దెబ్బగా మారుతున్నాయి. 

35

ఈ నేపథ్యంలో సినిమా ఫలితంపై తాజాగా రామ్‌ చరణ్‌ స్పందించారు. ఆయన సోషల్‌ మీడియాలో అభిమానులకు, మీడియాకి, ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెబుతూ నోట్‌ విడుదల చేశారు.

ఈ సంక్రాంతికి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని, `గేమ్‌ ఛేంజర్‌` సినిమా కోసం మేం పడ్డ కష్టం కనిపిస్తుందని, ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నా చిత్ర బృందానికి, నటీనటులు, టెక్నీషియన్లకి, ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన వారికి ధన్యవాదాలు అని తెలిపారు చరణ్‌. 

45

మీరు చూపించి అమితమైన ప్రేమ, అభిమానం, సహకారం నాకు చాలా ఎక్కువ. ఈ సందర్భంగా మీడియాకి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ రివ్యూల ద్వారా ఎంకరేజ్‌మెంట్‌ అందించిన తీరు బాగుంది. సినిమా విజయంలో భాగమయ్యింది. ఈ ఏడాది ఇంతటి పాజిటివిటీతో స్వాగతం పలకడం హ్యాపీగా ఉంది.

ఈ సందర్భంగా మీకు(అభిమానులకు) ప్రామిస్‌ చేస్తున్నా, నేను నటనతో మిమ్మల్ని గర్వించేలా చేస్తానని. `గేమ్‌ ఛేంజర్‌` మూవీకి నా హృదయంలో ఎప్పటికీ మంచి స్థానం ఉంటుంది. మీ అమితమైన ప్రేమకి మరోసారి ధన్యవాదాలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు` అని తెలిపారు. ఈ సందర్భంగా ఈ మూవీని అందించిన దర్శకుడు శంకర్‌కి చరణ్‌ ధన్యవాదాలు తెలిపారు. 
 

55

శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో రామ్‌ చరణ్‌ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఎస్ జే సూర్య విలన్‌గా నటించగా, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, సునీల్‌, అంజలి, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని దిల్‌ రాజు నిర్మించారు. ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. 

read more: గేమ్ ఛేంజర్ కలెక్షన్స్: ఆర్జీవీ సెటైర్లు

also read: అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ముసుగులో Game Changerపైకుట్ర, HD ప్రింట్‌ లీక్‌..సైబర్‌ క్రైమ్‌కి ఫిర్యాదు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
Recommended image2
AR Rahman ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌.. అంతా ప్లాన్‌ చేసుకున్నాక హార్ట్ బ్రేక్‌ అయ్యే ట్విస్ట్
Recommended image3
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved