జైలర్ 2 టీజర్.. రజనీ బ్లాక్ బస్టర్ కాంబో లోడింగ్.. త్రివిక్రమ్ ఇక రిలాక్స్
పొంగల్ పండుగ సందర్భంగా `జైలర్ 2` సినిమా అధికారిక టీజర్‌ను సన్ పిక్చర్స్ విడుదల చేసింది. రజనీకాంత్ మరో బ్లాక్ బస్టర్ కాంబో లోడింగ్ కి రంగం సిద్ధమైంది.
రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `జైలర్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండేళ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ రాబోతుంది. తాజాగా సంక్రాంతికి కానుకగా `జైలర్ 2`ని ప్రకటించారు. సన్ పిక్చర్స్ సంస్థ పొంగల్ పండుగ సందర్భంగా జైలర్ 2 సినిమా అధికారిక టీజర్‌ను విడుదల చేసింది.
`జైలర్ 2` టీజర్ ఇంట్రెస్టింగ్..
టీజర్‌లో అనిరుధ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇద్దరూ ఫెంగ్ తుఫాను గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నెల్సన్‌ను 'చెన్నైకి తిరిగి వెళ్దామా' అని అనిరుధ్ అడగగా, 'తుఫాను చెన్నైలోనే ఉంది. అందుకే కథ గురించి చర్చించడానికి మిమ్మల్ని గోవాకు తీసుకొచ్చాను' అని నెల్సన్ అంటాడు. 'నా సినిమా వచ్చాక 5 తుఫానులు వచ్చిపోయాయి. మీరు వారానికో సినిమా విడుదల చేస్తున్నారు. అకస్మాత్తుగా ఇంటికి కిటికీలన్నీ పగలగొట్టుకుని రౌడీలు వచ్చి పడుతున్నారు' అని అనిరుధ్ అంటాడు. నెల్సన్, అనిరుధ్ ఇద్దరూ భయంతో కేకలు వేస్తూ లేస్తారు. రజినీకాంత్ కత్తితో ఇంట్లోకి రావడంతో, నెల్సన్, అనిరుధ్ ఇద్దరూ బెడ్ షీట్ కప్పుకుంటారు.
`మద గజ రాజా` 2 రోజుల కలెక్షన్.. విశాల్ కి మామూలు జాక్ పాట్ కాదుగా!
`టైగర్ కా హుకుమ్`తో సీక్వెల్ సందడి..
రజినీ ఆ బెడ్ షీట్ తీసి రౌడీల గురించి అడగగా, 'ఈ వైపు పారిపోయారు' అని ఇద్దరూ చెప్పి, రజినీ వారిని వెంబడిస్తాడు. వెళ్తూ వెళ్తూ ఒక బాంబు వేసి వెళ్తాడు. దాన్ని చేతిలోకి తీసుకున్న నెల్సన్, 'జేబులో నుంచి కింద పడినట్టు కూడా తెలియకుండా పోతున్నాడు' అని అంటాడు. రజినీ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లగానే బాంబు పేలుతుంది. వారి ముఖాలు నల్లగా మారిపోతాయి. ఆ తర్వాత జైలర్ సినిమా థీమ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. 'టైగర్ కా హుకుమ్' అని రజినీకాంత్ చెప్పే సన్నివేశం కూడా ఉంది. చివర్లో 'ఇది భయంకరంగా ఉంది నెల్సన్. దీన్నే ఓకే చేసేయొచ్చు' అని అనిరుధ్ అంటాడు.
శంకర్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అతనేనా..? ఆయన మార్క్ మ్యూజిక్ ఎటు వెళ్ళిపోయింది..?
రజనీ మరో బ్లాక్ బస్టర్ లోడింగ్..
సుమారు 4 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో నటుడు, సంగీత దర్శకుడు, దర్శకుడు ఉన్నారు. 'త్వరలో' అంటూ వీడియో ముగుస్తుంది. ఇది రజినీకాంత్ 172వ సినిమా. 2023 ఆగస్టు 10న విడుదలైన జైలర్ సినిమాలో రజినీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, యోగిబాబు, మిర్నా మీనన్, సునీల్, వి.డి.వి గణేష్ వంటి వారు నటించారు. వీరితో పాటు తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, కిశోర్ వంటి వారు అతిథి పాత్రల్లో నటించారు. దాదాపు రూ.220 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.650 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు రజనీ నుంచి మరో బ్లాక్ బస్టర్ మూవీ లోడింగ్ అని చెప్పొచ్చు.
త్రివిక్రమ్ రిలాక్స్..
నెల్సన్.. అల్లు అర్జున్‌కి కూడా కథ చెప్పారు. ఆ ప్రాజెక్ట్ పై కూడా వర్క్ జరుగుతుంది. బన్నీతో ముందు సినిమా ఉంటుందా అనే వార్తలు వినిపించాయి. కానీ `జైలర్ 2`ని ప్రకటించడంతో ఇప్పట్లో బన్నీతో సినిమా ఉండబోదని అర్థమవుతుంది. అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ మూవీనే ముందుగా పట్టాలెక్కబోతుందని తాజా పరిణామాలు తెలుస్తున్నాయి. దీంతో ఇక త్రివిక్రమ్ రిలాక్స్ కాబోతున్నారని చెప్పొచ్చు.
— Sun Pictures (@sunpictures) January 14, 2025