MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీపకు ధైర్యం చెప్పిన కార్తీక్.. సౌర్యను కార్తీక్ వాళ్ళకు ఇచ్చేయాలని నిర్ణయించుకున్న ఇంద్రుడు?

Karthika Deepam: దీపకు ధైర్యం చెప్పిన కార్తీక్.. సౌర్యను కార్తీక్ వాళ్ళకు ఇచ్చేయాలని నిర్ణయించుకున్న ఇంద్రుడు?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 01 2022, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్,దీప జీవితంలో సమస్య లేని రోజు లేదు టెన్షన్ పడని క్షణం లేదు అని మనసులో అనుకుంటూనే ఏం లేదు డాక్టర్ తనకి ప్రతి చిన్న విషయానికి ఈ టెన్షన్ పడటం అలవాటు అనడంతో ఆ డాక్టర్ ఆపరేషన్ సమయానికి బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉండాలి అని అంటుంది. చూడండి డాక్టర్ ఆవిడ ఏ విషయం గురించో తీవ్రంగా ఆలోచిస్తుంది ముందు ఆ విషయం గురించి పరిష్కరించండి అని అనడంతో సరే అని అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ నేను ఆపరేషన్ చేసినట్టు మా ఆవిడకు చెప్పొద్దండి ప్లీజ్ అని అనడంతో సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ డాక్టర్. అప్పుడు కార్తీక్ నాకు గతం గుర్తుకు వచ్చింది అని తెలిస్తే ఎగిరి గంతేస్తుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

 అప్పుడు చాలా కష్టం అవుతుంది కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత అన్ని నిదానంగా చెబుతాను అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు సౌందర్యను, మోనిత బెదిరిస్తూ మోనితను ఒక చోటికి పిలుచుకొని వెళ్తుంది. ఒక రూమ్ లో పడేసి నువ్వు ఇక్కడే ఉండాలి. నీ కొడుకుని తీసుకొచ్చినందుకు మా మీద కేసు పెడతానన్నావు కదా అని అనగా అప్పుడేదో ఆవేశంలో అన్నాను ఆంటీ అని అంటుంది మోనిత. నువ్వు ఏదో చేస్తున్నావే కానీ ఏదో దాస్తున్నావు అయినా నీకు బట్టలు కొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అనగా ఏం లేదు ఆంటీ అనడంతో మరి నా తల ఎందుకు పగలగొట్టావు అని అడుగుతుంది సౌందర్య.
 

37

అప్పుడు మోనిత ఆంటీ ఆంటీ నేను వెళ్ళాలి ఆంటీ అని అనగా వెళ్లడానికి వీలు లేదు ఇక్కడే ఉండాలి అని అంటుంది సౌందర్య. అప్పుడు మోనితను ఒక రూమ్ లో పెట్టి తలుపులు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌందర్య. అప్పుడు మోనిత కార్తీక్ దీపలు ఎక్కడికి వెళ్లారు ఒకవేళ గతం గుర్తుకొస్తే ఇక్కడికే వస్తారు కదా సరే ఇక్కడికి రాని కథ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ అసలు ఏం జరుగుతోంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు దీప కీ సృహ వస్తుంది. అప్పుడు డాక్టర్ బాబు శౌర్య దొరికిందా అని అనగా ఇన్ని రోజులుగా వెతికినా దొరకలేదు ఇప్పుడు ఎలా దొరుకుతుందా అని అంటాడు.
 

47

సౌర్య గురించి పక్కన పెట్టు నువ్వు ఎందుకు బయటికి వెళ్లావు నేను వెతుక్కుంటూ వచ్చేసరికి నువ్వు అలా రోడ్డు పక్కన పడిపోయావు అంటూ బాధతో మాట్లాడుతాడు కార్తీక్. మాట్లాడకండి డాక్టర్ బాబు పదేపదే ఆరోగ్యమంటారు నా కూతురు దొరికనప్పుడు నాకు ఆరోగ్యం ఎందుకు నా కూతురిని వాళ్ళు ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళిపోతారేమో అని బాధగా ఉంది డాక్టర్ బాబు అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది వంటలక్క. అప్పుడు నాకు ఈ ఆపరేషన్ వద్దు ఏం వద్దు నేను నా కూతురు దగ్గరికి వెళ్తాను అని దీప వెళ్లడానికి ప్రయత్నించగా కార్తీక్ సీరియస్ అవుతాడు.
 

57

 ఎందుకు చెబితే అర్థం చేసుకోవడం లేదు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా సౌర్యను బాగా చూసుకోగలవు నా మాట విను ఎక్కువ టెన్షన్ పడకు దీప అని అంటాడు కార్తీక్. మరొకవైపు ఇంద్రుడు చంద్రమ్మ ఎంత అడిగినా కూడా పట్టించుకోకుండా ఒక చోటికి పిలుచుకొని వెళ్లడంతో చేతులు విదిలించుకొని ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా అరుస్తుంది చంద్రమ్మ. అప్పుడు ఇంద్రుడు జరిగింది మొత్తం చంద్రమ్మకు వివరిస్తాడు. అంత ఆస్తిపరురాలైన ఆమె సౌర్యమ్మ కోసం తిరిగి తిరిగి ఒక అనాధల రోడ్డు పక్కన పడింది చంద్రమ్మ అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు ఇంద్రుడు. అప్పుడు చంద్రమ్మ అయితే ఇచ్చేద్దాం గండ వెంటనే చంద్రుడు నాకు మనసంతా ఏదోలా ఉంది నిద్ర పట్టడం లేదు ఆకలి కావడం లేదు అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు.
 

 

67

 అప్పుడు సరే గండ నాకు నువ్వు నీకు నేను చాలు మనకు పిల్లలు అవసరం లేదు సౌర్య ని వాళ్లకు ఇచ్చేద్దాము అని అంటుంది. అప్పుడు పోస్టర్లో ఉండే ఫోన్ నెంబర్ కీ ఫోన్ చేసి ఆ అడ్రస్ కి వెళ్తాడు కార్తీక్. నీకు ఇంద్రుడు తెలుసా అని అనగా ఇంద్రుడు అని అనడంతో ఈ పోస్టర్లో నీ నెంబర్ వేసిన ఇంద్రుడు అని అనగా తెలియదు బాబు అని అబద్ధం చెబుతాడు అతను. అప్పుడు అతను ఈ ఫోన్ ఇచ్చి ఎవరు వచ్చినా నిజం చెప్పొద్దు అని అన్నాడు. ఇతను చూస్తే పోలీసులు కేసులు అంటున్నాడు ఎందుకు వచ్చిన గొడవ అసలు నిజం చెప్పేస్తాను అనే కార్తిక్ దగ్గరికి వెళ్తాడు. మళ్లీ అబద్ధం చెప్పడంతో కార్తీక్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.

77

మరొకవైపు దీప శౌర్య ఫోటో పట్టుకొని హాస్పిటల్లో అందరినీ అడుగుతూ కళ్ళు తిరిగి పడిపోతుండగా ఇంతలో కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. ఏంటి దీప ఇలా చేస్తున్నావు నీకు ఏం చెప్పాను బయటకు రావద్దు అని చెప్పానా లేదా అని అంటాడు కార్తీక్. బయటికి వెళ్ళొద్దన్నారు కనీసం బయటకు కూడా రాకూడదా అని అనగా నువ్వు రూమ్ లో నుంచి బయటకు రాకూడదు దీప ఆపరేషన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు కార్తీక్.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Recommended image2
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved