MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్

Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్

Karthika Deepam 2 Today Episode (మే 15వ తేదీ)లో జ్యో చీట్ చేసిందన్న దశరథ. నెల రోజుల్లో పెళ్లి చేయకలేకపోతే కోరుకున్నది ఇస్తామని జ్యోకు మాటిచ్చిన దీప, కార్తీక్. తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : May 15 2026, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో కార్తీక్, శ్రీధర్, శివన్నారాయణ మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్నను సీఈఓను చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది అంటాడు శివన్నారాయణ. నా కోడలు తన కూతురు సీఈఓగా ఉండాలని కోరుకుంది. తన సంతోషం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తాడు శివన్నారాయణ. అప్పుడే వచ్చిన దశరథ మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్న అని అంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
జ్యో చీటింగ్
Image Credit : Jiohotstar

జ్యో చీటింగ్

తర్వాత దశరథ, కార్తీక్ మాట్లాడుకుంటారు. జ్యోత్స్న చాలా తెలివిగా అందరిని చీట్ చేసింది. నెల్లూరు బ్రాంచ్ లో అసలు ఏ ప్రాబ్లెం లేదు. చిన్న సమస్యను పెద్దది చేసి చూపించి ఫోన్ చేయించింది అని చెప్తాడు దశరథ. అత్తను ఎమోషనల్ గా లాక్ చేసింది. అత్త కోసం తాత మనసు మార్చుకున్నాడు. నన్ను మీటింగ్ లో లేకుండా చేసింది అంటాడు కార్తీక్. ఇది తాత్కాలికమే కదా.. కొత్త సీఈఓను తీసుకువస్తే సమస్య పరిష్కారం అవుతుంది అంటాడు దశరథ.

38
జ్యో, పారు సెలెబ్రేషన్
Image Credit : Jiohotstar

జ్యో, పారు సెలెబ్రేషన్

మరోవైపు జ్యోత్స్న, పారిజాతం వారి గెలుపును సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు కావాల్సింది సీఈఓ పోస్టు కాదు గ్రానీ.. ఛైర్మన్ పోస్టు అంటుంది జ్యోత్స్న. ఏకంగా తాత పోస్టుకే ఎసరు పెట్టావా అంటుంది పారు. మరి ఈ చిల్లర డబ్బులు మనకెందుకు గ్రానీ.. ఈ ఆస్తి మొత్తం నాది కావాలి. బావ నా సొంతం కావాలి అంటుంది జ్యోత్స్న. 

మళ్లీ పాత పాటే పాడతావేంటే అంటుంది పారు. నేను సీఈఓగా ఉండటం కోసం అబద్ధం చెప్పాను. ఈ ఆస్తి నాదే, బావ నా వాడే అంటుంది జ్యోత్స్న. నాకు అన్నింటికి అడ్డం దీపే. తనని లేకుండా చేయాలి అంటుంది జ్యోత్స్న. ఇది ఏదో తప్పుచేసేలా ఉంది నా మనుమరాలిని ఎలా కాపాడుకోవాలి అని మనసులో అనుకుంటుంది పారు.

48
జ్యోకు మాటిచ్చిన దీప
Image Credit : Jiohotstar

జ్యోకు మాటిచ్చిన దీప

కార్తీక్, దీప ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతుంటారు. ఎక్కడికి అనుకుంటూ వస్తుంది జ్యోత్స్న. మాకు ఇల్లు, పిల్లలు, సంపారం ఉంది త్వరగా వెళ్లాలి. ఇలాంటివి నీకు అర్థం కాదులే అంటుంది దీప. మీలాంటి ఆదర్శ దంపతులను అర్థం చేసుకోవడం అంత తేలికేం కాదు అంటుంది జ్యోత్స్న. నెల రోజుల్లో నా పెళ్లి చేస్తామని మాటిచ్చారు. చేయకపోతే ఏం చేస్తారు అంటుంది జ్యోత్స్న. 

కచ్చితంగా పెళ్లి జరుగుతుంది అంటుంది దీప. మీరు ఓడిపోతే ఏం చేస్తారో అది చెప్పు అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏది అడిగితే అది ఇస్తామని మాటిస్తుంది దీప. ఆ మాటను శ్రీధర్ చాటుగా వింటాడు. ఆ తర్వాత దీప, కార్తీక్ లను తానే డ్రాప్ చేస్తానని శ్రీధర్ ని వెళ్లిపోమంటుంది జ్యోత్స్న.

58
శ్రీధర్ అనుమానం
Image Credit : Jiohotstar

శ్రీధర్ అనుమానం

మరోవైపు శ్రీధర్, కాంచన దగ్గరికి వెళ్తాడు. దీప, కార్తీక్, జ్యోత్స్నల మధ్య మనం అనుకున్న దానికంటే ఏదో సీరియస్ విషయమే జరుగుతోంది కాంచన అంటాడు శ్రీధర్. ఎలా తెలుసుకోవాలి అంటుంది కాంచన. నేను కార్తీక్ ని అడగాలి అనుకుంటున్నాను అంటాడు శ్రీధర్. అంతలో దీప, కార్తీక్ వస్తారు. మాస్టారు మీరు ఇంటికి వెళ్లలేదా అని అడుగుతాడు కార్తీక్. జ్యోత్స్న గురించి గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని చెప్తాడు శ్రీధర్. నీతో కొంచెం మాట్లాడాలి అని కార్తీక్ ని తీసుకొని బయటకు వెళ్తాడు శ్రీధర్.

68
దీప డౌట్
Image Credit : Jiohotstar

దీప డౌట్

శౌర్య ఏది అత్తయ్య అని అడుగుతుంది దీప. ఆడి ఆడి అలిసిపోయి పడుకుంది అని చెప్తుంది కాంచన. అక్కలేదు కదా.. అది ఏదైనా అడిగితే చేసి పెట్టలేకపోతున్నాను అంటుంది కాంచన. నేను చూసుకుంటాను అత్తయ్య అంటుంది దీప. నేను కూడా అదే కోరుకుంటున్నాను అంటుంది కాంచన. 

అయినా ఇంకెన్నీ రోజులులే. ఇప్పుడు జ్యోత్స్న సీఈఓ అవుతుంది, ఆ తర్వాత పెళ్లి కూడా అవుతుంది. మీ అగ్రిమెంట్ నుంచి విముక్తి దక్కుతుంది. ఆ తర్వాత మీరు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. కార్తీక్, నువ్వు కలిసి ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు అంటుంది కాంచన. అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతోంది అని ఆలోచనల్లో పడుతుంది దీప.

78
తాళి కట్టమంటే కడతావా?
Image Credit : Jiohotstar

తాళి కట్టమంటే కడతావా?

మరోవైపు శ్రీధర్.. నేను అడిగిన దానికి నిజమే చెప్తానని నాకు మాటివ్వమని కార్తీక్ ని అడుగుతాడు. కన్నవాళ్ల దగ్గర దాచే అన్నీ నిజాలు మా దగ్గర ఏమి లేవు అడగండి అంటాడు కార్తీక్. జ్యోత్స్నతో నువ్వు, దీప మాట్లాడటం నేను విన్నాను. ఏదైనా ఇస్తామని ఎందుకు మాటిచ్చారు? నిన్ను తన మెడలో తాళి కట్టమంటే కడతావా అని అడుగుతాడు శ్రీధర్.

ఇవన్నీ ఎందుకు? అసలు దీపకు ఆ ఇంటికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. సంబంధం ఉంది. కానీ ఇప్పుడు చెప్పను. ఏదో ఒక రోజు నీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. ఇవన్నీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమని చెప్పి శ్రీధర్ ను పంపిస్తాడు కార్తీక్.

88
జ్యోత్స్నే ఎందుకు?
Image Credit : Jiohotstar

జ్యోత్స్నే ఎందుకు?

మరుసటి రోజు ఉదయం ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుంటుంది. శివన్నారాయణ ఏదో చెప్పబోతుండగా.. దశరథ అడ్డుపడతాడు. మన ఫ్యామిలీలో నుంచి ఎవరో ఒకరు సీఈఓ కావాలని బోర్డు మెంబర్స్ కోరుకుంటున్నారు. ఆ ఒక్కరు జ్యోత్స్ననే ఎందుకు కావాలి? వేరే వాళ్లు ఎందుకు కాకూడదు అని అడుగుతాడు దశరథ. 

అయితే కార్తీక్ ను సీఈఓ చేయండని కొందరు సభ్యులు చెప్తారు. లేదు జ్యోత్స్ననే సీఈఓ ఉండాలని మరికొందరు బోర్డు మెంబర్స్ గొడవ పడతారు. కొన్ని కారణాల వల్ల నేను సీఈఓగా ఉండలేకపోతున్నాను అని చెప్తాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న పారు-ఏం చేయబోతోంది?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: పారుతో కలిసి జ్యో కొత్త ప్లాన్- కార్తీక్ కి బిగ్ షాక్- సీఈఓగా జ్యో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved