Karthika Deepam: హిమకు అత్త వేధింపులు.. నిరుపమ్ తో ప్రేమలో పడ్డ శౌర్య!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుట్టుకోగా.. ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

సౌర్య (Sourya) తన ఆటోని కారుకి అడ్డంగా పెట్టి మేటర్ ఎక్కువ చేస్తే మీటర్ పగిలిపోతుంది అని ప్రేమ్ ను బెదిరిస్తుంది. మరోవైపు సౌందర్య (Soundarya) ఫ్యామిలీ మొత్తం భోజనం చేస్తూ ఉండగా హిమ మాత్రం భోజనం చేయకుండా తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండ ఇప్పుడు సౌర్య
ఏం చేస్తుందో అని వాళ్ళ నానమ్మ తో అంటుంది. దాంతో వాళ్ళ నానమ్మ ధైర్యం చెబుతుంది. అదే క్రమంలో ఆనందరావు (Anand Rao) తను కావాలనే తప్పించుకుని తిరుగుతుందేమో అని అంటాడు. ఆ తర్వాత సౌర్య.. ఇంద్రుడు (Indrudu), చంద్రమ్మ లను తీసుకొని పని కోసం సత్య ఇంటికి వస్తారు.
ఇక అక్కడ సత్య కొడుకు అయినటువంటి ప్రేమ్.. సౌర్యను చూసి విరుచుకు పడతాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్నతో అసలు వీళ్ళను ఇంట్లోకి ఎందుకు రానించావు అని అంటాడు. ఇక సౌర్య (Sourya) కూడా ఏమాత్రం తగ్గకుండా క్లాస్ కి దిగుతుంది. అంతేకాకుండా వీళ్ళని వంట పని చేయడానికి పెట్టుకోవద్దని అంటాడు. కానీ ఆల్రెడీ సత్య (Sathya) మాట ఇచ్చేస్తాడు.
మరోవైపు హిమ, నిరూపమ్ లు స్వప్న వాళ్ళ ఇంటికి వెళతారు. ఇక వాళ్ళిద్దర్నీ చూసిన స్వప్న ఎందుకురా ఇంత లేట్ అయింది అని అడుగుతుంది. అంతేకాకుండా వచ్చేటప్పుడు కార్ నువ్వు నడిపావ లేక ఆమె నడిపిందా అని హిమ (Hima) ను అనేక మాటలతో దెప్పి పొడుస్తుంది.
దానికి హిమ (Hima) మనసులో ఎంతో బాధను వ్యక్తం చేసి అత్తయ్య నేను జరిగిన దానికి ఎంతో కుమిలిపోతున్నాను. చనిపోవాలి అనిపిస్తుంది అప్పుడప్పుడు అని ఏడుస్తుంది. ఇక సప్న (Swapna) సౌర్య మాటలను ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఇంకొకసారి నువ్వు మా ఇంటికి రాకపోవడమే మంచిది అని అంటుంది. దాంతో హిమ చాలా బాగా బాధపడుతుంది.
ఆ తర్వాత ప్రేమ్ (Prem) మాటలకు అసహనం వ్యక్తం చేసిన సౌర్య తన చొక్కా కాలర్ పట్టుకొని బెదిరిస్తుంది. దాంతో ప్రేమ్ సౌర్యను గట్టిగా పట్టేస్తాడు. దాంతో సౌర్య అటుగా వెళుతున్న నిరూపమ్ ఒడిలో పడుతుంది. అదే క్రమంలో సౌర్య వాళ్ళ నానమ్మ సౌందర్య (Soundarya) ను చూసి స్టన్ అవుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.