- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Feb 23: భాగ్యానికి దొరికిపోయిన నర్మద సాగర్, వల్లికి పండగే పండగ
Illu Illalu Pillalu Today Episode Feb 23: భాగ్యానికి దొరికిపోయిన నర్మద సాగర్, వల్లికి పండగే పండగ
Illu Illalu Pillalu Today Episode Feb 23: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద భర్త ప్రాణాల కోసం తన నగలను తాకట్టు పెట్టి వనజకు 20 లక్షలు ఇప్పిస్తుంది. అయితే ఈ విషయాన్ని భాగ్యం బ్యాచ్ కనిపెట్టేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

నగలు తాకట్టు పెట్టిన నర్మద
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ఇరవై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో తెలియక సాగర్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు నర్మద ముందుకు వచ్చి తన భర్త ప్రాణాలను కాపాడేందుకు తన నగలను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడుతుంది. నర్మద దొంగ చాటుగా నగలను చీరలో దాచుకొని వెళ్లడం ఇడ్లీ బాబాయ్ చూసేస్తాడు. అదే విషయాన్ని భాగ్యానికి చెబుతాడు. భాగ్యం ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటి వాళ్ళ వెనకే వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మని చెబుతుంది. దాంతో ఇడ్లీ బాబాయ్.. నర్మద, సాగర్ ను ఫాలో అవుతూ వెళతాడు. నర్మద, సాగర్ కలిసి నగల దుకాణానికి వెళతారు. అయితే నర్మద తెచ్చిన నగలకు తొమ్మిది లక్షలు మాత్రమే వస్తాయని చెబుతాడు వడ్డీ వ్యాపారి.
నర్మద తమకు మాత్రం 20 లక్షలు కావాలని అడుగుతుంది. కనీసం అప్పుగానైనా ఇవ్వండి అని బతిమిలాడుతుంది. వ్యాపారి ‘నువ్వు ప్రసాద్ గారి అమ్మాయివి, ఇతను రామరాజు గారి అబ్బాయి కదా’ అని అడుగుతాడు ఇద్దరు అవునని చెబుతారు. మిగతా మొత్తాన్ని లోను కింద ఇమ్మని అడుగుతారు. దానికి వడ్డీ వ్యాపారి రెండు రూపాయల వడ్డీతో అప్పు ఇస్తానని చెబుతాడు. దానికి నర్మదా సాగర్ ఓకే చెబుతారు. వడ్డీ వ్యాపారి నుంచి 20 లక్షలు తీసుకొని వనజ ఇంటికి వెళతారు సాగర్, నర్మద. ఇదంతా ఇడ్లీ బాబాయ్ చూసేస్తాడు.
వల్లికి ప్రేమ వార్నింగ్
ఇక ఇక్కడి నుంచి సీను ధీరజ్ దగ్గరికి మారుతుంది. చాలా ఆవేశంగా ఇంటికి వస్తాడు. వెనకే ప్రేమ కూడా వచ్చి గదిలోకి వెళ్లి తలుపులు వేస్తుంది. ఇదంతా శ్రీవల్లి చూసి ఏదో జరుగుతుంది, మేటర్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి.. తలుపు దగ్గరే చెవిపెట్టి వింటుంది. ప్రేమ ధీరజ్ తో ఎందుకంత పని చేశావు, నీకు ఉద్యోగం ఇచ్చిన వాడిని కాలర్ పట్టుకుంటావా అని అడుగుతుంది. దానికి ధీరజ్ మా నాన్నను తక్కువ చేసి మాట్లాడతాడా అని అరుస్తాడు. ఇదంతా బయట నుంచి శ్రీవల్లి వినేస్తుంది. ప్రేమ, ధీరజ్ లు జరిగిన విషయం మొత్తం మాట్లాడతారు. దీంతో శ్రీవల్లికి అసలు విషయం అర్థమైపోతుంది. ఈ లోపు ప్రేమ ‘ఇలా గొడవలు పడటం వల్ల ఉపయోగం లేదు.ఇలాగే అయితే డ్రైవర్ గా ఉండిపోతావు. మీ సాగర్ అన్న జాబ్ కొట్టాడుతా. అలాగే నువ్వు అడుగు ముందుకు వెయ్యు. నచ్చిన ఫీల్డ్ లో అడుగు పెట్టు. ఆవేశపడకుండా ఆలోచించు’ అని చెప్పి తలుపులు హఠాత్తుగా తీస్తుంది. ఈ లోపు అక్కడ వల్లి పిల్లిలా వినడం ప్రేమ కనిపెట్టేస్తుంది. ప్రేమను చూసి శ్రీవల్లి బూజు దులుపుతున్నట్టు నటిస్తుంది. కానీ ప్రేమకు విషయం అర్థమైపోతుంది.
ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది ప్రేమ. దానికి వల్లి కనిపించడం లేదా బూజులు దులుపుతున్నా చెల్లాయి అని అంటుంది .కానీ ప్రేమకు కోపం వచ్చి ‘నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? సిగ్గు లేదా? తలుపుల దగ్గర చెవి పెట్టి వినడానికి సిగ్గు అనిపించడం లేదా? ఇలాంటి వేషాలు వేశావంటే తలని రెండు తలుపులు మధ్య పెట్టి నొక్కి పడేస్తా’ అని తిడుతుంది ప్రేమ.
వనజకు ఇచ్చిపడేసిన నర్మద
ఇక్కడ నుంచి సీను నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద వనజ ఇంటికి వెళ్లి నిల్చుంటుంది. వనజ లోపలికి రమ్మని మర్యాదగా పిలుస్తుంది. దానికి నర్మద ‘మేము లోపలికి రాము. మర్యాద లేని వాళ్ళం కదా, లోపలికి వస్తే మీ మర్యాద పోతుంది. అయినా మనసు చంపుకొని ఇంతవరకు వచ్చాము. మర్యాదగా వచ్చి మీ డబ్బుల్ని మీకు ఇస్తున్నాము’ అని డబ్బులు వనజ చేతికి ఇచ్చేస్తుంది. వనజ ఆ డబ్బులు కొడుకుకి ఇచ్చి లెక్క పెట్టమని చెబుతుంది. వనజ కొడుకు కరెక్ట్ గానే ఉన్నాయని చెబుతాడు. అప్పుడు నర్మద ‘ రామరాజు గారి కుటుంబం అంటే తేడా రాదు. అది డబ్బు అయినా మర్యాద అయినా’ అని అంటుంది. ఆ తర్వాత వనజ కొడుకు మనోహర్ దగ్గరికి వెళుతుంది నర్మద. ‘చూడు మనోహర్ నువ్వు కాలేజీలో ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదా? నిజం చెప్పు’ అని అడుగుతుంది. దానికి మనోహర్ సమాధానం చెప్పకుండా తలదించుకుంటాడు.
‘వనజ గారు చూశారా తలదించుకున్నాడు. అంటే తను కూడా లవ్ చేశాడని అర్థం. ఎవరినో ప్రేమించిన తర్వాతే అమూల్యని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ల గౌరవ మర్యాదలు పోతాయా? తప్పు చేసింది అమూల్య, కానీ మా మామయ్య కాదు. ఆయన ఎప్పుడూ నీతిగానే బతికారు. మీరంటే మాకు గౌరవం ఉంది. దాన్ని కాపాడుకోండి’ అని వనజకు గట్టిగానే క్లాస్ పీకి వెళ్లిపోతుంది. కానీ వనజకు మాత్రం నాకే వచ్చి క్లాస్ పీకుతుందా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నర్మద... సాగర్ తో మాట్లాడుతూ మన ఇంటికి కాదు.. మా ఇంటికి పద.. మీ మామయ్య లెక్కలు కూడా తేల్చాలి అంటుంది.
భాగ్యానికి తెలిసిపోయింది
ఇక ఇక్కడి నుంచి సీన్.. భాగ్యం దగ్గరికి మారుతుంది. భాగ్యం.. సాగర్ నర్మదలపై ఒక కన్నేసి ఉంచుతుంది. సాగర దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి వీడియోను తీస్తుంది భాగ్యం. ఆ వీడియోను మీనాక్షికి పంపిస్తుంది. అతను ఎవరో కనుక్కోమని చెబుతుంది. మీనాక్షి మళ్ళీ ఫోన్ చేసి ‘అతను ఒక ఏజెంటు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడు’ అని చెబుతుంది. దాంతో భాగ్యం ‘అమ్మా సాగరు అమాయకుడిలా నటిస్తూ ఎంత డ్రామా ఆడావు’ అని అనుకుంటుంది. ఇలా అనుకుంటుండగాని ఇడ్లీ బాబాయ్ అక్కడికి వస్తాడు. నర్మద నగల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న విషయం చెబుతాడు. ఆ మాట వినగానే తల్లి కూతుళ్ళకి మండిపోతుంది. నర్మద పని పట్టాలని ఇద్దరు అనుకుంటారు. అటు నర్మద చేసిన తప్పు, ఇటు సాగర్ చేసిన తప్పు బయట పెట్టాలనుకుంటారు. నర్మద పరువు రామరాజు ముందు తీయాలని భావిస్తారు. భాగ్యం కోపంగా ‘నా కూతుర్నే కొడతావా? చెప్తా అనే సంగతి. ఆ ఏజెంట్ గారి దగ్గర నుంచే నరుక్కు రావాలి’ అనుకుంటుంది భాగ్యం. ఇక్కడితో ఎపిసోడ్ మెగాసిపోతుంది.

