- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 25: రామరాజు కుటుంబంలో పెద్ద కుంపటి, అమూల్య లవ్ మ్యాటర్ రివీల్
Illu Illalu Pillalu Today Episode Dec 25: రామరాజు కుటుంబంలో పెద్ద కుంపటి, అమూల్య లవ్ మ్యాటర్ రివీల్
Illu Illalu Pillalu Today Episode Dec 25: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో అమూల్య, విశ్వక్ ల గురించి దాదాపు అందరికీ తెలిసిపోతుంది. అయితే అమూల్య, విశ్వక్ మధ్య బంధానికి ప్రేమే కారణమని ధీరజ్ గొడవపడతాడు. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడండి.

ప్రేమ- ధీరజ్ గొడవ
అమూల్యను విశ్వతో చూసిన ధీరజ్ కు విపరీతంగా కోపం వస్తుంది. ప్రేమతో మాట్లాడుతున్న విశ్వక్ దగ్గరకు వచ్చి చితక్కొడతాడు. కోపంలో ప్రేమ, ధీరజ్... ఒకరినొకరు కొట్టుకుంటారు. తర్వాత ప్రేమ వివరించే ప్రయత్నం చేస్తే ధీరజ్ కోప్పడతాడు. విశ్వక్, అమూల్య మధ్య బంధానికి నువ్వే కారణం అని, ఈ మధ్యన కుటుంబం పై విపరీతమైన ప్రేమ చూపిస్తున్నావని అంటాడు. ‘మొన్న మీ నాన్న తాగి ఎక్కడో రోడ్డు మీద పడిపోతే ఇంట్లో అందరూ ఉన్నా నువ్వే వెళ్ళావు.. అలాగే రెండు కుటుంబాలను కలపడమే నీ కల అని చెప్పావు.. కాబట్టి ఈ అనుబంధానికి కూడా నువ్వే కారణం’ అని ప్రేమను నిందిస్తాడు. మీ అన్నయ్య నా చెల్లెలు ట్రాప్ చేయడం నీ ఆలోచనల్లో భాగమేనని అంటాడు. రెండు కుటుంబాలను కలిపేందుకే నా చెల్లెల్ని మీ అన్నయ్యని ప్రేమ పేరుతో కలపాలని చూస్తున్నావు.. నీ ఇష్టానికి వచ్చినట్టు ఆలోచించి ఏదో మాట్లాడుతున్నావ్ అంటూ నిందిస్తాడు ధీరజ్. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది ప్రేమ. అయినా సరే ధీరజ్ ఏమాత్రం వినడు.
నా చెల్లిది తప్పు లేదు
ప్రేమ తన అన్నయ్య విశ్వక్ చెప్పిన విషయాలను ధీరజ్ కు వివరిస్తుంది. మా అన్నయ్య అమూల్యను ప్రేమ పేరుతో ట్రాప్ చేయలేదు, అమూల్య మా అన్నయ్యను ప్రేమిస్తోంది అని చెప్పగానే ధీరజ్ షాక్ అవుతాడు. అమూల్య వద్దని చెప్పినా వినడం లేదు అర్థం చేసుకోవడం లేదు, మా అన్నయ్య లేకపోతే చచ్చిపోతాను అంటోందట.. తప్పంతా మీ చెల్లి దగ్గర పెట్టుకొని అన్యాయంగా మా అన్నయ్యని ఎందుకు అంటున్నావు అని గొడవపడుతుంది ప్రేమ. ధీరజ్ మాట్లాడుతూ ‘ నా చెల్లి గురించి నాకు తెలుసు అబ్బాయి కూడా తలెత్తి చూడదు.. మీ అన్నయ్య అంటే పరమ అసహ్యం మీ అన్నయ్యని కాపాడుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నావ్’ అంటూ ప్రేమను తిడతాడు. అమూల్యతో మాట్లాడిన తర్వాత నీ సంగతి, మీ అన్నయ్య సంగతి మా ఇంట్లో తేలుస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ధీరజ్.
విశ్వను కొట్టిన నర్మద
ఇక్కడ నుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద.. విశ్వ, అమూల్య బండి మీద వెళుతూ ఉంటే వారిని ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది. అమూల్యను విశ్వా గుడికి తీసుకొస్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అమూల్య అడుగుతుంది. ‘మన ప్రేమ విషయం మీ అన్నయ్యలకు తెలిసిపోయింది. ఈ విషయ మీ నాన్నకు తెలిస్తే మీ వాళ్ళు మనల్ని విడదీస్తారు. అందుకే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి’ అని చెబుతాడు విశ్వక్. నర్మద కూడా ఈ లోపు అదే గుడికి చేరుకుంటుంది. అమూల్య ‘మా నాన్నకు చెప్పకుండా మా వాళ్ళ అనుమతి లేకుండా నేను పెళ్లి చేసుకోను’ అని చెబుతుంది. అమూల్యను పెళ్లి కోసం చాలా బతిమిలాడతాడు విశ్వ. కానీ అమూల్య ఒప్పుకోదు. ఇదంతా నర్మద చూస్తుంది. వెంటనే గట్టిగా అరుస్తుంది. దాంతో విశ్వక్, అమూల్య ఇద్దరూ షాక్ అవుతారు. నర్మదా కోపంతో విశ్వ చెంప పగలగొడుతుంది. ఈలోపు ప్రేమ అక్కడికి వస్తుంది. మా అన్నయ్యని కొడితే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో నర్మద చాలా షాక్ అవుతుంది.
ఈ లోపు అక్కడికి ధీరజ్, సాగర్ కూడా వస్తారు. నర్మద మాట్లాడు ‘మీ అన్నయ్య అమూల్యని ట్రాప్ చేశాడు, అయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా’ అని అంటుంది నర్మద. అయినా సరే ప్రేమ వినదు. అక్కడికి సాగర్, ధీరజ్ కూడా రావడంతో విశ్వ భయపడతాడు. పెద్దోడు కూడా వచ్చి సాగర్, ధీరజ్ విశ్వపై చేయి చేసుకోకుండా అడ్డుకుంటాడు. విశ్వక్ ను చంపేస్తామని సాగర్, ధీరజ్ బెదిరిస్తారు. పెద్దోడు మాట్లాడుతూ నాకు వారిద్దరి ప్రేమ విషయం ముందే తెలుసని చెబుతాడు. ముగ్గురు అన్నదమ్ములు కాసేపు తోపులాట చేసుకుంటారు. ఇదంతా చూసి విశ్వ చాలా ఆనందిస్తాడు.
బాధపడిన రామరాజు
ఇక ఇక్కడి నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. రామరాజుకు వేదవతికి విషయం తెలిసిపోతుంది. వేదవతి కోపంతో అమూల్యను కొడుతుంది. నీ వయసెంత నీకు ప్రేమలు కావాల్సి వచ్చాయా? బుద్ధిగా చదువుకోమని చెబితే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా? అని బాగా కొడుతుంది. ఆరోజు బండిమీద చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది.. కానీ నేను అడిగితే నువ్వు ఏవేవో చెప్పావు అని కోప్పడుతుంది వేదవతి. బాధతో చాలా ఏడుస్తుంది. రామరాజు వేదవతిని ఊరుకోబెడతాడు. ‘ఏదైనా పాపం చేస్తే గుండెల మీద తన్నే పిల్లలు పుడతారు అంటారు. నేను ఏ పాపం చేశానమ్మ నా కడుపున నా గుండెల మీద తన్నే పిల్లలే పుట్టారు. ఓ తండ్రిగా నేను మీకు ఏదైనా లోటు చేశానా? నా ప్రేమలో పెంపకంలో ఏదైనా లోపం ఉందా చెప్పమ్మా? అంటూ రామరాజు బాధపడతాడు. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

