- Home
- Entertainment
- TV
- Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద
Illu Illalu Pillalu Today:తనను ఉద్యోగానికి పంపాలని చూస్తున్నారని నర్మద,ప్రేమల మీద వల్లి కక్ష కడుతుంది. కావాలనే నర్మదకు వ్యతిరేకంగా సాగర్ కి ఎక్కిస్తుంది. ప్రేమకు వ్యతిరేకంగా ధీరజ్ కి ఎక్కిస్తుంది. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా

ఇల్లు, ఇల్లాల్లు పిల్లలు..
ప్రేమ తన తండ్రిని దగ్గరుండి ఇంటికి పంపించడం ధీరజ్ కళ్లారా చూస్తాడు. కాదు.. కాదు.. చూసేలా వల్లి చేస్తుంది. దీంతో... దాని గురించే ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ ఈ రెండు కుటుంబాలను కలపాలని చూస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా.. ఈ వల్లి వచ్చి ధీరజ్ ఇంత కూల్ గా ఉన్నాడేంటని.. కాస్త చిచ్చు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. కావాలనే ధీరజ్ దగ్గరకు వచ్చి ధీరజ్ కి కోపం తెప్పించేలా చేస్తుంది. ధీరజ్ ఇంత కూల్ గా ఎందుకు ఉన్నాడా అని ఆలోచించి... ప్రేమను ఏడిపించాలని డిసైడ్ అయ్యి... ఈసారి ఇంకో రెండు, మూడు అగ్గిపెట్టెలు ఎక్కువ వెలిగిద్దాం అని అనుకుంటుంది. వెంటనే ధీరజ్ దగ్గరకు వెళ్లి మాట్లాడటం మొదలుపెడుతుంది.
‘ ఏంటి ధీరజ్.. ప్రేమ వాళ్ల నాన్నను ఇంటి దగ్గరకు తీసుకువచ్చిన దాని గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ల నాన్న అంటే ప్రేమకు బోలేడంత ప్రేమ. ఎక్కడో పడిపోయిన మనిషిని వెతుక్కుంటూ వెళ్లి మరీ ఇంటికి తీసుకువచ్చింది. ప్రేమ చేసింది మంచి పనే కానీ... ఎదురింటి వాళ్లు అంత మంచి వాళ్లు కాదు కదా.. ప్రతి చిన్న విషయానికి మీ నాన్నతో గొడవ పడుతున్నారు. మరి, ఈ విషయానికి కూడా మీ నాన్నగారితో గొడవ పడితే...? ఇంకోసారి మీ నాన్న గారి చొక్కాను నడి రోడ్డు మీద చించేసి అవమానిస్తే.... ఒక పని చేసే ముందు ప్రేమ ఇవన్నీ ఆలోచించాలి కదా.. ప్రేమకు వాళ్ల నాన్న గారి మీద ఉన్న ప్రేమ మీ నాన్న గారి చొక్కా చించడానికి కారణం అయితే.. వాళ్లొచ్చి చిటికీ మాటికీ గొడవ పడతారు. మాట్లాడితే చొక్కా చించేస్తారని తెలిసి కూడా ప్రేమ ఇలా చేయడం ఎంటో నాకు అర్థం కావడం లేదు ధీరజ్. ప్రేమను చూస్తుంటే.. మనిషి మాత్రమే ఇక్కడుంది.. మనసు మాత్రం పుట్టింట్లోనే ఉంది. పుట్టిల్లు అంటే.. ఏ ఆడ పిల్లకు అయినా ప్రేమ ఉంటుంది.కానీ దాని వల్ల గొడవలు జరగకుండా, మామయ్య గారెని అవమానించకుండా ఉంటే చాలు. సర్లే ధీరజ్ జరిగిందేదో జరిగిపోయింది’ అని అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటుంది. ప్రేమ ధీరజ్ ని పిలవడంతో.. వామ్మో.. ఈ సీమ టపాకాయ వచ్చేస్తోందని వెళ్లిపోతూ ఉంటుంది. ఆ వల్లి వెళ్లిపోవడం ప్రేమ చూస్తుంది కానీ పెద్దగా పట్టించుకోదు. కానీ.. వల్లి మాట్లాడే ప్రతి మాటకు ధీరజ్ ముఖంలో రంగులు మారిపోతాయి.. గతంలో తన తండ్రికి జరిగిన అవమానాలన్నీ ధీరజ్ కి గుర్తుకు వస్తాయి. అందుకే.. అక్కడే ఉండిపోతాడు.
ప్రేమ మనసు అర్థం చేసుకొని ధీరజ్..
ప్రేమ వచ్చి భోజనానికి పిలిచినా కనీసం పలకకుండా అక్కడే ఉండిపోతాడు. ‘ నీ కోపానికి కారణం నాకు అర్థమైంది. కానీ మా నాన్న నా కారణంగా మందుకి బానిస అయ్యారు. నా కారణంగా తాగేసి ఎక్కడి పడిపోయారు. ఇంటికి తీసుకురావడానికి ఎవరూ లేరని మా అమ్మ కంగారు పడుతుందని.. నేను వెళ్లాను. నువ్వు అర్థం చేసుకోకుండా కోపంగా ఉంటే ఎలా? ’ అని ప్రేమ వివరించి చెబుతున్నా కూడా ధీరజ్ కనీసం మాట్లాడడు. దీంతో ప్రేమ..‘ ఓరేయ్ నీకు దండం పెడతాను రా.. మాట్లాడరా.. నేను మా నాన్నను తీసుకురావడం నీకు నచ్చకపోతే, కోపం తెప్పిస్తే.. ఆ కోపాన్ని కక్కేయ్..ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో.. మాట్లాడేయ్.. ఇలా సైలెంట్ గా ఉండి చంపకు.. అబ్బా.. ఇంత చెప్పినా అర్థం చేసుకోవేంటి రా? ఒక మాట అడుగుతా చెబుతావా? నీకు మా నాన్నతో ప్రాబ్లం ఉండి మాట్లాడకపోయిన సమయంలో.. మీ నాన్నకు సమస్య వస్తే.. నువ్వు వెళ్లకుండా, సహాయం చేయకుండా ఉంటావా? నేను కూడా అంతేరా.. దయచేసి అర్థం చేసుకో’ అని ప్రేమ ఎంత చెప్పినా ధీరజ్ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ధీరజ్ తనను అర్థం చేసుకోలేదని ప్రేమ బాధ పడుతుంది.
ఘోరంగా మోసపోయిన సాగర్...
మరోవైపు సాగర్... తన తండ్రి అన్న మాటలను తలుచుకొని బాధ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని స్నేహితుడు పుష్పరాజ్ కలుస్తాడు. అతను స్టాక్ మార్కెట్ల ద్వారా కోట్లు సంపాదించాను అని చెబుతాడు. అది విని సాగర్ షాక్ అవుతాడు. తాను కూడా స్టాక్స్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. ఎవరికో ఇవ్వమని తండ్రి ఇచ్చిన డబ్బును కాస్త... అతనికి ఇస్తాడు. నిజంగా లాభాలు వస్తాయని నమ్మ పుష్ప రాజ్ చేతిలో రూ.లక్ష పెడతాడు. వారం రోజుల్లో మూడు లక్షలు ఇస్తాను అని చెప్పి అతను నమ్మించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఉద్యోగం కొనడానికి డబ్బులు వచ్చేసినట్లే అని సాగర్ సంబరపడుతూ ఉంటాడు. ఇక.. తండ్రి ఇవ్వమని చెప్పిన షాప్ అతనికి కేవలం లక్ష రూపాయలు ఇచ్చి.. మిగిలినవి తర్వాత ఇస్తానని చెబుతాడు. నాన్నకు తెలిసేలోగా.. ఈ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అనుకుంటాడు. ఆనందంగా బండి మీద తిరుగుతూ ఇంటికి చేరుకుంటాడు.
సాగర్ చెంపలు పగలకొట్టిన నర్మద...
రాత్రికి ఇంటికి చేరుకున్న తర్వాత తన స్నేహితుడు పుష్ప రాజ్ కి ఫోన్ చేస్తాడు. కానీ.. అతను ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో.. వాడిని నమ్మి మోసపోయానని, లక్ష రూపాయలు పోగొట్టుకున్నానని కూర్చొని బాధపడుతూ ఉంటాడు. సాగర్ అలా ఉండటం చూసి.. ఏమైంది అని నర్మద అడుగుతుంది. కానీ.. సాగర్ ఏం లేదు అని చెప్పకుండా తప్పించుకుంటూ ఉంటాడు. నర్మద రెట్టించి అడగడంతో మొదట విసుక్కుంటాడు. నర్మద మరింత గట్టిగా అడగడంతో.. సాగర్.. వల్లి తనతో అన్న మాటలు తలుచుకుంటాడు. ఆ కోపాన్ని ఇక్కడ చూపిస్తాడు. ‘ ముందు నేను ఒకటి అడుగుతాను దానికి సమాధానం చెప్పు ’ అని సాగర్ అంటాడు. ఏంటి అని నర్మద అడిగితే.. ‘ నేను రైస్ మిల్లులో పని చేయడం నీకు అవమానంగా ఉందా? ’ అని అడుగుతాడు. ‘ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?’ అని నర్మద అంటే... ‘ గవర్నమెంట్ ఉద్యోగం చేసే నీకు.. రైస్ మిల్లులో పని చేసేవాడు భర్తగా వచ్చాడు అని నువ్వు నా నామూషీగా ఫీలౌతూ ఎవరితో అయినా నీ బాధలు చెప్పుకున్నావా?’ అని అడుగుతాడు. ‘ ఈ మాట నీతో ఎవరు అన్నారు అని నర్మద అడిగితే.. ‘ ఎవరో ఒకరు అన్నారు లే నర్మద.. నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధించలేని అసమర్థుడిని.. నా బతుకు రైస్ మిల్లులోనేని నువ్వు ఫీల్ అవుతున్నావా లేదా? ఇవన్నీ నిజాలా కాదా?’ అని సాగర్ అంటాడు.
‘ నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. కానీ నీతో ఈ మాటలు చెప్పింది ఎవరు?’ అని నర్మద అనుమానంగా అడుగుతుంది. ఇంట్లో వాళ్లే అని సాగర్ చెప్పడంతో అది వల్లి పనే అని నర్మదకు అర్థమౌతుంది. వెంటనే భర్త చెంప పగలకొడుతుంది. ‘ ఏంట్రా.. నువ్వు రైస్ మిల్లులో పని చేస్తున్నావని నేను ఫీలౌతున్నానా? గవర్నమెంట్ జాబ్ చేసే నాకు రైస్ మిల్లులో మూటలు మోసేవాడు భర్తగా దొరికాడు అని బాధపడుతున్నానా? ( మరోసారి చెంప పగలకొడుతుంది.) ఎవరో చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దెబ్బలు పడతాయి..(కాలర్ పట్టుకొని) ఎందుకొచ్చాను రా నేను నీ జీవితంలోకి.. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని వచ్చానా? నాకు తెలీదా.. నువ్వు రైస్ మిల్లులో పని చేస్తున్నావని తెలిసే ప్రేమించాను కదా, నీ గురించి అన్నీ తెలిసే కదరా నీ కోసం నా వాళ్లను అందరినీ వదిలేసి వచ్చాను. కానీ నువ్వు ఎవరో చెప్పిన మాటలను ఎలా నమ్ముతావ్ రా?’ అనీ సీరియస్ అవుతుంది. నర్మద ఏడుస్తుంటే... సాగర్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ‘ నువ్వు కోట్లు సంపాదిస్తావని ప్రేమించలేదు....నన్ను ప్రేమగా చూసుకుంటావనే ప్రేమించాను. నువ్వు రైస్ మిల్లులో పని చేయడం మా నాన్నకు ప్రాబ్లం. నాకు కాదు... నా అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పుకోవాలని ఆయన ఉద్దేశం కానీ.. నాకు గొప్పలు చెప్పుకోవాలని నాకు లేదు. నువ్వు కూలి పని చేసి గంజి నీళ్లు పోసినా నాకు పర్వాలేదు.. నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు’ అని గట్టిగా మాట్లాడి.. తర్వాత నర్మద ఏడుస్తూ బాధపడుతుంది. దీంతో సాగర్ సారీ చెబుతాడు. వెంటనే కరిగిపోయి భర్తను హత్తుకుంటుంది. మనసులోనే వల్లి సంగతి తేల్చాలని నిర్ణయించుకుంటుంది.
వల్లికి చెక్ పెట్టేందుకు పాయసం చేసిన నర్మద, ప్రేమ
ఇక.. మరుసటి రోజు ఉదయం నర్మద, ప్రేమలు కిచెన్ లో పాయసం చేస్తూ ఉంటారు. వల్లిని ఇంటర్వ్యూకి పంపి.. మనం ఈ పాయసం షాక్ ఇద్దాం ని నర్మద, ప్రేమలు డిసైడ్ అవుతారు. మరోవైపు వల్లి భయపడుతూ ఉంటుంది. ‘ వాళ్లు నన్ను రెండుసార్లు క్షమించినట్లే క్షమించి.. నాపై పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు.. ఇప్పుడు ఎలారా దేవుడా.. ఇంటర్వ్యూ ఎలా తప్పించుకోవాలని’ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు వల్లి కారణంగా తమ భర్తలతో తమకు వచ్చిన సమస్యలను నర్మద, ప్రేమ ఒకరితో మరొకరు పంచుకుంటారు. ఇద్దరూ కలిసి వల్లి పని పట్టాలని నిర్ణయం తీసుకుంటారు. పాయసం చేసి… ఇంట్లో అందరికీ పంచి పెడతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.... మరుసటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

