- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ
Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ
Illu Illalu Pillalu Today Episode Dec 18: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఇంట్లో కొత్త నిప్పును రాజేసింది వల్లి. సాగర్ మనసులో మరింతగా బాధను పెంచేలా మాట్లాడుతుంది. అలాగే ప్రేమ - ధీరజ్ మధ్య గొడవ పెడుతుంది. ఇక నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడండి

సాగర్ కు లేనిపోనివి చెప్పి వల్లి
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి సాగర్ మనసులో బాధను మరింత పెంచేలా ప్రవర్తిస్తుంది. సాగర్ తో వల్లి మాట్లాడుతూ తను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే, తన భర్త రైస్ మిల్లులో పని చేస్తున్నాడని నర్మద చాలా బాధ పడుతుందని చెబుతుంది. ఆ బాధను తన తండ్రికి చెప్పుకోలేక, భర్తకు చెప్పుకోలేక నలిగిపోతోందని అంటుంది. చాలాసార్లు తన దగ్గరే ఆ విషయం చెప్పి బాధపడిందని చెబుతుంది. ‘మీరు అడిగారని చెప్పాను ఈ విషయం నర్మదతో చెప్పకండి. అక్కా చెల్లెలు లాంటి మా తోడికోడళ్ళ మధ్య గొడవ పెట్టకండి’ అంటూ చాకచక్యంగా ఆ విషయం నర్మద వరకు చేరకుండా తెలివిగా మాట్లాడుతుంది. సాగర్ అది విని చాలా బాధపడిపోయి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. వల్లి మాత్రం డాన్సులు వేసుకుంటూ ఆనందంతో ‘నర్మద ఈ వల్లితోనే పెట్టుకున్నావు కదా.. చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో.. మంట రాజేశాను’ అని అనుకుంటుంది.
ఇక ఇక్కడ నుంచి సీన్ విశ్వ దగ్గరికి మారుతుంది. విశ్వ దారిలో అమూల్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపు దూరం నుంచి అమూల్యను పెద్దోడు బండిపై తీసుకురావడం చూస్తాడు. వారిద్దరిని చూసి చెట్టు చాటుకు వెళ్లి దాక్కుకుంటాడు. పెద్దోడు అమూల్య ఆ చెట్టును దాటి వెళ్లిపోతారు. అమూల్య కూడా తన అన్నయ్య విశ్వను చూడలేదని ఆనందిస్తుంది. ఇక విశ్వ ద్దోడి బండిని ఫాలో అవుతూ వెళతాడు.
అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు
పెద్దోడు అమూల్యను కాలేజ్ దగ్గర దిగబెడతాడు. అమూల్య వెళ్ళిపోతుంటే పెద్దోడు ఆపి ‘అమూల్య.. నాన్న గురించి నీకు తెలుసు కదా. నాన్నకు నీ భవిష్యత్తే కాదు తన పరువు కూడా ముఖ్యమే. నాన్న పరువు పోయేలా నువ్వు ప్రవర్తిస్తే ఆయన బతకలేడు. గుర్తుపెట్టుకో. నువ్వు చదువుకునే ఏజ్ లో ఉన్నావు. ఈ వయసులో తెలియని పిచ్చి ఎట్రాక్షన్ ఉంటుంది. తెలియకుండా ప్రేమ కోరుతూ మోసపోతూ ఉంటారు. నీ మనసులో ప్రేమ అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు. ఒకవేళ ఇప్పటికే ప్రేమ ఆలోచనలు వచ్చి ఉంటే చంపేసుకో.. అంతే తప్ప పిచ్చి పిచ్చి పనులు చేసి నాన్నను తలదించుకునేలా చేయకు.. జాగ్రత్త’ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా చెట్టు చాటు నుంచి విశ్వ చూస్తాడు. పెద్దోడు అక్కడినుంచి వెళ్ళిపోతాడు. వెంటనే విశ్వ వచ్చి అమూల్యతో మాట్లాడతాడు.
అమూల్యతో పెళ్లికి సిద్ధమైన విశ్వ
విశ్వ వెంటనే అమూల్య దగ్గరికి వచ్చి మీ అన్నయ్య ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు అని అడుగుతాడు. దానికి అమూల్య మాట్లాడుతూ మా అన్నయ్య ప్రేమ వంటి విషయాలు జోలికి వెళ్లొద్దని చెబుతున్నాడు. మన విషయం తెలిసిపోయిందేమో అని అనుమానంగా ఉంది.. మా నాన్నకి చెప్పేస్తాడేమోనని భయంగా ఉంది, నాన్నకు తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది అని అంటుంది అమూల్య. విశ్వ మాత్రం నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకుండా వెళ్ళు అని చెబుతాడు.
తర్వాత వల్లికి ఫోన్ చేస్తాడు విశ్వ. వల్లి ‘ మా ఆయనకు మీ గురించి తెలిసిపోయింది. నిన్ను, అమూల్యను మా ఆయన పార్కులో కళ్ళారా చూసేసాడు. ఇంట్లో చెప్పకుండా నేనే అడ్డుకుంటున్నాను’ అని చెబుతుంది. వెంటనే విశ్వ ‘అయితే నేను అమూల్యను లేపుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. మీ ఆయన ఏ క్షణమైనా ఇంట్లో చెప్పే ప్రమాదం ఉంది. అందుకే అమూల్యను పెళ్లి చేసుకుంటాను. దీనికి నువ్వే నాకు హెల్ప్ చెయ్యాలి’ అని అంటాడు. దానికి వల్లి ఒప్పుకోకుండా ఈ విషయంలో నన్ను వదిలేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కానీ వల్లితో లాగైనా హెల్ప్ చేయించుకుంటానని మనసులో అనుకుంటాడు విశ్వ.
తండ్రి కోసం వెళ్లిన ప్రేమ
ఇక్కడ నుంచి సీన్ సేనాపతి ఇంటికి మారుతుంది. సేనాపతి భార్య భర్త ఇంకా ఇంటికి రాలేదని ఆమె కంగారు పడుతూ ఉంటుంది. తల్లి కంగారు పడడం ప్రేమ చూసి ‘ఏదైనా పనుండి ఇంటికి రాలేదేమో’ అని దూరం నుంచే సర్దిచెబుతుంది. దానికి తల్లి మాట్లాడుతూ ‘మీ నాన్న ఈ మధ్య తాగేసి ఇంటికి వస్తున్నారు. నువ్వు ఇంట్లో లేవన్న బాధను మర్చిపోవడానికి తాగుతున్నాపని చెబుతున్నారు’ అని బాధపడుతుంది సేనాపతి భార్య. వెంటనే ప్రేమ తాను వెళ్లి చూసి వస్తానని బండిమీద బయలుదేరుతుంది.
మరో పక్కా సేనాపతి కారులో తాగేసి కూర్చుని ఉంటాడు. ఆ కార్ తో పాటు ఒక విద్యుత్ స్తంభాన్ని గుద్దేస్తాడు. ఎంతమంది కార్లోంచి బయటికి రమ్మన్నా రాడు. అదే సమయానికి ప్రేమ తండ్రిని వెతుక్కుంటూ వస్తుంది. తండ్రిని బతిమిలాడి ఎలాగోలా ఒక ఆటోలో ఎక్కించి ప్రేమ కూడా అదే ఆటోలో ఎక్కుతుంది. సేనాపతి ప్రేమను తిడుతూనే ఉంటాడు. నా పరిస్థితికి నువ్వే కారణం అని అంటాడు. దానికి ప్రేమ చాలా బాధపడుతుంది.
ప్రేమను చూసేసిన ధీరజ్
ప్రేమ, సేనాపతి ఒకే ఆటోలో ఇంటిముందు ఆగుతారు. ప్రేమ తండ్రిని జాగ్రత్తగా ఆటో దించి తల్లికి అప్పజెప్పుతుంది. దీన్ని వల్లి చూస్తుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి ధీరజ్ ను తీసుకొస్తుంది. ధీరజ్.. ప్రేమ తండ్రిని జాగ్రత్తగా ఇంట్లో గేట్ వరకు దిగబెట్టడం చూస్తాడు. ప్రేమ ఇంటికి తిరిగి వస్తూ ధీరజ్ ను చూసి షాక్ అవుతుంది. ప్రేమ గతంలో రెండు కుటుంబాలు కలవాలన్నదే నా కల అని చెప్పడం ధీరజ్ కు గుర్తొస్తుంది. మరో పక్క వల్లి వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి దాక్కొని ఉంటుంది. ఇక్కడితో ఈనాటి ఎపిసోడ్ ముగిసిపోతుంది. ప్రేమ... ధీరజ్ మధ్య దూరాన్ని పెంచేందుకు వల్లి తన ప్రయత్నాలు మరింత పెంచుతుంది.

